రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చింది.ఈ మేరకు రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది.అయితే రెండు పాప్యులర్ రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479లను తొలగించిన జియో…ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును తగ్గించి, కేవలం 7 రోజులకు కుదించింది.ఇంతకుముందు ఈ డేటా ప్లాన్ల గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు ఉండేది.కాగా ఇక నుండి రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ, రూ. 139తో చేస్తే వచ్చే 12 జీబీ డేటా వారం రోజులే వస్తుంది.ఈ విషయాన్ని జియో తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రాయ్ ఆదేశాల ప్రకారం జియో ఇటీవల వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.రూ. 458, రూ. 1,958 ప్లాన్‌లను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.దీనిలో దేశీయంగా ఉచిత…
Author: admin
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2025-26కు సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తి ని ప్రస్తావించారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ …‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అంటూ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి పేర్కొన్నారు.పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని వెల్లడించారు. దేశంలో వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల రైతులకు…
‘గౌరవంగా చనిపోయే హక్కు’(రైట్ టు డై విత్ డిగ్నిటీ)ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్‌తో కూడా కోలుకోని రోగులకు ఉపశమనం అందించే విధంగా ఈ హక్కును ఇస్తున్నారు. అయితే దీనికి రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని ముగ్గురు డాక్టర్ లు పేషెంట్ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది డాక్టర్లతో పాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు అనుమతి ఇస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్‌ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. అయితే, సంబంధిత పేషెంట్ బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ మొదలవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల…
మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్ ఒక వివాహానికి వేదికవుతోంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్ వో) గా విధులు నిర్వహిస్తున్న సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా పెళ్లిని అక్కడ జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు. దీంతో ఈ నెల 12న పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో జరగనుంది. జమ్మూకాశ్మీర్ లో సీ.ఆర్.పీ.ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్ తో పూనమ్ గుప్తాలు పెళ్లి పీటలెక్కనున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి ఆమె నేతృత్వం వహించారు.
జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు క్రీడాకారులు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కె. నీలం రాజు స్వర్ణం సాధించాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో.. స్నాచ్లో 128 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 161 కేజీలు కలిపి మొత్తం 289 కేజీల బరువెత్తి నీలం రాజు స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఇక తెలంగాణకు చెందిన ఆశీర్వాద్ సక్సేనా సైక్లింగ్ లో కాంస్యం సాధించాడు. 120 కిలోమీటర్ల సైక్లింగ్ రోడ్డు రేసు ఫైనల్లో ఆశీర్వాద్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ రేసును ఆశీర్వాద్ 2 గంటల 48 నిమిషాల 39.029 సెకన్లలో పూర్తిచేశాడు. దినేశ్ (2 గంట 48 ని 28.509 సె) స్వర్ణం, సాహిల్ కుమార్ (2 గంట 48 ని 28.730 సె) రజతం సాధించారు.
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో భారత్ 15 పరుగులు తేడాతో విజయం సాధించి 3-1 ఆధిక్యంలోకి వెళ్లి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్య 53 (30; 4×4, 4×6) ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే 53 (34; 7×4, 2×6) కూడా దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ 30 (26; 4×4, 1×6), అభిషేక్ శర్మ 29 (19; 4×4, 1×6) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మద్ 3 వికెట్లు, జామి ఓవర్టన్ 2 వికెట్లు, అదిల్ రషీద్, బ్రిడన్ కార్సే ఒక్కో…
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైలా’.ఈ చిత్రానికి దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.సాహు గార్లపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఇటీవల చిత్రం నుండి టీజర్‌తో పాటు రెండు పాటలను విడుదల చేయగా..ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రం నుండి “ఓహో రత్తమ్మా” అనే థర్డ్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ పాటలో రీసెంట్‌గా వైరల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు.ఇందులో బార్బర్ సోను, లైలా అనే రెండు పాత్రల్లో విశ్వక్ ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తుంది. విశ్వక్ సేన్ జోడిగా ఇందులో ఆకాంక్ష శర్మ నటిస్తుంది.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. https://youtu.be/9aV9N1KSa4Q?si=TQGgtXQiFIwobC8d
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సొంత ఇళ్లు లేదని అయితే ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనేదే తన స్వప్నమని పేర్కొన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పై విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఆప్ ప్రభుత్వం కేటాయించడం లేదని కోట్ల రూపాయలతో శీష్ మహాల్ కట్టుకున్న వారికి పేదల బాధలు ఏం తెలుస్తాయని దుయ్యబట్టారు. పేదల సొంతింటి కల సాకారం కావాలంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆప్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీకి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు.
దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న మేరా ఆర్థిక సర్వే కీలకమైన వివరాలను వెల్లడించింది.అయితే వారానికి 60 గంటలకు పైగా పని చేయడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఈ సర్వే సూచిస్తోంది.రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆఫీసులో గడిపే ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.సాధారణంగా, ఉత్పాదకతను పని గంటల ఆధారంగా కొలుస్తారు. అంటే,ఎక్కువ సమయం పని చేస్తే,ఎక్కువ ఫలితాలు లభిస్తాయని భావిస్తారు. అదే విధంగా కార్యాలయల్లో వాతావరణం, సహోద్యోగులతో సంబంధాలు కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయని ఆర్థిక సర్వే తెలియజేసింది.నెలకు కనీసం రెండు నుంచి మూడు రోజులు కుటుంబ సభ్యులు,బంధువులతో గడపడం ద్వారా ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా,మెరుగైన జీవనశైలి సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది.డబ్ల్యూహెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం,ఉద్యోగస్తులపై ఒత్తిడి,ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టానికి దారితీయగలవని ఆర్థిక సర్వే హెచ్చరించింది.
పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.ఈ అంశం అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.బీజేపీ సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా,రాష్ట్రపతి భవన్ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది. ఈ మేరకు వయనాడ్ ఎంపీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా స్పందిస్తూ…తన తల్లికి రాష్ట్రపతి పట్ల అపారమైన గౌరవం ఉందని,కానీ మీడియా ఆమె వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు.కాగా క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు,దేశాన్ని నాశనం చేసిన బీజేపీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు…అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు.వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.
