Author: admin

మహాకుంభ మేళాలో రష్యాకు చెందిన ‘బాహుబలి బాబా’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఆరడుగుల ఎత్తు,కండలు తిరిగిన దేహం,అందమైన ముఖవర్ఛస్సు ఉండటంతో అందరూ ఆయన్ను ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందారు.రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు.ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం జీవితాన్ని మలుపు తిప్పింది.సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది.హిందూధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు.తన పేరును ఆత్మప్రేమ్‌ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు.భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు,ఇతిహాసాలను చదివాక నేపాల్‌కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా,మహాకుంభ మేళాలు జరిగినప్పుడల్లా నేపాల్‌ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.

Read More

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఫెడ‌ర‌ల్ డైవ‌ర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజ‌న్ (డీఈఐ) సిబ్బంది అంద‌రినీ సెల‌వుపై వెళ్లిపోవాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే వారంద‌రికీ లేఆఫ్‌లు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల్లోగా (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) వారంద‌రినీ వేత‌నంతో కూడిన సెల‌వుపై పంపించాల‌ని సంబంధిత ఏజెన్సీల‌కు ఆదేశాలు అందాయి. ఈ విభాగాల‌కు చెందిన అన్ని వెబ్ పేజీల‌ను కూడా ఈ గ‌డువులోగా పూర్తిగా తొల‌గించాల‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు. అలాగే డీఈఐ సంబంధిత శిక్ష‌ణ కార్యాక్ర‌మాల‌ను త‌క్ష‌ణ‌మే ముగించాల‌ని ఏజెన్సీల‌కు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాల‌ను కూడా క్యాన్సిల్ చేయాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే కొన్ని వెబ్ సైట్ల‌ను అధికారులు తొలగించారు. కాగా, ట్రంప్ రెండోసారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ప‌లు షాకింగ్‌ నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే.…

Read More

ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన కొనసాగుతోంది.ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తో చంద్రబాబు భేటీ కానున్నారు.రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయనతో సీఎం చర్చించనున్నారు.యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈఓలతోనూ సీఎం సమావేశం కానున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్- పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.

Read More

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ , నాగార్జున, రష్మికకీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి శేఖర్‌ కమ్ముల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ కథ ధనుష్‌కు చెప్పడానికి కాస్త సంకోచించినట్లు ఆయన తెలిపారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కుబేర’ కథ సిద్ధమైంది.బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా?అని కాస్త సంకోచించా! ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం కూడా నన్ను వెంటాడింది. నేను ఆయనకు ఫోన్‌ చేయగానే, ధనుష్ నన్ను ఆశ్చర్యపరిచారు.నేను తీసిన వాటిలో ఆయన ఫేవరెట్‌ మూవీలు, అందులోని సన్నివేశాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ధనుష్‌లాంటి నటుడితో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని శేఖర్‌కమ్ముల చెప్పుకొచ్చారు. ఇక వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె గురించి మాట్లాడుతూ.. ‘‘రష్మిక చాలా కష్టపడతారు. ఈ కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ముంబయిలో…

Read More

రాహుల్‌ గాంధీ తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్‌ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.ఆరెస్సెస్‌,బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్‌ కుమార్‌ చౌదరి అనే వ్యక్తి తన చేతిలో ఉన్న పాలబకెట్‌ను వదిలేశాడు. దీనితో పాలన్నీ నేలపాలై..అతనికి నష్టం వాటిల్లిందని ఈ షాక్‌‌ నుండి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాహుల్‌ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా…నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశాను.లీటర్‌ పాలు రూ.50..మొత్తం రూ.250 నష్టం కలిగింది.రాహుల్‌ అలా మాట్లాడతారని అనుకోలేదు.దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను.దీనితో ఈసారి షాక్‌ తినడం పోలీసుల వంతు అయ్యింది.చేసేదిలేక.. బీఎన్‌ఎస్‌లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…

Read More

ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది.సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.ఈ క్రమంలో మమత ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.అయితే మమత ప్రభుత్వం తీరును ఆర్జీ కర్ మృతురాలి తండ్రి తప్పుబట్టారు.ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటుతో వ్యవహరించవద్దని సూచించారు. రేపు తీర్పు కాపీ వస్తుందని,దానిని పరిశీలించాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.అప్పటి వరకు తొందరపాటు చర్యలు సరికాదన్నారు.ఆమె ఎన్నో మాటలు చెప్పి… సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు.తారుమారు చేసిన వారిలో పోలీస్ కమిషనర్, ఇతరుల ప్రమేయం ఉందన్నారు.ఇవన్నీ మమతా బెనర్జీ చూడలేదా? అని ప్రశ్నించారు.అయితే సీబీఐ సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితుడికి జీవితఖైదు పడినట్లుగా అభిప్రాయపడ్డారు.

Read More

చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో నటి ప్రియాంకా చోప్రా సందడి చేశారు.ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రదక్షణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రియాంకా చోప్రాను పూజారులు శేష వస్త్రంతో గౌరవించారు. ఈ టెంపుల్ విజిట్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె షేర్ చేశారు. ఆలయ ఆవరణలో తను ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన ప్రియాంకా చోప్రా..శ్రీ బాలాజీ ఆశీస్సులతో కొత్త అధ్యాయం మొదలైంది.మనమందరం మన హృదయాల్లో శాంతిని నింపుకొని, మన చుట్టూ సమృద్ధి, సౌభాగ్యాలతో గడపాలి.దేవుడి దయ అనంతం. ఓం నమో నారాయణాయథ్యాంక్యూ ఉపాసన కొణిదెల” అని పేర్కొన్నారు.ప్రియాంకా చోప్రా పోస్ట్‌కు మెగా కోడలు ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘మీ నూతన సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని కామెంట్ చేశారు. ఉపాసన చేసిన ఈ కామెంట్‌తో రాజమౌళి-మహేష్‌ కాంబో ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ప్రియాంకా చోప్రానే…

Read More

కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. వాస్తవమైన అభివృద్ధి అంటే అందరికీ సమాన అవకాశాలు, అభివృద్ధి లభించడమన్నారు. అప్పుడే దేశం ముందుకు సాగుతుందన్నారు. ప్రజలందరి రక్తం, చెమట వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్రాలు తిరుగుతున్నాయి, కానీ అందులో అందరికీ న్యాయమైన వాటా లభిస్తుందా? ఆలోచించండి అని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా వ్యవసాయరంగంలో రైతులు, రైతుకూలీల పరిస్థితులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రమాదకరమైన జీఎస్టీ, ఐటీ విధానాలు పేద, మధ్యతరగతి బతుకులపై భారం మోపుతున్నాయని మరోవైపు.. ప్రభుత్వం కార్పొరేటు రుణాలను మాఫీ చేసుకొంటూ పోతోందని దుయ్యబట్టారు. ఆకాశాన్నంటిన ధరలతో ఇపుడు పేదలు మాత్రమే కాదు, వేతన జీవులు కూడా అవసరాలకు రుణాలు తీసుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని, తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Read More

అంతర్జాతీయస్థాయి లాజిస్టిక్స్ సంస్థ డి.హెచ్.ఎల్ గ్లోబల్ సీఈఓ పాబ్లో సియానోతో దావోస్ బెల్వేడేర్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారత్ కార్గో ట్రాఫిక్ లో 16.5శాతం వాటా కలిగి ఏపీ 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి కీలక ఓడరేవులు, ఇండస్ట్రియల్ హబ్ లు, వేర్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజిలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటుచేయాలని కోరారు. ఏపీలో లాజిస్టిక్ కార్యకలాపాలను మెరుగుపర్చేందుకు బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే అయిదేళ్లలో లాజిస్టిక్స్ పై 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు పాబ్లో సియానో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్ మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్ విడిసి వంటి…

Read More