Author: admin

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమని షర్మిల సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలని మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు గారి తీరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని విమర్శించారు . 50 లక్షల మంది అన్నదాతలను వంచించారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని షర్మిల ఆరోపించారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు…

Read More

వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 సమ్మిట్ ను ఫిబ్రవరి 5 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించనున్నారు . ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక తాజాగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో వేవ్స్ బజార్ ఈ-మార్కెట్ ను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వేవ్స్ సృజనాత్మకతకు వేదికగా నిలిచేలా కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇక భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ఈ వేవ్స్ సమ్మిట్ ప్రపంచ వేదికగా నిలవనుంది. మన దేశం సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో…

Read More

ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పోయే విధంగా ఎప్పటికప్పుడు తన సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ తక్కువ వ్యయంతో అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో). తాజాగా మరో కీలక మైలురాయికి చేరువైంది. రేపు 100వ రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. జీ.ఎస్.ఎల్.వీ-ఎఫ్15 రాకెట్ ను నింగిలోకి పంపేందుకు సమాయత్తం అవుతోంది. ఇస్రో ఇలాగే మరిన్ని అత్యద్భుతమైన మైలురాళ్లను అందుకోవాలని దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్నారు. ఇస్రో ప్రయోగాలకు వేదికైన షార్ లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

Read More

ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ నేడు రాజ్ కోట్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. ఇక భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తోంది. గత రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్ లో నిరాశ పరిచాడు. అయితే అతని ఫామ్ పై తమకు ఎలాంటి ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. సూర్య కుమార్ అత్యద్భుతమైన బ్యాటర్ అని అతనిపై భారీ అంచనాలు ఉంటాయని ప్రతీ మ్యాచ్ లో బాగా ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తారని తెలిపారు. టీ20 ఫార్మాట్లో దూకుడుగా ఆడాలని ఈక్రమంలో…

Read More

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ లపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ లోని మహు లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్యానికి ముందు పరిస్థితులు కోరుకుంటున్నాయని ప్రజలను మరోసారి బానిసలుగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం ఒక ముఖ్యమైన మైలురాయి, ఎందుకంటే ఆ తర్వాత మొదటిసారిగా భారతదేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు మరియు పేదలకు రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయి. కానీ, మోహన్ భగవత్ అది నిజమైన స్వాతంత్ర్యం కాదని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ మరియు ఆర్.ఎస్.ఎస్ భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ పైనా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగ విద్యా, వైద్య రంగంలో యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది? మన విద్యా రంగం సర్టిఫికెట్ల…

Read More

ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేమని ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు చేయాలని అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని పేర్కొన్నారు . అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని వివరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చి, అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయారని నీతి ఆయోగ్ రిపోర్ట్ బయట పెట్టింది. అప్పు తెచ్చి ఆదాయం పెంచే వాటి పై ఖర్చు చేయకుండా, రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెట్టేశారని ఆక్షేపించారు. ప్రధాని అధ్యక్షత వహించే నీతి ఆయోగ్, స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌పై నివేదిక ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసానికి నీతి అయోగ్‌ నివేదికే నిదర్శనమని పేర్కొన్నారు . నాయకుల సమర్థతపై ఆ రాష్ట్ర ప్రజల…

Read More

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టును గెలిపించిన తిలక్ వర్మ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.2 ఓవర్లలో ఛేదించింది. తిలక్ (72*; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో దూకుడుగా ఆడి ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన తిలక్.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్‌ చివర్లో ఉత్కంఠభరితంగా మారింది. ఈక్రమంలో టెయిలెండర్లతో కలిసి జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈనేపథ్యంలో తిలక్‌ వర్మపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్‌ టీ20 ప్లేయర్‌ మాత్రమే కాదని.. ఆల్‌-ఫార్మాట్‌ ప్లేయర్‌గా మారే సత్తా అతనికి ఉందన్నాడు.

Read More

పేస్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాను.. ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు వ‌రించింది.అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఇవాళ ఆ ప్ర‌ట‌క‌న చేసింది. స్వ‌దేశీతో పాటు విదేశీ పిచ్‌ల‌పై .. 20204లో బుమ్రా స‌త్తా చాటాడు. త‌న స్పీడ్ బౌలింగ్‌తో భార‌త్‌కు కీల‌క విజ‌యాల‌ను అందించాడు. 2024లో అత‌ను 13 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 71 వికెట్ల‌ను తీసుకున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని మ‌ళ్లీ టెస్టులు ఆడిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 31 ఏళ్ల బుమ్రా గ‌త ఏడాది 14.92 స‌గ‌టుతో వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ త‌న ప్రెస్ రిలీజ్‌లో బుమ్రా బౌలింగ్ రికార్డుల‌ను విశేషేంగా మెచ్చుకున్న‌ది. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో జ‌రిగిన స్వ‌దేశీ సిరీస్‌లో భార‌త జ‌ట్టు విజ‌యంలో బుమ్రా కీల‌క పాత్ర పోషించాడు. ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జ‌రిగిన సిరీస్‌ల్లోనూ అత‌ను అత్య‌ధికంగా వికెట్ల‌ను తీశాడు.

Read More

ఇటీవ‌ల కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ద‌క్కిన విష‌యం తెలిసిందే.దీనితో ఇప్ప‌టికే ఆయ‌న‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాల‌య్య‌కు విషెస్ తెలియ‌జేస్తూ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారానికి ఎంపికైన సంద‌ర్భంగా బాల‌య్య‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.తెలుగు సినిమాకు మీరు చేసిన సేవకు ఈ అవార్డు అందుకోవ‌డానికి అన్ని విధాలా అర్హులు.అలాగే త‌మిళ‌ న‌టుడు అజిత్‌కుమార్ విజ‌యం కూడా ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం, ప్ర‌శంసనీయం.శోభ‌న‌, శేఖ‌ర్ కపూర్‌ల‌కు క‌ళ‌ల విభాగంలో ప‌ద్మ‌భూష‌ణ్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది.ప‌ద్మ అవార్డుల‌కు ఎంపికైన వారికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు” అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read More

రవితేజ కూడా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆయనకు సరైన హిట్‌ పడి చాలా రోజులైంది. ‘ధమాకా’ తరువాత ఆయన నటించిన రావణసుర, టైగర్‌ నాగేశ్వరరావు, ఈగల్‌, మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయాలుగా నిలిచాయి.ఇక ప్రస్తుతం ఆయన ‘మాస్‌ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది.వివాహ భోజనంబు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు.కాగా జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘మాస్‌ జాతర’ చిత్రం నుంచి గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్‌.గ్లింప్స్‌లో రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీగా కనిపించాడు.కానీ విజువల్స్‌ పరంగా, కంటెంట్‌ పరంగా కొత్తదనమేమీ కనిపించలేదు.రెగ్యులర్‌ రవితేజ సినిమాలో ఉండే కంటెంట్‌లానే అనిపించింది.యాక్షన్‌ సన్నివేశాలు, పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో రవితేజ… ఇలా పలు విజువల్స్‌ కనిపించినా గ్లింప్స్‌…

Read More