ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరయ్యారు . కాగా ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు గ్రామీ అవార్డు లభించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న మరణించిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనను ఈ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్ కార్టర్ అందుకున్నారు. జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించారు. తన ప్రపంచ శాంతి కోసం ఎనలేని కృషి చేసిన ఆయనకు 2002లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
Author: admin
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ కు భక్తులు భారీగా హాజరయ్యారు.నేడు వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు.చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు,స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు.ఈరోజు తెల్లవారుజాము నుండే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే భక్తులపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.అయితే ఈరోజు ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుండి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.ఇటీవల మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్‌లో పంపిస్తున్నారు.ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ లోపలికి…
తండెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ…నెక్ట్స్ సినిమా ఈ టీమ్ లేకుండా ఎలా చేయాలి అని భయమేసింది.అంతబాగా చూసుకున్నారు నన్ను…తండేల్ రాజుగా నేను మారడంలో ఈ టీమ్ కృషి చాలా ఉందని నాగ చైతన్య అన్నారు.శ్రీకాకుళం వెళ్లి ఈ కథకు ప్రేరణనిచ్చిన వ్యక్తుల్ని కలుసుకొని,వారి నుండి ఎన్నో విషయాలు తెలుసుకొని కష్టపడి,ఇష్టంతో ఈ సినిమా చేశామని…చందుతో నాకు ఈడి మూడో సినిమా. నేనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం…అది టేకింగ్‌లో కనిపిస్తూవుంటుందని అన్నారు. సాయిపల్లవితో కలిసి పనిచేయడానికి ఆర్టిస్టులందరూ ఉవ్విళ్లూరతారు.అంతగొప్ప కోస్టార్ ఆమె…అద్భుతమైన టీమ్ పనిచేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని అక్కినేని నాగచైతన్య అన్నారు.కాగా ‘తండేల్’ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వంలో వహించారు.ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.అయితే ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.
నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకుంది.నాని కెరీర్‌లో తొలి వందకోట్ల సినిమా ‘దసరా’.తాజాగా అదే కాంబినేషన్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘ది ప్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు.నాని కూడా ఈ సినిమా కోసం ఇంటెన్స్‌గా జిమ్ చేస్తూ మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు.అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ఖరారైనట్టు చిత్రబృందం నిన్న ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా జెర్సీ,గ్యాంగ్‌లీడర్ చిత్రాల అనంతరం నాని, అనిరుథ్ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.ఈ మేరకు నాని తన ఎక్స్‌లో ‘మేం మా హ్యాట్రిక్‌పై ఉన్నాం..ఇది ఒక అద్భుతం అవుతుంది.. ప్యారడైజ్ ఇప్పుడు నాని, అనిరుథ్, ఓదెల సినిమా..స్వాగతం డియర్ అనిరుథ్..’ అంటూ పోస్ట్ చేయగా,‘ఇది చాలా స్పెషల్ మై డియర్ నాని.. వెర్రిగా…
అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్న భారత్ ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలో కూడా దీనిని గమనించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఐటీపై ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెరిగిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో భారత్ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతోందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ట్యాక్స్ సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ఛేంజర్ గా మారబోతోందన్నారు దేశంలో పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారని తెలిపారు . కొత్త ఆవిష్కరణలతో…
శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల ఉత్సవాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, శకటాలు, ఆట పాటలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నింపింది. ఈ 3 రోజుల కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ మరింత ఆనందింప జేయనున్నాయి. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మికత, ప్రశాంతతను ప్రతిబింబించేలా సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సంగిడి రాళ్లు, ఉలవలు బస్తాలు ఎత్తుట, కర్రసాము, కత్తిసాము, పిల్లి మొగ్గలు తదితర గ్రామీణ క్రీడలు, వెయిట్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులకు తన హాస్య భరిత నటనతో వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న నటుడు బ్రహ్మానందం. సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్ కంటెంట్ రోజువారీ జీవితంలో ఒక భాగమై పోయింది. అలాంటి బ్రహ్మానందం సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఎకౌంటు తెరిచారు. బ్రహ్మానందం ఇన్స్టాలోకి వచ్చిన క్షణాల్లోనే ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. లక్షన్నరకు పైగా ఆయనను ఫాలో అవుతున్నారు.
టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ లో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ పై గెలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. టై బ్రేక్ లో ఈ గేమ్ లో ప్రజ్ఞానంద గుకేశ్ పై విజయబావుటా ఎగురవేశాడు. 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరూ టైటిల్ కోసం టై బ్రేక్ లో తలపడ్డారు. ప్రజ్ఞానంద ఇందులో గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 135 (54; 7×4, 13×6) విధ్వంసకర బ్యాటింగ్ తో భారీ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. శివమ్ దూబే (30), తిలక్ వర్మ (24) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రిడన్ కార్సే 3 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జామీ ఓవర్టన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య…
ఇటీవల ‘డాకు మహారాజ్’తో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి.ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో చిత్రం రానుందని తెలుస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలిసింది.ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం.చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.మేలో ప్రేక్షకుల ముందుకురానుంది.దీని తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.ఈ చిత్రం పూర్తయ్యాకే బాబీ కొల్లి తెరకెక్కించే చిత్రం పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తుంది.
