Author: admin

‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ఈ పెద్ద పండగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్‌ను సొంతం చేసుకుంది. తాజాగా దీని వసూళ్లను చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.260 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. త్వరలోనే రూ.300 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని టీమ్ వెల్ల‌డించింది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా గత 24 గంటల్లో బుక్‌మైషోలో లక్షా 70వేల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. విడుదలైన నాటి నుంచి థియేటర్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన విష‌యం విధిత‌మే. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు దీనిని నిర్మించారు. ఐశ్వ‌ర్యా రాజేశ్‌, మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లు.

Read More

వయనాడ్‌ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై పెద్ద‌ పులి దాడి చేసి చంపిన ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్‌ ఈటర్‌గా ప్రకటించిన ప్రభుత్వం.. అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్‌ ఈ ప్రకటన చేశారు. వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల పెద్దపులి దాడి చేసింది. అనంతరం ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారి జయసూర్యపైనా పులి దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం, ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.

Read More

తాగుబోతు భర్తల వేధింపులతో విసిగిపోయిన ఇద్దరు మహిళలు పరస్పరం పెళ్లాడి కొత్తజంటగా అవతరించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఈ వింత ఘటన జరిగింది.గోరఖ్‌పుర్‌కు చెందిన కవిత, గుంజా అలియాస్‌ బబ్లూ అనే మహిళలు దేవరియాలోని శివాలయంలో వివాహం చేసుకున్నారు. తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా విసిగిపోయిన వీరిద్దరికీ మొదట ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు.ఇద్దరూ గృహహింస బాధితులు కావడంతో భర్తలను విడిచిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుట తిలకం దిద్దారు. దండలు మార్చుకొని, ఏడడుగులు నడిచారు. ‘‘ప్రేమ, శాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి మేము పెళ్లి చేసుకున్నాం. గోరఖ్‌పుర్‌లోనే నివాసం ఉంటాం’’ అని గుంజా తెలిపారు. వీరి పెళ్లిపై శివాలయం పూజారి శంకర్‌పాండే స్పందిస్తూ.. మహిళలిద్దరూ పూలదండలు, సిందూరం తెచ్చి పూజలు చేసి వెళ్లిపోయారని తెలిపారు.

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం దేశానికి జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆప్ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని.. ఒకటేమో ప్రజాసంక్షేమంపై దృష్టి సారించగా, మరొకటి కొంతమంది సంపన్నులకు ప్రయోజనం చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో 400-500 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి.బీజేపీ మోడల్‌ ప్రకారం రూ.వేల కోట్ల ప్రజా సొమ్మును ఆ పార్టీ తన సన్నిహితులకు రుణాలుగా ఇచ్చి..ఆ తర్వాత మాఫీ చేస్తుంది. అదే ఆప్‌ మాత్రం.. సామాన్యులకు మేలు చేకూర్చేలా ఉచిత విద్యుత్,విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలపై దృష్టిసారిస్తుంది. ఢిల్లీలోని ప్రతి ఇంటికి నెలకు దాదాపు రూ.25 వేల విలువైన ప్రయోజనాలు అందిస్తుంది’’ అని కేజ్రీవాల్ తెలిపారు.

Read More

ఇజ్రాయెల్‌ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది.పెద్దఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులైన విష‌యం తెలిసిందే. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు,జోర్డాన్‌లు పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్‌ కాల్‌ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. గాజా ప్రాంతం శిథిలాల కుప్పగా మారింది.అక్కడున్న ప్రతీది నాశనమైంది.ప్రజలు చనిపోతున్నారు.ఈ క్రమంలోనే వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్‌ దేశాలతో కలిసి వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నా.అక్కడ వారు శాంతియుతంగా జీవించవచ్చు.ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు..లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఈజిప్టు అధ్యక్షుడితోనూ దీనిపై చర్చిస్తానని తెలిపారు.ఈజిప్టు, జోర్డాన్‌లు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

Read More

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మచ్చ లేని వ్యక్తిత్వం కలిగిన వారు, lదేశం కోసం త్యాగం చేయగలిగే వారికే ఓటేయాలని ఢిల్లీ పౌరులకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు. Lఅప్రయోజకులకు ఓటు వేయవద్దని, lఅలా చేస్తే దేశం నాశనమవుతుందని హెచ్చరించారు.దీనితో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నా హజారే శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.ఈ సందర్భంగా అన్నా హజారే..‘త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.స్వచ్ఛమైన వ్యక్తిత్వం,ఆలోచనలు కలిగిన వారు,సన్మార్గంలో నడిచేవారు,అవమానాలను దిగమింగి అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు.ఢిల్లీ కేంద్రంగా గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఆయనతో పోరాటంలో పాలుపంచుకున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ అనంతర కాలంలో ఆప్‌ను స్థాపించి, ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడం హజారేకు ఇష్టంలేదు. ఆ తర్వాత పరిణామాల్లో…

Read More

విశాల్‌ హీరోగా దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’.వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, అంజ‌లి క‌థానాయిక‌లు.షూటింగ్‌ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత సంక్రాంతి కానుకగా తమిళంలో ఈ సినిమా రిలీజైంది.ఆ రాష్ట్రంలో ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో తెలుగులో జనవరి 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ సినిమా టీజ‌ర్‌,ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చికు బుకు రైలుబండి’.. అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. https://youtu.be/o0fhbhZlXIU?si=r8oj6Ojf8eADBiFR

Read More

తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గత వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సామాన్యుల మధ్య ఒకడిగా ప్రజలు కష్టాలను దగ్గరనుండి చూస్తూ వారికి భరోసా కల్పిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు. ఈ సందర్భంగా నాటి పరిస్థితులను లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర నాకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ. సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లు. నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదు. మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుండి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది.…

Read More

ఉత్తరాఖండ్ లో నేటి నుండి యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామి తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశంలోనే యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.రాష్ట్రంలో యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ప్రభుత్వం 2022 మే లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కసరత్తు తరువాత కమిటీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, గత ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Read More

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలుగు దేశం పార్టీ నేత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రాల ధర్మాసనం తీర్పునిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More