Author: admin

ఏపీలో ఇటీవల పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గత ప్రభుత్వ పాలన విపత్తు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. గత పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? అని షర్మిల ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ? భారీ…

Read More

స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చెయ్యాలని సొంతంగా గనులు కేటాయించాలని మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని లేదంటే కార్మికులతో కలసి ఉద్యమం చేస్తామని చెప్పారు. మొదటి నుండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు‌ అని కార్మికులు కేంద్రం ఇచ్చే ప్యాకేజీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్రమంత్రి వెల్లడించారన్నారు. ఇక సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే తిరుపతి దుర్ఘటన జరిగిందని విమర్శించారు. కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మరణించారని…

Read More

“క” సినిమాతో గతేడాది విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం.ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. విభిన్న ప్రేమ కథ చిత్రంగా ఇది సిద్ధం అవుతుంది.విశ్వకరుణ్‌ దర్శకుడు.ఇందులో రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటిస్తుంది.శివమ్‌ సెల్యూలాయిడ్స్‌, సారెగమ మ్యూజిక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌కు టీమ్ శ్రీకారం చుట్టింది. ‘అగ్గిపుల్లె..’ అనే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేసింది. సామ్ సిఎస్ స్వరాలు అందించారు. https://youtu.be/JgeilgVZC0E?si=uLHGcgih3UlrOeCe

Read More

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనతో మహారాష్ట్ర సర్కార్‌పై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.దీనిపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ స్పందించారు.సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తికి అదొక సెలబ్రిటీ ఇల్లన్న సంగతి తెలియదని అన్నారు.ముంబైలో శాంతిభద్రల విషయమై ప్రభుత్వంపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.వాస్తవంగా సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటనలో నిందితుడికి అది ఓ సెలబ్రిటీ ఇల్లన్న సంగతి తెలియదు.బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు. తర్వాత కుటుంబంతోపాటు ముంబైకి మకాం మార్చాడు.కేవలం దొంగతనం కోసమే సైఫ్‌ ఇంట్లోకి అతడు వచ్చాడు.అంతే కానీ నిందితుడికి అది ఎవరి ఇల్లు అనేది తెలియదు’ అని అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.బాంద్రాలోని సైఫ్‌ అలీఖాన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది.ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా దుండగుడు సైఫ్‌ చిన్న కొడుకు జేహ్‌ గదిలోకి వెళ్లాడు.అతడ్ని చూసిన జేహ్ కేర్…

Read More

బెంగళూరు నగర పౌరులకు అక్కడి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (బీఎంఆర్‌సీఎల్‌) షాక్‌ ఇవ్వనుంది. మెట్రో రైల్‌ చార్జీలను భారీగా పెంచడానికి రంగం సిద్ధం చేసింది. మెట్రో రైల్‌ నిర్వహణ ఖర్చులు పెరిగినందున రైల్‌ చార్జీల ధరలను 30 నుంచి 40 శాతం వరకు పెంచకతప్పటం లేదని, పెంచిన చార్జీలు జనవరిలోనే అమల్లోకి తీసుకొస్తున్నామని తాజాగా ప్రకటించింది. ఆ రాష్ట్ర రవాణా శాఖ అన్ని క్యాటగిరిల్లోని బస్‌ చార్జీలను 15 శాతం పెంచిన వెంటనే బీఎంఆర్‌సీఎల్‌ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం అక్కడి ప్రజలని కాస్త షాక్ కు గురి చేసింది. ‘చార్జీల పెంపుదలకు బీఎంఆర్‌సీఎల్‌ బోర్డ్‌ దాదాపు ఆమోదముద్ర వేసింది. సవరించిన చార్జీలు త్వరలోనే అమల్లోకి వస్తాయి’ అని బీఎంఆర్‌సీఎల్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో రైల్‌ నడవటం లేదని, సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించాల్సి ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read More

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలనే ఇద్దరు ఉపాధ్యాయులు తమ అసభ్య కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు.రాజస్థాన్ లోని చిత్తోర్ఢ్ లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలితో ఓ ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరి పైనా సస్పెన్షన్ వేటు విధించారు.పాఠశాల స్టాఫ్ రూమ్ లో కొద్ది రోజులుగా సాగుతోన్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం అత్యంత ఇబ్బందికరంగా ఉన్న వీడియో దృశ్యాలు తమ దృష్టికి రావడంతో డీఈవో తక్షణమే వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.పాఠశాలలో టీచరమ్మతో ఉపాధ్యాయుడి రాసలీలల వ్యవహారం వెలుగు చూడటంతో గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు.వీరిద్దరి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల బృందంతో కలిసి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. తరువాత హయత్ హోటల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు కృషి చేయనున్నారు.

Read More

మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. పురుషులు, మహిళల విభాగాల్లో అత్యద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్‌ పై ఘనవిజయం సాధించింది. ఆరంభం నుంచే మన జట్టు దూకుడుగా ఆడింది. కెప్టెన్ ప్రియాంక , వైష్ణవి రాణించడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆద్యంతం అదే బాటలో కొనసాగి టైటిల్ కైవసం చేసుకుంది. పురుషుల ఫైనల్ లో భారత్ 54-36తో నేపాల్ పై నెగ్గింది. ఖోఖో ప్రపంచకప్ లో సత్తా చాటిన భారత జట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తినిస్తుందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

Read More

గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ఏర్పాటు చేసిన గిరిజన – ఆదివాసి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. గిరిజనులు, ఆదివాసీలు అంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని పేర్కొన్నారు. తాము జీవించటంతో పాటు, ప్రకృతిని కాపాడుకోవడానికి కట్టుబడిన వారి సంస్కృతి మహోన్నతమైనదని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్ టి వర్గాలకు ఎన్నో అవకాశాలను అందిస్తోందని వాటిని గిరిజన సోదరులు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన సోదరులందరితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని గిరిజన-ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే లక్ష్యంతో, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఇతర…

Read More

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం పలు గుడారాల్లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Read More