Author: admin

ప్రయాగ్‌ రాజ్ మహా కుంభమేళా లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనితో పాటు, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగితో మాట్లాడినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. నేడు మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.

Read More

చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్.తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తెలిపారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని స్పష్టం చేశారు.

Read More

పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని నివాసంలో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను అధికారులు వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో మంత్రి లోకేష్ చర్చించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని ఆదేశించారు. ప్రజాభిప్రాయసేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి…

Read More

కేంద్రప్రభుత్వం బిలియనీర్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. వారి రుణమాఫీని నిషేదించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈమేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ రుణాల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో పేర్కొన్నారు.బిలియనీర్లు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని దీని వల్ల సాధారణ ప్రజలు అధిక పన్ను భారాన్ని మోయలేకపోతున్నారని పేర్కొన్నారు. బిలియనీర్లకే లబ్ది కలుగుతోందని పౌరులు తమ ఆదాయం నుండి సగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తుంటే కేంద్రం మాత్రం ధనవంతులకు రుణాలు మాఫీ చేస్తోందని కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాన్యులు తీసుకునే ఇళ్లు, వాహన ఇతర రుణాలను కేంద్రం ఎందుకు మాఫీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు బిలియనీర్ల రుణమాఫీని ఆపితేగనక సామాన్యులపై ఆదాయపు…

Read More

మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతిచెందినట్లు సమాచారం. 30 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయని నేషనల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప హాస్పిటల్స్ కు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు‌ ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 100 వ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీహరికోటలోని షార్ నుండి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 శాటిలైట్ తీసుకొని నిప్పులు చిమ్ముతూ ఆకాశం లోకి దూసుకెళ్లింది. శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.ఎన్వీఎస్-02 శాటిలైట్ ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీని బరువు 2,250కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ శాటిలైట్ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది. ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వి.నారాయణన్ ఇది మొదటి ప్రయోగం. ఈ ప్రయోగం విజయవంతం అవడం పట్ల శాస్త్రవేత్తలకు ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎన్వీఎస్-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందించనుంది.

Read More

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ లో గెలుపు ఖాతా తెరిచింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. డకెట్ 51 (28; 7×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. లివింగ్ స్టోన్ 43 (24; 1×4, 5×6), బట్లర్ 24 (22; 1×4, 1×6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. హార్థిక్ పాండ్య 2 వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్థిక్ పాండ్య…

Read More

బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం పరిస్థితులు తీసుకురావడానికి చూస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు రాజులకు తప్ప మిగిలిన వారెవరికీ ఎలాంటి అధికారాలు లేవని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాజ కుటుంబ వారసుడు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాజులు ప్రజలు కోసం ఏం చేశారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బరోడా రాజు సాయాజీ రావు గైక్వాడ్ బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుకు సాయం చేశారని పేర్కొన్నారు. 1902లో షాహూజీ మహారాజ్ వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గ్వాలియర్ మాధవ్ మహారాజ్ వెనకబడిన తరగతుల సాధికారత కోసం విద్య, ఉద్యోగ కేంద్రాలను స్థాపించారని తెలిపారు. ధోల్పూర్ రాజ కుటుంబం సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశారని మహారాజ్ రాణా నిహాల్ సింగ్ పరిపాలనలో రహదారులు,…

Read More

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్‌.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు సూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే.తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.కాగా ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్‌’, ‘తండేల్‌ అంటే ఓనరా..?’, ‘కాదు లీడర్‌’ లాంటి పవర్‌ఫుల్‌ డైలాగులతో తండేల్‌ ట్రైలర్‌ విడుదలైంది.ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాకుళం మత్స్యకార కుటుంబం కథ నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. https://youtu.be/6jBEzTbanUc?si=fSGWFWRIyg8ATGae

Read More

నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జ్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.‌ జూన్ లోపు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారికంటే ముందు నుండి పార్టీలో పనిచేసిన వారిని గుర్తించి నేతలు ప్రోత్సహించాలని వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వాటిని బట్టి మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు…

Read More