Author: admin

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు అందించేందుకు కీలక ముందడుగు వేసింది. ఈ ఏడాది ఉగాది పండుగ నుండి గద్దర్ చలనచిత్ర అవార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చిత్ర‌ నిర్మాణాన్ని ప్రోత్సహించే ఈ పురస్కారాలను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ తాజాగా సమావేశం అయింది. వీటి కోసం లోగోతో పాటు మిగిలిన అంశాలు, నియమ నిబంధనలపై కమిటీ ఈ సమావేశంలో చర్చించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ పురస్కారాలు అందిస్తామని తెలిపారు. మానవతా విలువలతో కూడిన చిత్రాలు, సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం…

Read More

నటి పావలా శ్యామల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఆరోగ్యం సహకరించక,డబ్బుల్లేక తాను ఇబ్బందిపడుతున్నానని ఆమె తెలిపారు.సినీ ప్రముఖులను సాయం కోరారు.దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దీనిపై స్పందించిన పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.హైదరాబాద్‌ శివార్లో సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ సైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు.ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు.భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.

Read More

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్‌ 2. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది.

Read More

కెరీర్ ఆరంభం నుండి పలు విభిన్న పాత్రలు చేస్తూ వైవిధ్యమైన కధా చిత్రాలతో ముందుకు సాగుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవల ‘మట్కా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తదుపరి చేయబోతున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనుంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనికి సంబంధించి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ జానర్ లో ఇది రూపొందుతోంది.

Read More

ఖోఖో ప్రపంచకప్ లో భారత పురుషులు, మహిళల జట్లు టైటిల్ రేసులో దూసుకుపోతున్నాయి. తాజాగా జరిగిన సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు 66-16తో సౌతాఫ్రికా పై ఘనవిజయం సాధించింది. ఫైనల్ లో నేపాల్ తో భారత్ తలపడనుంది. మరో సెమీస్లో నేపాల్ 89-18తో ఉగాండా పై గెలిచింది. పురుషుల విభాగం సెమీస్ భారత్ 60-42తో సౌతాఫ్రికా పై నెగ్గింది. ఫైనల్లో నేపాల్ తో భారత్ ఆడనుంది. మరో సెమీస్ లో నేపాల్ 72- 20తో ఇరాన్ పై గెలిచింది.

Read More

విజయ్ హజారే వన్డే టోర్నీ విజేతగా కర్ణాటక విజేతగా నిలిచింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని జట్టు తాజాగా జరిగిన ఫైనల్లో 36 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ 101(92; 7×4, 3×6) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అభినవ్ మనోహర్ (79), శ్రీజిత్ (78) రాణించారు . విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరె 110( 111; 8×4, 2×6) పోరాడాడు. అతడికి హర్ష దూబె 63(30; 5×4, 5×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. వాసుకి కౌశిక్ (3/47), ప్రసిద్ధ కృష్ణ (3/84), అభిలాష్ శెట్టి (3/58) విదర్భను కట్టడి చేశారు. విజయ్ హాజారే ట్రోఫీ గెలవడం కర్ణాటకకు ఇది అయిదోసారి. ఆ జట్టు చివరగా 2019-20 సీజన్లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.

Read More

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, హోం మంత్రి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కూటమి నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. రేపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) దక్షిణ క్యాంపస్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు.

Read More

అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్ కు సంబంధించి మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్ లాగ్స్ నుండి కంప్లైంట్ చేసేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. 2023లో సంచార్ సాథీ పోర్టల్ ను డీఓటీ తీసుకువచ్చింది. తాజాగా మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ప్రతి వినియోగదారుని ప్రైవసీ, సెక్యూరిటీని ఈ యాప్ అందచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లభించే ఈ కొత్త యాప్ అనుమానాస్పద ఫేక్ కాల్స్, మెసేజ్ల గురించి వినియోగదారులు నేరుగా తమ మొబైల్ లాగ్స్ నుండి రిపోర్ట్ చేయవచ్చు. వినియోగదారులు తమ పేరు మీద ఉన్న మొబైల్ కనెక్షన్లను అన్నింటినీ గుర్తించవచ్చు. పోగొట్టుకున్న మొబైల్ ను బ్లాక్ చేయడం, కనిపెట్టడం, స్వాధీనం చేసుకోవడం వంటి ఫీచర్లు కూడా ఈ అప్లికేషన్ లో ఉన్నాయి. నాణ్యమైన మొబైల్ లను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా వాటి నాణ్యతను కూడా ఈ యాప్ ద్వారా…

Read More

65 లక్షల కుటుంబాలకు పైగా నేడు ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో స్వామిత్వా (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ) పధకం కింద ఆస్తి కార్డుల పంపిణీ చేశారు. దేశంలోని 10 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 230 జిల్లాలలోని లబ్దిదారులు ఈ కార్డులు అందుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. లబ్దిదారులకు అభినందనలు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించి 1.5 కోట్ల మందికి స్వామిత్రా కార్డులు పంపిణీ చేసినట్లు వివరించారు. నేడు మరో 65 లక్షల కుటుంబాలు ఈ కార్డులు పొందాయని తెలిపారు. గ్రామాల్లోని 2.25 కోట్ల మంది తమ ఇంటికి…

Read More

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ కు అశేష జన వాహిని తరలివస్తోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర నదుల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మహా కుంభమేళా లో పాల్గొన్నారు. గంగా, యమునా, సరస్వతీ నదీ సంగమం వద్ద పుణ్య స్నానమాచరించి పలు దేవాలయాలను సందర్శించారు. ఈరోజు, తీర్థరాజ్ ప్రయాగ్‌రాజ్‌లో, భారతదేశం యొక్క శాశ్వతమైన ఆధ్యాత్మిక వారసత్వం మరియు విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళాలో స్నానం చేయడం మరియు ధ్యానం చేయడం ద్వారా సంతృప్తి చెందినట భావన కలిగినట్లు తెలిపారు. ఈ మహా కుంభమేళాకు 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా కాగా,అందుకు తగినట్లుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది.

Read More