భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశానికే ప్రమాదంగా మారిందని దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని క్యాన్సర్ వ్యాధితో పోల్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్ వైఖరిపై విమర్శలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అదే వారికి ఇప్పుడు ప్రమాదంగా పరిణమించిందని అన్నారు. అది ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారత్ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయంలో వెనుకబాటుకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. వెస్ట్రన్ పాలసీకి వ్యతిరేకమైనప్పటికీ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మద్దతిస్తుంది తెలిపారు. భారత్ ను ‘విశ్వబంధు’ గా అభివర్ణించారు. దేశం ప్రయోజనాల దృష్ట్యా వ్యవహారిస్తోందని స్పష్టం చేశారు. భారత్ విశ్వ వేదికపై పరస్పరం స్నేహాన్ని పెంచుకుంటూ నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని పేర్కొన్నారు.
Author: admin
అంతర్గత వివాదాలతో నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా రోజురోజుకీ ఇది ముదురుతున్నట్లు తెలుస్తోంది.తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్‌బాబు తాజాగా జిల్లా మేజిస్ట్రేట్‌నుఆశ్రయించారు.జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు.ఈ మేరకు తన ఆస్తులను ఖాళీ చేయాలని కోరారు.దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్‌బాబు ఆస్తులకు సంబంధించిన ఒక నివేదికను పోలీసులను నుండి సేకరించారు.అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు పంపించారు.
సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పారు.సైఫ్‌పై దాడి గురించి తాను మాట్లాడే సమయంలో తాను ప్రవర్తించిన తీరు సరైందని కాదని ఆమె అన్నారు.అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు.డియర్ సైఫ్ అలీ ఖాన్ సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను.ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు.డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను.ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను.మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది. మీపై గౌరవంతో..’’ అని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా సైఫ్ అలీఖాన్ దాడిపై ఆమెను…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం ముంబై పోలీసు శాఖకు చెందిన 30 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.సైఫ్ దాడి గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.దీనిని ఉద్దేశించి తాజాగా మహారాష్ట్ర మంత్రి యోగేష్ కడమ్ స్పందించారు.సైఫ్‌పై దాడితో అండర్‌వరల్డ్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.దుండగుడు ఎటువంటి క్రిమినల్ గ్యాంగ్‌కు పనిచేయడం లేదన్నారు.అసలు ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడన్న విషయంలో కూడా ఆ వ్యక్తికి క్లారిటీ ఉండకపోవచ్చు అని పోలీసులు తెలిపారు.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్ ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో ఆప్ పోస్ట్ చేసింది. ‘ఓటమి భయంతో బీజేపీ ఆందోళన చెందుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి తన గూండాలను ఉపయోగించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఆయనను గాయపరిచేందుకు ప్రయత్నించారు. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా చేయాలనుకున్నారు. బీజేపీ వ్యక్తుల పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరు. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు’ అని ఎక్స్‌లో పేర్కొంది. ఆప్ ఆరోపణలను పర్వేష్ ఖండించారు. కేజ్రీవాల్ కారు ఇద్దరు యువకులను ఢీకొట్టిందని విమర్శించారు.…
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కోల్ కత్తా లోని స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ..తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని కోర్టుకు తెలిపాడు. ఈ నేరం తాను చేయలేదని చెప్పాడు.ఈ నేరానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్ అధికారి హస్తం కూడా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించాడు.నన్ను తప్పుగా ఇరికించారు.నేను ఈ నేరం చేయలేదు.హత్యాచారం చేసిన వారిని వదిలివేస్తున్నారు.ఇందులో ఒక ఐపీఎస్ కూడా ఉన్నారు’ అని కోర్టుకు చెప్పాడు.సీల్దాలోని సీబీఐ కోర్టు ఈ కేసుపై తాజాగా తీర్పు ఇచ్చింది.సీసీటీవీ ఫుటేజ్, సీబీఐ సాక్ష్యాల ఆధారంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా సీల్దా కోర్టు నిర్ధారించింది.సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది.అయితే ఆ రోజు…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్ కతా లోని సీల్దా కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చింది. అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది. సీబీఐ సమర్పించిన ఆధారాల మేరకు సంజయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. తీర్పు నేపథ్యంలో భారీ భద్రత మధ్య సంజయ్ ను కోర్టుకు తీసుకువచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఈ సందర్భంగా జడ్జికి సంజయ్ తెలిపాడు. అతనికి 20న మాట్లాడే అవకాశం ఇస్తామని జడ్జి తెలిపారు. ఈ తీర్పును తాను గౌరవిస్తున్నట్లు మృతురాలి తండ్రి కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు. 2024 ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు…
మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు . ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు . ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని తెలుగు వాడి ఆత్మ గౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.. బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యమని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ సంక్షేమానికి అర్ధం తెచ్చారు. అభివృద్ధి అంటే చేసి చూపించారు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులు అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చింది అన్న ఎన్టీఆర్. బీసీలకు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. గత 5 ఏళ్ళు కడపలో ఏమి జరిగిందో చూసారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కడపను మా ప్రభుత్వం అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తుందో చూస్తారు. ఈ సారి ఉమ్మడి కడప జిల్లాలో 10 కి…
ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న, పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్ మార్చి 2న భారత్ దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీ కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్…
గుంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపారు. ఇటీవల విజయవాడ వరదల్లో అహర్నిశలు పని చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి నూతన వస్త్రాలు, పళ్లు బహూకరించారు. గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రతి నెల మూడో…
