Author: admin

ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఇటీవల కాలంలో మార్కెట్లు భారీ నష్టాలలో పయనించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా సూచీలు జోరును పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 535 పాయింట్లు లాభపడి 75,901 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 22,957 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.56గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ మరో అతి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. గొంగడి త్రిష 110 నాటౌట్ (59; 13×4, 4×6) సెంచరీతో అదరగొట్టింది. కమలినీ 51 (42; 9×4) హాఫ్ సెంచరీతో రాణించింది. సానికా 29 (20; 5×4) పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఏ బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. భారత బౌలర్లలో ఆయుషీ శుక్లా 4 వికెట్లు, వైష్ణవి శర్మ 3 వికెట్లు, గొంగడి త్రిష 3 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు…

Read More

ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా న్యూజిలాండ్ క్రికెటర్ అమీలియా కెర్ ఎంపికైంది. సౌతాఫ్రికా కు చెందిన లారా ఓల్వార్ట్, శ్రీలంకకు చెందిన చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను దాటి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును కైవసం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకోనుంది. కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది.…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర కార్యక్రమం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 181 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Read More

వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై భారత్ లో భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్లోని 200 కంపెనీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎటువంటి జీతాల కటింగ్ లేకుండా పూర్తిగా నాలుగు పని దినాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పలు మార్కెటింగ్, టెక్నాలజీ, ఛారిటీలు సహా 200 సంస్థలు ఈ విధానంలోకి మారినట్లు యూకే మీడియా కథనాలు వెలువడ్డాయి. ‘4 డే వీక్ ఫౌండేషన్’ చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు ఆ కథనాలు తెలిపాయి. కాగా, ఈ నిర్ణయంతో ఆయా కంపెనీలలో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ‘4 డే వీక్ ఫౌండేషన్’ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ “వారానికి ఐదు రోజుల పని దినాలు, 9 నుండి 5 వరకు జాబ్ అనేవి వందేళ్ల కిందటి విధానాలు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవని…

Read More

ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు.వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లను కాజేశారు.ప్యాకేజీపై పేర్కొన్న చిరునామాలో వినియోగదారుడు లేడని చెబుతూ రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నారు. హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానేసిన వారి ప్రమేయం కూడా ఉందని అమెజాన్‌ ప్రతినిధి జీఎస్‌ అర్జున్‌ కుమార్‌ ఆరోపించారు.అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని వివరించారు. ఈమేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా..మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. హైదరాబాద్ లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది.ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువును డెలివరీ చేస్తున్నదీ ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. గోడౌన్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్ కు చేరేవరకు సంస్థ సిబ్బంది…

Read More

ఈ సంక్రాంతికి గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు.చివ‌రికి మిక్సడ్ టాక్‌తో స‌రిపెట్టుకుంది.ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు త‌న నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన విష‌యం తెలిసిందే.అయితే ఈ సినిమా స‌క్సెస్ కాలేక‌పోయింది. దీనితో ఇదే బ్యాన‌ర్‌లో చెర్రీ దిల్ రాజు కోసం మ‌రో చిత్రం చేయ‌నున్నారు అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.తాజాగా ఇవ‌న్నీ పుకార్లేన‌ని సంబంధిత వ‌ర్గాలు తేల్చేశాయి.ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని పేర్కొన్నాయి.ప్ర‌స్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏవీ చ‌ర‌ణ్‌ వ‌ద్ద లేవ‌ని,ఆయ‌న చేతిలో కేవ‌లం ఆర్‌సీ 16, 17 చిత్రాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశాయి.బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘ఆర్‌సీ 16’ త‌ర్వాత చెర్రీ ‘ఆర్‌సీ 17’లో న‌టించ‌నున్నారు. ఇది ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు…

Read More

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార , ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ పై ధనుష్‌ దావా వేశారు.పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు నయన్‌ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పైనా దావా వేసింది.అయితే ధనుష్‌ దావాను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది.తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

Read More

ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ పెద్దగా ప్రభావం చూపించలేదు.తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసినా.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.ఇక రెండో టీ20లో ఐదు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.రెండుసార్లూ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ ఇచ్చాడు.షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో ఇబ్బందిపడ్డాడు.రాజ్‌కోట్‌ వేదికగా జరగబోయే మూడో టీ20లో అలాంటి అవకాశం ఆర్చర్‌కు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సంజు తీవ్ర సాధన చేశాడు. సిమెంట్ పిచ్‌పై కొత్త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో కలిసి బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా అతడికి సాయం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు కేవలం ప్లాస్టిక్‌ బంతితోనే పుల్, హుక్ షాట్లను ఆడాడు. అదే విధంగా ర్యాంప్, కట్ షాట్లను కొట్టాడు**. ఆ తర్వాత మరో అర్ధగంటపాటు క్లైంబింగ్‌ బాల్‌ (వేలాడదీసిన బంతులు)తో ప్రాక్టీస్ చేశాడు

Read More

ఫామ్‌ కోల్పోయి దేశవాళీ బాట పట్టిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలో దిగబోతున్నాడు. ఈనెల 30న రైల్వేస్‌తో ఆరంభమయ్యే మ్యాచ్‌లో అతడు ఢిల్లీ తరఫున ఆడబోతున్నాడు. ఢిల్లీ క్రికెట్‌ సంఘం సోమవారం అధికారికంగా విడుదల చేసిన జట్టులో కోహ్లి కూడా ఉన్నాడు. ఈ జట్టుకు ఆయుష్‌ బదోని సారథి. మంగళవారం అతడు ఢిల్లీ బృందంతో కలిసి సాధన చేయబోతున్నాడు. ఇప్పటికే విరాట్‌ టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పర్యవేక్షణలో ముంబయిలోని అలీబాగ్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. స్క్వేర్‌ ఆఫ్‌ ద వికెట్‌ షాట్లను కొట్టడం, బ్యాక్‌ఫుట్‌పై ఆడడంపై దృష్టి పెట్టాడు. 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌పై అతడు చివరిగా రంజీ ఆడాడు. ‘‘విరాట్‌ కోహ్లితో కలిసి ఆడబోతుండడం, డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోబోతుండడం ఢిల్లీ యువ ఆటగాళ్లకు మంచి అనుభవం. మా టీమ్‌లో కోహ్లి కాకుండా నవ్‌దీప్‌ సైని మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మిగతావాళ్లెవరూ జాతీయ…

Read More