Author: admin

మహా కుంభమేళాను పురస్కరించుకొని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల ఛార్జీలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర విమానయాన శాఖ సోమవారం వెల్లడించింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచినట్టు ఆ శాఖ వివరించింది. వచ్చే నెల 26 వరకూ కొనసాగనున్న మహాకుంభ్‌ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల ఛార్జీలు పెంచేస్తున్నారంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కు చెందిన అధికారులు వివిధ ఎయిర్‌లైన్‌ల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. విమానాల సంఖ్యను పెంచాలని, ఛార్జీలను నియంత్రించాలని కోరారు. ప్రస్తుతం దేశంలోని 17 నగరాల నుంచి నేరుగా 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల మంది ప్రయాణికులు విమాన సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా ఆ పుణ్యక్షేత్రాన్ని విమాన మార్గంతో కలిపే నగరాల సంఖ్యను 26కు పెంచారు.శ్రీనగర్‌ నుండి విశాఖపట్నం వరకూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమానాలు…

Read More

అమెరికాలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ నుంచి తాను వైదొలగడంపై వివేక్‌ రామస్వామి స్పందించారు. తనకు డోజ్‌ అధినేత మస్క్‌తో విభేదాలు తలెత్తాయనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా పని చేయించడం కోసం విభిన్నమైన విధానాలు అనుసరిస్తారని.. తామిద్దరం ఒకేరకమైన ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. తొలుత మస్క్‌తో విభేదాలపై స్పందిస్తూ.. ‘‘మీరు విన్నది సరికాదు. మావి పరస్పరం మద్దతు ఇచ్చే విభిన్నమైన వైఖరులు. నేను రాజ్యంగం చట్టాల ఆధారిత వైఖరిని నమ్ముతాను. మస్క్‌ టెక్నాలజీ ఆధారిత విధానాలను విశ్వసిస్తారు. అది భవిష్యత్తు ఆలోచనా తీరు. ఇక రాజ్యంగం బలోపేతం గురించి మేము మాట్లాడతాము. కానీ అది కేవలం ఫెడరల్‌ ప్రభుత్వం మాత్రమే చేయలేదు. రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మస్క్‌ను మించి టెక్నాలజీ అప్రోచ్‌ను అనుసరించేవారు మరొకరు ఉండరేమో. మా మధ్య పరస్పరం…

Read More

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌ , మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్‌ బలరాంతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.2014లో వీరంతా తనను ఓ హనీ ట్రాఫ్‌ కేసులో ఇరికించి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫ్యాకల్టీ విధుల నుంచి తొలగించారని మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్‌ దుర్గప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్‌ అండ్‌ సెషన్‌ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఫిర్యాదులో ఆయన తాను కులపరమైన దూషణలు, బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు.2014లో గోపాలకృష్ణన్‌,బలరాం మొదలైనవారు హనీ ట్రాప్‌ చేసి తప్పుడు కేసులో ఇరికించారని వీరికి ఇతర ఫ్యాకల్టీ సభ్యులు సహకరించారన్నారు. కాగా గోపాలకృష్ణన్ ఈవిషయంపై స్పందించాల్సి ఉంది.

Read More

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం కొచ్చిన్‌లో జరిగింది.ఇందులో పాల్గొన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చిత్ర నిర్మాణసంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్‌ గురించి మాట్లాడారు. రజనీకాంత్‌ తో సినిమా చేసే అవకాశం తనకు వచ్చినప్పటికీ తాను చేయలేకపోయానని అన్నారు. అది తనకు గొప్ప అవకాశమే అయినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయానని తెలిపారు. ‘‘లైకా సంస్థ గతంలో నాకొక ఆఫర్‌ ఇచ్చింది. రజనీకాంత్‌ హీరోగా ఒక సినిమాను డైరెక్ట్‌ చేయమని అడిగింది.దర్శకత్వంలో అప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాలాంటి కొత్తవారికి అది నిజంగా గొప్ప అవకాశం.దానిని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించా.నేను కేవలం పార్ట్‌ టైమ్‌ దర్శకుడిని మాత్రమే.వివిధ కారణాల వల్ల రజనీకాంత్‌ కోసం కథ సిద్ధం చేయలేకపోయా.ఆ ఆఫర్‌ కార్యరూపం దాల్చనప్పటికీ లైకాతో నా అనుబంధం కొనసాగింది.ఆ బ్యానర్‌పై హీరోగా ఒక సినిమా చేయడానికి అంగీకరించా. భారీ…

Read More

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం ప్రాసిక్యూటర్లు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 3న 6 గంటలపాటు ఆయన దేశంలో మార్షల్‌ లా విధించి, తిరుగుబాటుకు పాల్పడినట్లు ఈ కేసులో పేర్కొన్నారు. ఈ నేరారోపణలు రుజువైతే ఆయనకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష పడవచ్చు. మార్షల్‌ లా విధించిన తర్వాత యూన్‌ను పార్లమెంటు అభిశంసించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆయనను తిరిగి దేశాధ్యక్షునిగా పునరుద్ధరించాలా? లేక డిస్మిస్‌ చేయాలా? అనే అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలిస్తున్నది. మరోవైపు క్రిమినల్‌ జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగుతున్నాయి. అయితే పరిపాలనలో భాగంగానే తాను చట్టబద్ధంగా మార్షల్‌ లా విధించానని యూన్‌ తెలిపారు.

Read More

ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్‌ వేదికగా ఆ సంస్థను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టారు.నా లగేజ్‌ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు బ్యాగ్‌ ఓపెన్‌ చేయడానికి కూడా అనుమతించలేదు.వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు.సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు…నా కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్‌ కూడా వేయలేదు.ఒకవేళ ఏదైనా వస్తువు మిస్‌ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈవిధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు.తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.

Read More

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకున్నది.ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.ముంబయిలో గతంలో అరెస్టు చేసిన బంగ్లాదేశ్‌ జాతీయుడు ఉపయోగించిన సిమ్‌ సదరు మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఆ తర్వాత సదరు మహిళను అరెస్టు చేశారు.ఆదివారం బెంగాల్‌కు చేరుకున్న పోలీసులు..సోమవారం అరెస్టు చేశారు.ఖుఖుమోని జహంగీర్‌ షేక్‌గా మహిళను గుర్తించగా.. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయుడు షరీఫుల్‌ ఫకీర్‌తో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సైఫ్‌ అలీఖాన్‌పై ఈ నెల 16న దాడిన జరిగిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఆయనను కుటుంబీకులు లీలావతి ఆసుపత్రికి తరలించగా…చికిత్స తీసుకున్నారు.ప్రస్తుతం కోలుకోవడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.సైఫ్‌ దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Read More

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కు అభినందనలు తెలిపేందుకు భారత ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. మోడీతో ఏం మాట్లాడారని అమెరికా మీడియా ప్రశ్నించగా దీనిపై స్పందించిన ట్రంప్ తనకు మోడీ చిరకాల మిత్రుడని, భారత్ అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మోడీని వైట్ హౌస్ కు ఆహ్వానించినట్లు తెలిపారు. బహుశా వచ్చే నెలలో ఆయన అమెరికా వస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. మోడీ ట్రంప్ లో మధ్య మంచి స్నేహం ఉంది.2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్ లో పర్యటించగా.. అంతకు ముందు మోడీ కూడా అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Read More

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమె కుటుంబసభ్యుల పేర్లను చేర్చిన యూనస్‌ సర్కారు తాజాగా ఆమె కుమార్తె సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పదవి నుంచి తప్పించేలా పావులు కదుపుతోంది. ప్రస్తుతం సైమా డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈమె ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నారు.వృత్తిరీత్యా సైకాలజిస్ట్‌ అయిన సైమా.. నాడీ సంబంధ రుగ్మతలపై పని చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆమెను ప్రాంతీయ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.దీంతో 2024 జనవరిలో ఆమె బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి చెందిన యాంటీ కరెప్షన్‌ కమిషన్‌(ఏసీసీ) సంస్థ తన దర్యాప్తులో సైమాపై పలు ఆరోపణలు చేసింది. ఇక చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ సంస్థ పావులు కదుపుతోంది. ‘‘ఆమెను డబ్ల్యూహెచ్‌వో పదవి నుంచి తప్పించేందుకు ఏసీసీ ఇప్పటికే పలు చర్యలు తీసుకొంది. ఇందులోభాగంగా…

Read More

సైబర్ నేరాలు అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏపీలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా నేరస్థుల బారిన పడకుండా జాగ్రత్తపడేలా చూస్తున్నామని అన్నారు. ఇటీవల చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ ను ఏర్పాటుచేసి వాటిని నియంత్రిస్తున్నట్లు వివరించారు. సాంకేతికత సాయంతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వివరించారు.

Read More