Author: admin

మహిళల అండర్ -19 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో మలేషియా పై భారత్ 10 వికెట్ల‌ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మలేషియా జట్టు వైష్ణవి శర్మ (5/5), ఆయుషి శుక్లా (3/8) ధాటికి 14.3 ఓవర్లలో 31 పరంగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. గొంగడి త్రిష 27 నాటౌట్ (5×4) ఆకట్టుకుంది.

Read More

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సెమీ ఫైనల్ చేరుకున్నాడు. తాజాగా జరిగిన క్వార్టర్స్ లో 4-6, 6-4, 6-3, 6-4తో మూడో సీడ్ స్పెయిన్ కు చెందిన అల్కరాస్ పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన పోరులో మొదటి గేమ్ లో తడబడిన జకోవిచ్ తరువాత గేమ్ లలో పుంజుకుని పైచేయి సాధించాడు. జకోవిచ్ ఫైనల్ కు అర్హత సాధించేందుకు రెండో సీడ్ జర్మనీకి చెందిన జ్వెరెవ్ తో ఆడనున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 12వ సీడ్ అమెరికా కు చెందిన టామీ పాల్ పై 7-6 (7-1), 7-6 (7-0), 2-6, 6-1తో విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంక 6-2, 2-6, 6-3 తో రష్యాకు చెందిన పవ్లిచెంకోవా పై గెలిచింది. మరో క్వార్టర్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి 11వ సీడ్ బదోసా 7-5,…

Read More

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజున ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన అవకాశాలను వారికి వివరించారు. పెట్రో కెమికల్ ఇండస్ట్రీకి ఏపీ అనుకూలం పెట్రో కెమికల్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలం. ఇప్పటికే విశాఖలో HPCL ఉంది. త్వరలోనే రామాయపట్నంలో BPCL వస్తుంది. ఆంధ్రా ఈజ్ ది బెస్ట్ అని పెట్రో కెమికల్ ఇండస్ట్రీ ప్లేయర్స్ కూడా భావిస్తున్నారు. 2030నాటికి, దేశానికి 30% గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీని ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది.భవిష్యత్తు మొత్తం గ్రీన్ హైడ్రోజన్‌దే. ఇది మరో విప్లవానికి దారి తీస్తుంది. మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు…

Read More

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది.జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది.జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి లేఖ పంపించింది.సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది.పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.

Read More

తాజాగా 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో కీలకమైన ప్రాంతం. సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతి పెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అమెరికా ముడి చమురు ఉత్పత్తిలో 14 శాతం, 5 శాతం సహజవాయువు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. అంతే కాకుండా అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే లభ్యమవుతుంది.

Read More

గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులకు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే చేపట్టిన క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానానికి, నూతనంగా జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందాలని ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త…

Read More

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అయిన జొమాటో ,స్విగ్గీ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి.ఫలితాల నేపథ్యంలో జొమాటో షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా…దాని ప్రభావం అటు స్విగ్గీపైనా పడింది.దీంతో రెండు కంపెనీల షేర్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గానూ జొమాటో ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 57.2 శాతం క్షీణత నమోదు చేసింది. తన క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ ఆర్డర్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు, దూకుడుగా స్టోర్ల విస్తరణ చేపట్టడంతో లాభం తగ్గిందని జొమాటో వివరణ ఇచ్చింది.స్టోర్‌ విస్తరణ కోసం పెట్టుబడుల్ని వేగవతం చేయడం వల్ల సమీప కాలంలో నష్టాలు నమోదుకావచ్చని తెలిపింది.ఫలితాల అనంతరం బ్రోకరేజీ సంస్థలు అంచనాలను తగ్గించాయి.దీంతో కంపెనీ షేర్లు 11 శాతం మేర కుంగాయి.క్విక్‌ కామర్స్‌ విభాగంలో పోటీ పెరుగుతున్న వేళ.. బలహీన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం కూడా షేర్లలో…

Read More

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చాడు. కేఎల్ రాహుల్‌ను వదులుకున్న లఖ్‌నవూ.. మెగా వేలంలో రిషభ్‌ పంత్‌ కు భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లతో పంత్‌ సొంతం చేసుకున్న లఖ్‌నవూ.. అతడికే సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గొయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు. అనంతరం గొయెంకా మాట్లాడారు.పంత్‌ వచ్చే 14-15 ఏళ్లు ఎల్‌ఎస్‌జీ తరఫున ఆడతాడని,ఈ కాలంలో కనీసం ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. రిషభ్ పంత్‌ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా మాత్రమే కాక టోర్నీలో అత్యుత్తమ ఆటగాడు అవుతాడని నమ్ముతున్నా. ఆటపై ప్రేమ, గెలవాలనే తపన ఉన్న ఇలాంటి ఆటగాళ్లను నేను చూడలేదు.ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను విజయవంతమైన జట్లుగా చెబుతారు. మహేంద్రసింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ అద్భుతంగా ఆ…

Read More

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించిన నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది.యూఎస్‌ఏ వైదొలిగినా డబ్ల్యూహెచ్‌వోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం.కొవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహిరించినందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో చైనా స్పందించింది.డబ్ల్యూహెచ్‌వోకు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయాలి తప్ప..బలహీన పరచకూడదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జియాకున్‌ పేర్కొన్నారు.డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాలకు చైనా సహకారం ఉంటుందన్నారు.ఆరోగ్యకర ప్రపంచం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.

Read More

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కీలక నిర్ణయం ప్రకటించారు.ట్రంప్‌ కార్యవర్గం నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్‌ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే.చివరికి రేసు నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత ట్రంప్‌ గెలుపుకై తీవ్రంగా శ్రమించారు.ఈ నేపథ్యంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్‌ రామస్వామితోపాటు ఎలాన్‌ మస్క్‌కు తన కార్యవర్గంలో ట్రంప్‌ కీలక పదవులను కట్టబెట్టారు. తన కార్యవర్గంలో కీలకమైన డోజ్‌ (DOGE) (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ) బాధ్యలను వారిద్దరికీ అప్పగించారు.మెరుగైన పాలన,ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించే ఎఫీషియెన్సీ శాఖకు వారిద్దరూ నేతృత్వం వహిస్తారని ట్రంప్‌ తెలిపారు.అయితే ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి…

Read More