భారత్ లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఈ నెల 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తాజాగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను తెలిపింది. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి భారీగా పెరిగింది. ఇక ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 సంవత్సరాల మధ్య వయసున్న యువత ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల రేషియోలో తేడా కూడా తగ్గిపోయింది. అప్పుడు ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ప్రస్తుతం అది 954కు పెరిగింది. ఇక మహిళా ఓటర్లు 48 కోట్లుగా ఉంది.
Author: admin
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చిందని, ఒకే వాయిస్ గా పాల్గొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ నుండి ఈ సదస్సులో పాల్గొంటున్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే, పరస్పరం ప్రోత్సహించుకున్నాయని వివరించారు. తమకు విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా, ఒకటిగా కలసి పనిచేస్తామని తెలిపారు. భారత దేశం బ్రాండ్ ఇప్పుడు చాలా బలంగా ఉందన్నారు . దావోస్ లో వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడుతున్నాయి. అంతా ఐక్యంగా దేశం కోసం కలిసి పని చేస్తున్నాం. సీఎంలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. తామంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారిమైనప్పటికీ ఇండియా ఫస్ట్, అవర్ పీపుల్ ఫస్ట్ నినాదంతో ఉన్నామని స్పష్టం చేశారు. మేం దావోస్ నుండి టెక్నాలజీని తీసుకెళ్లడానికి రాలేదు. ప్రపంచానికే మా దేశం టెక్నాలజీని అందజేస్తోంది,…
వచ్చే నెలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ తర్వాత అంత స్థాయిలో ప్రాధాన్యత ఉన్న టోర్నీ ఇదే కావడంతో క్రికెట్ అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ జెర్సీ నిబంధనలకు భారత జట్టు కట్టుబడి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. భారత ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండటంపై బీసీసీఐ అభ్యంతరం చెబుతోందన్న వార్తలను సైకియా తోసిపుచ్చారు. బీసీసీఐ ఐసీసీ ప్రతి నియమాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. నిబంధనల విషయంలో మిగిలిన జట్లు ఎలా చేస్తే భారత్ కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ లో భారత్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఖోఖోకు మరింత ఖ్యాతి తీసుకురావాలనే వాదన క్రీడాభిమానుల నుండి వినిపోస్తోంది. ఇక తాజాగా 2036 ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో ఖోఖోను చేర్చడానికి సమిష్టి కృషి అవసరమని కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మన క్రీడల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్లో ఖోఖోను ఆడించాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని వివరించారు. ఇందుకోసం క్రీడాకారులు, కోచ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వాలి. ఆటను ఫెడరేషన్ సమర్థంగా నిర్వహించాలి. క్రీడాకారుల ప్రదర్శన స్థాయిని పెంచడానికి క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు, సహకారం కొనసాగుతుందని చెప్పారు.
ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ లో మొదటి రౌండ్ లోనే ఓటమి చెందింది. వియత్నాంకు చెందిన తిన్ నుయెన్ చేతిలో 20-22, 12-21తో ఓడింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్-తనీషా జోడీ 21-18, 21-14తో ఇండోనేషియా కు చెందిన అద్నాన్ మౌలానా-ఇందాకాహ్యా పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-9, 21-14తో జపాన్ ఆటగాడు తకుమా ఒబాయిషీ పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటయింది.జాస్ బట్లర్ 68 (44; 8×4, 2×6) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హార్థిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సంజూ శాంసన్ 26 (20; 4×4, 1×6)బ్యాట్ ఝళిపించాడు. అభిషేక్ శర్మ 79 (34; 5×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దీంతో భారత్ సునాయాసంగా విజయం అందుకుని సిరీస్ లో 1-0…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిరువురూ ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. వీరిద్దరినీ అదనపు జడ్జిలుగా నియమించాలన్న ప్రతిపాదనకు జనవరి 11న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది.
దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటుచేయాలని కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ ను ఏర్పాటు చేయాలని ఈసందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారత్ లో 13 డబ్ల్యుటిసి సెంటర్లు పనిచేస్తుండగా, 7 నిర్మాణంలో ఉన్నాయని, మరో 9చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని జాన్ డ్రూ తెలిపారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రవి లాంబ, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తో కూడా లోకేష్ సమావేశమై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది.జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 40కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అంచనా.ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతోంది.తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఆ దృశ్యాల్లో కనిపించింది. 2024 ఏప్రిల్ 6వ తేదీ ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్ కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్‌లా అది కనిపించింది. ఇదిలా ఉంటే.. 45 రోజుల పాటు సాగే ఈ…
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది.ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఢిల్లీ ఆప్‌కు ఓటమి తప్పదు.అది తెలిసే రోజుకో హామీ ఇస్తోంది. ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది.దీనిపై అధికార పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఆప్ మోసాలకు శీష్ మహల్ ఒక ఉదాహరణ.ఢిల్లీ ఎన్నికల్లో కార్యకర్తల వల్లే బీజేపీకు విజయం దక్కుతుంది.ప్రతి పోలింగ్ కేంద్రంలో 50 శాతం ఓట్లు బీజేపీకే పడేలా కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు.
