Author: admin

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. కాగా, ఈ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీల‌క‌ పాత్రలో క‌నిపించ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. దీంతో సినిమాలో డార్లింగ్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆయ‌న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు తెర దించుతూ తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫ‌స్ట్‌ లుక్ ను ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఇందులో ప్రభాస్ కళ్లు, నుదుటి భాగం మాత్రమే కనిపిస్తోంది. నుదుటిపై విభూతి నామాలు, చేతిలో త్రిశూలంతో డార్లింగ్‌ పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే, ప్రభాస్ పూర్తి…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్ఛితి, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కీలక రంగాల్లో షేర్ల అమ్మకాలతో సూచీలు నష్టాల బాటలో పయనించాయి. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 824 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22,829 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.28గా కొనసాగుతోంది.సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్.బీ.ఐ, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనీలివర్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Read More

అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలు వలన ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించిన్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ఇటీవల దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారన్నారు.

Read More

ఏపీ ప్రభుత్వం బి.పి.ఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. పదేళ్ల కాలపరిమితితో ప్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇంటిపట్టా తీసుకున్న రెండేళ్లలోపు నిర్మాణం చేపట్టాలని అలాగే లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో కూడా లబ్దిదారుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read More

మహారాష్ట్రలో GBS (గిలైన్ బారె సిండ్రోమ్) కలకలం రేపుతోంది. తాజాగా సోలాపుర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దీని వలన మరణించినట్టు అనుమానిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. పుణెలో ఇప్పటివరకు నమోదైన జీబీఎస్ కేసుల సంఖ్య 101కి చేరుకుంది. వారిలో 16 మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వ్యక్తి కూడా పుణెలోనే చికిత్స పొందినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని తెలిపారు. బాధితుల్లో 80 శాతం మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఆరు నెలల్లో స్వతహాగా నడవగలరు. మరికొంతమందికి మాత్రం ఆ సమయం ఏడాది లేక అంతకంటే ఎక్కువ కూడా కావొచ్చు. ఇక ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఒక్కొక్కటి వేలల్లో…

Read More

2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి తప్పుడు కధనం పై గత 5 ఏళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇది నాలుగో వాయిదా. నిజం నా వైపు ఉంది, ఎన్ని సార్లు అయినా కోర్టుకు వస్తాను. ఆలస్యమైనా నిజం తెలుస్తుంది.ఈ రోజు కూడా మంత్రి హోదాలో వచ్చినా, పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుంటున్నా. ప్రభుత్వం నుండి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం, అందులో కొట్టిన డీజిల్ కూడా నా డబ్బుతోనే. ఎక్కడా ప్రభుత్వం పై ఆధారపడకూడదని నా తల్లి నాకు చిన్నప్పట్టి నుంచి నేర్పించిందని లోకేష్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్కొక్కటిగా అన్నీ విచారణ చేస్తామని వివరించారు.…

Read More

అమెరికాలోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు. కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లో తొలి వర్షం నమోదైంది. కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేస్తుంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద నీటి ప్రవాహంతో కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముందనే ఆందోళన మొదలైంది. అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వర్షం కురవనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా.. మరో మూడు రోజులు వ‌ర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా…

Read More

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన నాటి నుంచి ట్రంప్‌ ప్రభుత్వ వ్యయాలు తగ్గించే పనిపై దృష్టి సారించారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఆ దేశంలో పన్నులు వసూళ్లు చేసే ఇంటర్నెల్‌ రెవెన్యూ సర్వీస్‌లో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపనున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ విషయాన్ని లాస్‌ వేగాస్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.‘‘వారిలో 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమో..లేదా నియమించుకొనేందుకు ప్రయత్నించడమో చేశాం.ఇప్పుడు వారిని తొలగించడమో..లేదా సరిహద్దులకు పంపడమో చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం.వారికి తుపాకులు ఇచ్చి బోర్డర్స్‌కు పంపడమే సరైన పని అనుకొంటా’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే ఫెడరల్‌ ఉద్యోగుల నియామకాలను 90 రోజులపాటు స్తంభింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రత, ప్రజారక్షణ విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.కానీ, ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ విభాగం మాత్రం ట్రంప్‌ కార్యవర్గం,డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ ఆదేశాలు ఇచ్చే వరకు ఆపేయాల్సిందే.

Read More

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాశ్‌ కనోజియా (31) అనే డ్రైవర్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అత‌డు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు వదిలిపెట్టారు. ఆ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని ఆకాశ్‌ తాజాగా పేర్కొన్నాడు. ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేద‌న వెళ్ల‌గ‌క్కాడు. ‘‘ఆ కేసులో ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ మీడియాలో నా ఫొటోలు వచ్చాయి. అవి చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పుర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసు బృందం నాపై చేయి కూడా చేసుకున్నారు’’ అని ఆకాశ్‌ వాపోయాడు. పోలీసులు వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు తేల్చి చెప్పినట్లు…

Read More

విదేశాలకు అగ్రరాజ్యం అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవ‌ల‌ సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమదేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కష్ట కాలంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అగ్రరాజ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రపంచ దేశాలకు సాయాలను ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో నేను ఆందోళనకు గురయ్యాను. కానీ, భగవంతుడి దయ వల్ల మాకు అందించే ఆయుధాలను అగ్రరాజ్యం ఆపలేదు’’ అని జెలెన్‌స్కీ అన్నారు. కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్‌ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్‌ గతంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్‌ నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్‌ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం…

Read More