బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దుండగుడి దాడి నుంచి కోలుకుంటున్నారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకొన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నటుడిని ఆసుపత్రికి వెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రివార్డు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎంతో మందికి ఇష్టమైన సూపర్ స్టార్ సైఫ్‌ను కాపాడినందుకు భజన్ సింగ్ భారీ రివార్డుకు అర్హుడని నేను నమ్ముతున్నా. అతడు సకాలంలో స్పందించడం అభినందనీయం. ఎవరికైనా అతడి పూర్తి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి. అతడికి రూ.1లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా’’ అని మికా సింగ్ పోస్ట్ పెట్టారు. తాజాగా సైఫ్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు ఆటో డ్రైవర్‌ను కలిసి అభినందించారు. క్లిష్ట సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన కూడా ఆటోడ్రైవర్‌కు రివార్డు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Author: admin
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ , ఓలా సంస్థలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ యాప్‌లు ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడా మాత్రమే కాకుండా.. ఫోన్ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆదేశించింది. మరోవైపు ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైనా కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ధరల్లో వ్యత్యాసం…
జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న మిస్టరీ మరణాలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మరణాలకు అంటువ్యాధి కారణం కాదని వెల్లడించారు. ‘‘ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కారణంగా కాదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించాం. అవి ఏమిటో నిర్ధరించే దిశగా దర్యాప్తు జరుగుతోంది. ఇతర కోణాలను కూడా వదిలిపెట్టడంలేదు. ఏదైనా కుట్ర ఉందని తేలితే.. తగిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి మీడియాతో చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇకపై గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. బాధిత కుటుంబాలు, వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వారి ఇళ్లలో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కేసు…
అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న డ్రగ్ కార్టల్స్‌ను విదేశీ ఉగ్ర సంస్థలుగా అభివర్ణించారు. హౌతీ రెబల్స్‌ను కూడా తీవ్రవాద గ్రూపుగా ట్రంప్ తెలిపారు. దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని, వేల వేల సంఖ్యలో హంతకులు కూడా ఉన్నారని, వారందర్నీ అణిచివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం 11 వేల మంది హంతకులు జీవిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో జైళ్లలో ఉన్న వారు అమెరికాకు వచ్చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో క్రైం రేటు 78 శాతం తగ్గినట్లు ట్రంప్ చెప్పారు. విదేశాల్లోని వీధి గ్యాంగ్‌లు ఇప్పుడు అమెరికాకు వచ్చేశాయని, ఆ ముఠాల ఆగడాలను కొలరాడో,…
విష్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకుడు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. లియోన్ జేమ్స్ అందించిన స్వరాలకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్‌కె. ఎం.ఎం. మానసి ఆలపించారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో విష్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. https://youtu.be/lcmm6xDuVTg?si=1jnwyn2aHzVUodOI
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. 1.7 కోట్ల మంది పౌష్ పూర్ణిమ వేడుకలో పాల్గొన్నారు. దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండవు. అయితే.. ఈ…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ నిర్వహించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాదిపూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని అన్నారు. కాగా, సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఆయన పాల్గోవాల్సిన మూడు ప్రచార సభల్లో రెండు రద్దయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్ల విభజనకు కారణం కాకుండా రాహుల్ గాంధీ ఆప్‌కు సహకరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ దీనిని ఖండించారు.…
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో సమావేశమయ్యారు. అనంతరం కాగ్నిజెంట్ నుండి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని ఈ సందర్భంగా వారికి వివరించారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనున్నట్లు రాష్ట్ర ప్రధానకార్యదర్శి కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. కేబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి 4 నాటికి పంపించాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దుండగుడి దాడి నుంచి కోలుకుంటున్నారు.చికిత్స అనంతరం ఇంటికి చేరుకొన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నటుడిని ఆసుపత్రికి వెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రివార్డు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఎంతో మందికి ఇష్టమైన సూపర్ స్టార్ సైఫ్‌ను కాపాడినందుకు భజన్ సింగ్ భారీ రివార్డుకు అర్హుడని నేను నమ్ముతున్నా. అతడు సకాలంలో స్పందించడం అభినందనీయం. ఎవరికైనా అతడి పూర్తి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి. అతడికి రూ.1లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా’’ అని మికా సింగ్ పోస్ట్ పెట్టారు. తాజాగా సైఫ్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు ఆటో డ్రైవర్‌ను కలిసి అభినందించారు. క్లిష్ట సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన కూడా ఆటోడ్రైవర్‌కు రివార్డు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
