ఉద్దేశపూర్వకంగానే యమునా నదిని హార్యానా ప్రభుత్వం విషపూరితం చేస్తుందంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై నేడు ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధాని మోడీ స్పందించారు. ప్రధాని తాగే నీటిలో హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా? అని ప్రశ్నించారు. హార్యానా ప్రజలపై ఢిల్లీ మాజీ సీఎం అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఓటమి భారంతో ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారని దుయ్యబట్టారు. హార్యానా ఢిల్లీలలో నివసించే ప్రజలు ఒకరు కాదా అని ప్రశ్నించారు. వారి బంధువులు ఢిల్లీలో ఉండరా తమ సొంత ప్రజలు తాగే నీటిని విషపూరితం చేస్తారా? అని ప్రధాని ప్రశ్నించారు. హర్యానా పంపిస్తున్న నీటిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారని అందులో ప్రధాన మంత్రి కూడా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, ఆప్ పాలనపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు 25 సంవత్సరాలు ఢిల్లీని పాలించాయని అయితే…
Author: admin
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు: ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో జరిగిన విషాద తొక్కిసలాట పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారి ప్రియమైన వారికి బలం మరియు ఓదార్పు కోసం మరియు గాయపడిన వారందరూ త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనైనట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మన తెలుగు రాష్ట్రాల…
వైద్యవిద్యలో నివాస ఆధారిత కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది.రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ‘‘మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. దేశంలోని ఏ విద్యాసంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. మనమంతా భారత్ భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. అలాగే చదువుకునే హక్కు కూడా’’ అని ధర్మాసనం వెల్లడించింది. నిర్దిష్ట రాష్ట్రంలో నివసించేవారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని, అయితే అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకే అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఉన్నతవిద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ…
మహిళలకు ఈ ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదని ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో, బయట వేధింపులు తప్పడంలేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తాజాగా చిన్మయి తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. బస్సులో ఓ వ్యక్తి ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. మన దేశంలో రవాణా వ్యవస్థ ఇలానే ఉంటుంది, ఇలాంటి వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారని వ్యాఖ్యానించింది.మీ అమ్మాయి,కూతురు ఇలాంటి ఇబ్బంది పడకూడదంటే ఆమెకు ఓ స్కూటీ కొనివ్వండి.. అదే వారికి సేఫ్ అని చెప్పారు.ఆలయంలో క్యూలో నిలబడినప్పుడు కూడా ఇలాగే జరుగుతోందని చిన్మయి ఆరోపించారు. ‘వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి చున్నీ వేసుకుంది,దుపట్టా ఉంది..అయినా అలా ప్రవర్తిస్తున్నాడు.మీమ్స్ చేసే వాళ్ళు ఇది చూడండి.. అక్కడ అతని బుద్ధి వంకర గా ఉంది.మగాళ్లందరినీ ఇళ్లల్లోనే ఉంచితే మహిళలకు బయట అంతా సురక్షితంగా ఉంటుంది…ఒకవేళ ఆడవాళ్లు క్షేమంగా…
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఎ.దయాకర్ రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాట వినాలి’ విడుదలైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ దీనిని ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించారు. తాజాగా ఈ పాట బీటీఎస్ వీడియోను చిత్రబృందం షేర్ చేసింది. పాట రికార్డింగ్‌కు సంబంధించిన సరదా సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. https://youtu.be/P9Y7jNk_CWE?si=jhwX_Ntu-5quQcpS
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన వార్త చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన నిర్వహణ లోపమని మండిపడ్డారు. సాధారణ భక్తులకు బదులు వీఐపీల తరలింపుపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం ఈ విషాద ఘటనకు కారణమని రాహుల్ గాంధీ విమర్శించారు. మహా కుంభమేళాకు ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా మహాస్నానాలు జరగాలి. ఈరోజు లాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సౌకర్యాలు మెరుగుపరచాలని స్పష్టం చేశారు. వీఐపీ కల్చర్‌ను అరికట్టాలని, సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు చొప్పున శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించనుండగా… అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్నాయి.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సీఎంతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈరోజు ఉదయం గుజరాత్ లో ఆయన సీఎంను కలిశారు. మంచు విష్ణు, శరత్ కుమార్, ముఖేశ్ రిషి, వినయ్ మహేశ్వరితో పాటు గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఆయనను కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా విష్ణు ఆయనకి ప్రఖ్యాత తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తున్న డైనమిక్ నాయకుడిగా ఆయన ఈ విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ మోహన్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.
చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.అంజనా దేవితో కలిసి దిగిన ఓ ఫొటోని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతగానో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు హ్యాపీ బర్త్‌డే.నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది.యోగా క్లాస్ పూర్తైన తర్వాత మా ముఖంలో మెరుపు చూడండి.ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఇది’’ అని తెలిపారు. Happy Birthday to the most caring & disciplined Nainama Love living with you. Check out our post Yoga glow 🧘♀️🥰Btw she never misses a class Truly inspiring 🙌 pic.twitter.com/L7vqtv2fF3— Upasana Konidela (@upasanakonidela) January 29, 2025
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈసినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో పాల్గొన్న చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత గురించి మాట్లాడారు.మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే.ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే… వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు… నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా… గుర్తెట్టుకో… ఈ పాలి…
