ఇటీవల ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘తల్లికి వందనం’ కార్యక్రమం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తల్లుల ఖాతాల్లోకి ఆ నగదును జిమ్ చేస్తోంది. కాగా, ఈ సంక్షేమ కార్యక్రమంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించి సవాల్ విసిరారు. కాగా , ఆయన చేసిన సవాల్ గడువు ముగియడంతో మంత్రి నారా లోకేష్ మరోసారి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాస్తా ఘాటుగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్…
Author: admin
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న ‘విమాన ప్రమాద దర్యాప్తు మండలికి అతీతంగా ఈ కమిటీ స్వతంత్ర దర్యాప్తు చేపడుతుందని పేర్కొన్నారు. విమాన ప్రమాద ఘటనపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దుర్ఘటనపై విస్తృతకోణాల్లో కమిటీ సంపూర్ణంగా దర్యాప్తు చేస్తుంది. అన్ని భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో చర్చించి నివేదిక ఇస్తుంది. ఇందు కోసం 3 నెలల గడువు పెట్టాం. బోయింగ్ 787 విమానాలపై ఇంకా ప్రత్యేక నిఘా ఏమైనా ఉంచాలా? అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మనవద్ద ఉన్న ఇలాంటి 34 విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని డీజీసీఏని ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక రాగానే…
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ లో 5 వికెట్ల తేడాతో గెలిచి అత్యద్భుతమైన ఆటతీరుతో సత్తా చాటింది. 282 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడెన్ మార్క్రమ్ 136 (207; 14×4), తెంబ బావుమా 66 (134; 5×4) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. నేడు ఓవర్ నైట్ స్కోరు 213/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఇరు జట్ల స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 212 సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 138 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 207 సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 282-5.
ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని ఈ కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి పవన్ సూచనలు చేశారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ…
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లో తొలి కామెడీ హారర్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ జానర్‌లో మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో టీజర్ విడుదలని పురస్కరించుకుని దర్శకుడు మారుతి ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు. “ఇప్పుడందరూ నవ్వుతున్నా… రానున్నది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’ అంటూ సరదా కామెంట్ చేశారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ గత సినిమాల్ని గుర్తు చేస్తూ, స్టైలిష్ అవతారంలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ నుండి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ లిస్ట్ లో టాప్ 20లో ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీలు స్థానాలు పొందారు. టాప్ 100లో తొమ్మిది మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు నిలిచి సత్తా చాటారు. ప్రతి ఏటా బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరులు తో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశం నుండి 17వ స్థానంలో ముఖేష్ అంబానీ, 20వ స్థానంలో గౌతమ్ ఆదానీ, 41వ స్థానంలో శివనాడార్, షాపూర్ మిస్త్రీ (52వ స్థానం), సావిత్రి జిందాల్ (59స్థానం), అజీమ్ ప్రేమ్ జీ (69వ స్థానం), సునీల్ మిట్టల్ (73వ స్థానం), దిలీప్ సంఘ్వీ (79స్థానం), లక్ష్మీ మిట్టల్ (86వ స్థానం)లు…
ఐసీసీ ఈవెంట్ లలో ఎన్నో సార్లు టైటిల్ వరకు వెళ్లి నిరాశ పడిన సౌతాఫ్రికా ఎట్టకేలకు మొదటి టైటిల్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అది కూడా ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కావడంతో సౌతాఫ్రికా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ను 207 పరుగులకే కట్టడి చేసింది. మిచెల్ స్టార్క్ 58 (136; 5×4) హాఫ్ సెంచరీతో మంచి పోరాటం కనబరిచాడు. అలెక్స్ కేరీ 43 (50; 5×4) పరుగులతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా 4 వికెట్లు, లుంగి ఎంగిడి 3 వికెట్లు, మార్క్రమ్, జాన్సన్, ముల్డర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని సౌతాఫ్రికా టార్గెట్ 282గా ఉంది. టార్గెట్ ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా రికెల్టన్ (6), ముల్డర్…
తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే వైసీపీ ఆరోపణలు చేస్తుందని టీడీపీ మండిపడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ తీరును ఎండగట్టారు. తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. మీ ఫేక్ ప్రచారం పై కఠినమైన చర్యలు ఉంటాయని లోకేష్ హెచ్చరించారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఎంతో కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ లభ్యమైంది. ఈ విమానం ఢీకొన్న బీజే మెడికల్ కాలేజీ భవన శిథిలాల నుండి దీనిని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్విస్టిగేషన్ బ్యూరో తెలిపింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ టీమ్ లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం నిన్న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. బ్లాక్ బాక్స్ అంటే..? ప్రతి కమర్షియల్ ఫ్లైట్ లో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న బెలుం గుహలకు ఎంతో విశిష్టత ఉంది. తాజాగా భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలకు గుర్తింపు లభించింది. కాగా, దీనిపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. బెలుం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ఆనందంగా ఉందని పురాతన సంస్కృతి, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని పేర్కొన్నారు. జీఎస్‌ఐ గుర్తింపుతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. బెలుం గుహల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో రెండో, దేశంలో పొడవైన కేవ్స్‌గా బెలుం గుహలకు పేరు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
