Author: admin

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిష్‌, జ్యోతికృష్ణ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈచిత్రం లో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. అందులో రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఉన్న లుక్ లో కనిపించారు. ప్రస్తుతం బాబీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇటీవలే ఈసినిమా నుంచి తొలి పాట విడుదలైంది.‘మాట వినాలి గురుడా మాట వినాలి’ అంటూ సాగే ఈ పాటను పవన్‌ కల్యాణ్‌ ఆలపించారు.ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. రెండు భాగాలుగా…

Read More

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఈ సంవత్సరం ఏడాది జరిగే రెండో ఎడిషన్ ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్)లో భారత జట్టు తరపున ఆడేందుకు సంతకం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి గతేడాది వైదొలగిన 39 ఏళ్ల డ్యాషింగ్ బ్యాటర్ తిరిగి వస్తుండడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాషింగ్ బ్యాటర్ గా పేరున్న శిఖర్ ధవన్ తన కెరియర్ లో మొత్తం 164 వన్డే మ్యాచ్ లలో 44 యావరేజ్, 91.35 స్ట్రైక్ రేట్ తో 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 143 పరుగులు. అలాగే, టెస్టుల్లో 58 ఇన్నింగ్స్లో 40.61 యావరేజ్, 67 స్ట్రైక్ రేట్ తో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 190 పరుగులు. ఇక, టీ20ల్లో…

Read More

టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో యువ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఎనిమిదో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. తాజాగా మరో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో 33 ఎత్తుల్లో డ్రాకు ఒప్పుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా అపజయం లేని గుకేశ్ మూడు గేమ్ లలో విజయం సాధించగా… అయిదింటిలో డ్రా చేసుకున్నాడు. మరోవైపు అర్జున్ ఇరిగేశి, పెంటేల హరికృష్ణలకు కూడా డ్రానే ఎదురైంది. సెర్బియాకు చెందిన సరానా అలెక్సీ తో అర్జున్ గేమ్ 23 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది.నెదర్లాండ్స్ అనీష్ గిరి తో పోరును హరికృష్ణ 30 ఎత్తుల్లో డ్రాగా పూర్తి చేశాడు.

Read More

ఫ్రాన్స్ లో జరుగుతున్న ఎలైట్ ఇండోర్ అథ్లెటిక్స్ మీట్ లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి నేషనల్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించింది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ ను 8.04 సెకన్లలో ముగించి సత్తా చాటింది. తన పేరిట ఉన్న జాతీయ రికార్డు (8.12 సెకన్లు)ను కొన్ని గంటల వ్యవధిలో జ్యోతి రెండుసార్లు అధిగమించి రికార్డు సృష్టించింది. హీట్స్ లో 8.07 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది . ఫైనల్ రేసును 8.04 సెకన్లలో పూర్తి చేసింది. అయితే మార్చిలో చైనాలోని నానింగ్లో జరిగే ప్రపంచ ఇండోర్ ఛాంపియన్ షిప్స్ అర్హత టైమింగ్ (7.94 సెకన్లు)ను ఆమె అందుకోలేకపోయింది. పురుషుల 60 మీ హర్డిల్స్ లో తేజస్ షిర్సే (7.68 సెకన్లు) కాంస్య పతకం సాధించాడు.

Read More

మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా జరిగిన సూపర్ సిక్స్ లో కూడా గెలిచింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. సుమేయ అక్తర్ 21 (29;1×4) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లతో సత్తా చాటింది. షబ్నమ్, గొంగడి త్రిష, జోషితా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గొంగడి త్రిష 40 (31; 8×4) రాణించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ సెమీస్ చేరింది.

Read More

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపి బిజేపి NDA కూటమి సాదించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం, ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, బావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164/175 స్థానాలను NDA కూటమికి, 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో…

Read More

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘జన నాయగన్’ అనే టైటిల్‌ ఖరారు చేసారు, ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ స్టైలిష్‌గా కనిపించారు.

Read More

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది.తాజాగా దీనిపై ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికీ నా ధన్యవాదాలు. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు.

Read More

దేశ ప్రజలు 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.ఎరుపు,పసుపు కలగలిసిన వర్ణంతో ప్రత్యేకంగా ఉంది.రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన ‘సఫా’ను ధరించారు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన జాగ్రత్త తీసుకొంటారు. 2024 గణతంత్ర వేడుకల్లో కుంకుమ, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో కూడినది మోదీ ధరించారు. ఇది గుజరాత్‌ సంస్కృతికి అద్దంపట్టింది.

Read More

ప్రతిష్టాత్మక టెన్నిస్ ఈవెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ నెంబర్ వన్ ఆటగాడు ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ టైటిల్ విజేతగా నిలిచాడు. వరుసగా రెండోసారి అతను టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 7-6 (7-4), 6-3 తేడాతో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ పై విజయం సాధించాడు. సిన్నర్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. సినర్, జ్వెరెవ్ హోరాహోరీగా తలపడగా…సిన్నర్ చెలరేగి ఆడి పైచేయి సాధించాడు.

Read More