ఈశాన్యరాష్ట్రం మణిపుర్ లో రాజకీయంగా అనూహ్యపరిణామం చోటుచేసుకుంది.అక్కడి బీజేపీ సర్కార్‌కు జేడీయూ (JDU) షాక్ ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వానికి నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ఈ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. మణిపుర్‌లో జేడీయూ పార్టీ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.బీజేపీకు తమ మద్దతు ఉండదని వెల్లడించారు.తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు. మణిపుర్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది.అయితే ఎన్నికలు జరిగిన కొద్దినెలల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో బీజేపీకు 37 మంది సభ్యులున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ముగ్గురి మద్దతు ఉంది.అయితే ఇప్పుడు ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు.కానీ కేంద్రం, బిహార్‌లో ఎన్డీయే కూటమిలో కీలక పక్షమైన నీతీశ్ పార్టీ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతుల…
Author: admin
పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణస్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదు.అది మాది…మాకు మాత్రమే సొంతం’’ అని తెలిపారు. గత సోమవారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు. పనామాకు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటాం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈరోజు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు. వారం రోజుల క్రితం ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి జొరబడ్డాడు. చోరీకి ప్రయత్నించగా సైఫ్ అలీఖాన్ అడ్డుకోవడంతో కత్తితో దాడి చేశాడు.దీంతో సైఫ్ ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడిన సమయంలో అతనిని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా ఆసుపత్రికి తరలించాడు.తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించినందుకు గాను సైఫ్ అలీఖాన్… ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులనూ ఇలాగే ఆదుకోవాలని సూచించారు. సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్‍ను కలిసిన సమయంలో వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల జరిగిన దాడిపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ బుధవారం నాడు పలు ప్రశ్నలను లేవనెత్తారు.దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అత్యంత వేగంగా రికవరీ అవ్వడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.ఈనెల 16న బాంద్రాలోని తన నివాసంలో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్… లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఐదు రోజుల తర్వాత మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు.ఆసుపత్రి నుండి బాంద్రాలోని తన నివాసం ‘సద్గురు శరణ్’ అపార్ట్ మెంట్స్ కు చేరుకున్నారు.ఆ సమయంలో ఆయన హుషారుగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇదే విషయమై సంజయ్ నిరుపమ్.. సర్జరీ తర్వాత సైఫ్‌కు అంత ఫిట్‌నెస్ ఎక్కడిదంటూ అనుమానం వ్యక్తం చేశారు.ఆయనకు ఆరు కత్తిగాట్లు, 3 లోతైన గాయాలయ్యాయి. 2.5 అంగుళాల కత్తి అతనికి గుచ్చుకుంది. అతనికి డాక్టర్లు సర్జరీ చేశారు. కానీ ఐదు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సైఫ్… ఏమీ…
మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది.మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ,ఒడిశా రాష్ట్రాల్లోని అడవులను భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ నెల 20న రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేత చలపతి తన టీమ్‌తో సహా దొరికిపోయాడు.మొత్తం 14 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి.అయితే మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల పలు ప్రాంతాల్లో 8 మందుపాతరలు లభ్యమయ్యాయి. వాటిని బుధవారం నిర్వీర్యం చేశారు.అందుకు సంబంధించిన వీడియోలను బీజాపూర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను చూడవచ్చు.భద్రతాబలగాలపై దాడి కోసం మావోయిస్టులు అడవుల్లో పలు ప్రాంతాల్లో మందుపాతరలను పాతిపెడుతున్నారు. బీజాపూర్ పోలీసులు ఇవాళ నిర్వీర్యం చేసిన మందుపాతరలు ఒక్కొక్కటి 5 కిలోల చొప్పున ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం భద్రతాబలగాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో…
నేటి ట్రేడింగ్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. రోజంతా ఒక మోస్తరుగా కదలాడిన సూచీలు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో నిన్నటి నష్టాల నుండి కొంతమేర కోలుకుని లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76,404 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.33గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.
జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ కార్యక్రమంలో కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. తాజాగా నేడు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ సహా పలువురు మంత్రులు త్రివేణీ సంగమం వద్ద మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి సీఎం యోగి ప్రత్యేక హారతులు ఇచ్చారు. 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మహా వేడుక ద్వారా12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుండి కోటి మంది పుణ్యస్నానాలు చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లకు హామీలను ప్రకటిస్తూ తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రెండు భాగాలుగా తమ మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ను విడుదల చేసింది. ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజీవాల్ దీన్ని విడుదల చేశారు. భారత్ లోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారు. ట్యాక్స్ లకు వారు బాధితులగా మారిపోయి అధికంగా ట్యాక్స్ లు చెల్లిస్తున్నారు. ప్రతిఫలంగా తక్కువ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ట్యాక్స్ చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కానీ, వాటిని పలువురు…
నటుడు నాగశౌర్య నటించిన వరుస చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో సరైన సక్సెస్ అందుకోవడం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు.ఆయన కథానాయకుడిగా రామ్ దేసిన దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.బుధవారం నాగశౌర్య పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనేది టైటిల్‌ను ఖరారు చేశారు.శౌర్య యాంగ్రీ లుక్‌లో కనిపించారు.హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
పటౌడీ ఫ్యామిలీకి చెందిన సుమారు 15000 కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది.పటౌడీ ఫ్యామిలీ వంశస్తుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ఆ ప్రాపర్టీతో లింకు ఉన్నది.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఆస్తులపై కీలక తీర్పు వెలువరించింది.పటౌడీ ఆస్తులపై 2015లో విధించిన స్టేను ఎత్తివేస్తూ మధ్యప్రదేశ్ కోర్టు తీర్పును ఇచ్చింది.దీనితో 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం పటౌడీ కుటుంబ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హీరో సైఫ్ అలీ పూర్వీకులకు చెందిన ఆస్తుల్లో.. ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్ ఉంది.ఇక్కడే సైఫ్ తన బాల్యాన్ని గడిపాడు.నూర్ ఉస్ సాహెబ్ ప్యాలెస్,దార్ ఉస్ సలామ్,బంగ్లా ఆఫ్ హబిబ్,అహ్మదాబాద్ ప్యాలెస్, ఖోఫిజా ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివేక్ అగర్వాల్ ఈ కేసులో తీర్పును ఇస్తూ…ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం సంబంధిత వ్యక్తులు 30 రోజుల్లోగా పిటీషన్లు దాఖలు చేసుకోవచ్చు అని తెలిపారు. దేశ…
