Author: admin

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ను స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆటో మొబైల్, ఐటీ షేర్లు రాణించడంతో లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 76,520 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.44గా కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ లో అల్ట్రా టెక్, జొమాటో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ” అనే నినాదానికి జీవం పోస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ మినహాయించి, ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని వివరించారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇదని దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొందరు ఆరోపణలు చేస్తున్నారని స్టీల్ ప్లాంట్ ను ఆదుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్రముఖులపై జరుగుతోన్న ఐటీ సోదాలను ఉద్దేశించి దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడారు. మీ నిర్మాత దిల్‌రాజు ఐటీ రైడ్స్‌ బాధలో ఉంటే మీరు సక్సెస్‌ మీట్‌ చేసుకుంటున్నారని ఓ జర్నలిస్ట్‌ సరదాగా వేసిన ప్రశ్నకు అనిల్‌ సమాధానిమిచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ పెట్టాం కదా. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో.దిల్‌రాజు బాధలో లేరు.ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు.ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి.ఇదంతా ఒక ప్రాసెస్‌లో భాగమే.ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి.ఇండస్ట్రీ, బిజినెస్‌ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం.నేను వచ్చినా రాకపోయినా…ఈ సినిమా ప్రమోషన్‌ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి’ అని దిల్‌ రాజు మాతో చెప్పారు. అందుకే ఈ సినిమా విజయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం’’…

Read More

యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రాధాన్యతని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ బృందం ఓ ప్రణాళికను రూపొందిస్తోందని పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలను కల్పించినట్లు వెల్లడించారు. ఉపాధి ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ‘మిడిల్ క్లాస్ మ్యానిఫెస్టో’ పేరిట ఇటీవలే కేజ్రీవాల్ తమ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు.

Read More

ముడి జనపనార(జూట్) కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీ లో తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మంత్రి వివరించారు. 2025-26 సీజన్ కు ముడి జూట్ క్వింటా ధరను రూ.5,650గా ఖరారుచేశారు. ఇది సాగువ్యయం కంటే 66.8% అదనమని కేంద్ర పీయూష్ గోయల్ తెలిపారు. 2014-15లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి క్వింటాలు ధర రూ. 2,400 ఉండేదని, ప్రస్తుత ధర దానికంటే 2.35 రెట్లు ఎక్కువని తెలిపారు. ఉత్పత్తి వ్యయంపై రైతులకు సగటున 66.8% మేర లాభం వస్తుందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ను మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మిషన్ వలన గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు ప్రయోజనం పొందినట్లు గోయల్ వివరించారు.

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార,విపక్ష నేతలు విమర్శలు,ప్రతి విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.ఆరోగ్యశాఖలో ఆప్ ప్రభుత్వం రూ.382 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది.కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆప్ ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడినట్లు 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) రిపోర్టులు చెబుతున్నాయని పేర్కొన్నారు.అవినీతిపై పోరాడుతామని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారు.

Read More

దావోస్ పర్యటనలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు, సంస్థల అధినేతలతో ఏపీ మంత్రి నారా లోకేష్ వరుసగా సమావేశాలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాజాగా యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్, ఎన్విజన్ సిఇఓ లీ జంగ్, కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ లతో విడివిడిగా సమావేశమయ్యారు. యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ తో లోకేష్ భేటీ: ఏపీలో ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాసెస్ ఆటోమేషన్ సొల్యూషన్‌లను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు. ఏపీలో హెల్త్‌కేర్, AI, రోబోటిక్స్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ లో హిల్ వుడ్ తరహా పెట్టుబడులతో పాటు మచిలీపట్నం ఓడరేవులో కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి…

Read More

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’.ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్‌ దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు.విజయ్‌ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.నిన్న ఈ చిత్ర టీజర్‌ను మలయాళ అగ్ర హీరో దుల్కర్‌ సల్మాన్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనుపమ మాట్లాడుతూ…ఈ టీజర్‌ చూసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది.చాలా ఎమోషనల్‌ అయ్యాను. ఇన్నేళ్లలో నా ఫేవరేట్‌ మూవీ ఇది.నేను పోషించిన సుబ్బు పాత్ర అందరికి కనెక్ట్‌ అవుతుందని చెప్పింది. అనంతరం దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ…ఈ చిత్రం మహిళలను మెప్పిస్తుందని తెలిపారు.ఈ చిత్రం మలయాళం రైట్స్‌ను హీరో దుల్కర్‌ సల్మాన్‌ తీసుకున్నాడని,విజయంపై నమ్మకంతో ఉన్నామని నిర్మాత తెలిపారు.ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందించారు. https://youtu.be/wDyTSxZcop8?si=qgRtGeNLT-vZJjIp

Read More

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ ను ముంబై అంథేరి కోర్టు దోషిగా తేలుస్తూ…3 నెలల జైలు శిక్ష విధించింది.ఈ మేరకు మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై గతంలో ఫిర్యాదు చేశారు.అయితే అప్పటి నుండి ఒక్కసారి కూడా వర్మ విచారణకు హాజరుకాలేదు.దీనితో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.కాగా ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని,లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.

Read More

న్యూఢిల్లీలో జరిగిన బేటీ బచావో..బేటీ పడావో 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జెపి నడ్డా మాట్లాడుతూ..దేశంలో లింగ వివక్షతను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. ఇక ఆడపిల్లల జెండర్ రేషియో, సాధికారతను సాధించడమే లక్యంగా 2015 జనవరి 22న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రారంభించారు. తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తి (CSR), లింగ సమానత్వం, ఆడపిల్లల మనుగడ, రక్షణ, విద్యను ప్రోత్సహించడం, సాధికారత వైపు నిరంతర పురోగతిని సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రభావవంతమైన సామాజిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది.

Read More