కృష్ణా జిల్లా, కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ NIDM ప్రారంభోత్సవం, NDRF 20వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న సమయంలో వికసిత్ భారత్ లో విపత్తు నిర్వహణ అనేది చాలా కీలకమని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, దానికి తగినట్లుగా సన్నద్ధం కావడం అనేది నిరంతర ప్రక్రియని మారుతున్న ప్రపంచ వాతావరణ పరిస్థితులతో పాటు, స్థానికంగా మారుతున్న వాతావరణ అంశాలను బేరీజు వేసుకొని ముందుకు సాగాలని సూచించారు. విపత్తులు కేవలం ప్రకృతి సంబంధమైనవి మాత్రమే కాదని మానవులు చేసినవి కూడా ఉంటాయన్నారు. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి…
Author: admin
ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అతడి తల్లి స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు. తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా కొడుకు చనిపోతే నేను ఏడుస్తా. కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు.. సంజయ్‌కు జీవించే హక్కు లేదు. అతడికి మరణ శిక్ష విధించినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వైద్యురాలు నాకు కూతురితో సమానం. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లీ ఊరుకోదు’’ అని ఆమె తాజాగా మీడియాతో చెప్పారు.
నేడు కృష్ణా జిల్లా, కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ (NIDM) ప్రారంభోత్సవం, NDRF 20వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. హుద్ హుద్ అప్పుడు విజయవాడ వరదలు సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చూపించిన చొరవను కొనియాడారు . ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కోసం నాడు భూములు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నేడు కేంద్ర సహకారంతో అవి పూర్తి చేసాం. అమిత్ షా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. విపత్తుల్లో కొన్ని లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడిందని అలాంటి సంస్థ మన రాష్ట్రంలో రావటం గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని తెలిపారు . అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారని ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కేంద్రం…
అండర్-19 మహిళల ప్రపంచ కప్-2025 లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. తాజాగా నేడు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటయింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలబడి లేకపోయారు. పరుగులు చేయడంలో తడబడ్డారు. అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో పరుణికా సిసోడియా 3, జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి తేలికగా ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (4) కమిలిని (16 నాటౌట్), సానికా చాల్కే (18నాటౌట్) పరుగులు చేశారు.
ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి ఉద్యోగుల వెతలు తీర్చిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎకౌంటుల బదిలీని మరింత సులభం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటును తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యాజమాన్యాల చుట్టూ తిరగే శ్రమ, టైం వేస్ట్ ఉండదు. కాగా, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్లైన్లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. అదివరకు లాగా మామూలుగానే వారి యాజమాన్యాలే వీటిని…
ఇటీవల బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దూరి కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి గురించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు ముంబై పోలీసులు.కత్తితో పొడిచింది బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ల షరీఫుల్ ఇస్లాం అని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.అయితే నిందితుడికి మహ్మద్ ఆలియన్ అనే పేరు సైతం ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని,అతని లక్ష్యం ఖరీదైన వస్తువులు దొంగలించడమే అని సీనియర్ పోలీస్ అధికారి విలేకరులతో అన్నారు.థానే జిల్లాలో ఘోడ్ బందర్ రోడ్డులో హీరానందానీ ఎస్టేట్ నుండి దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితుడు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలోకి చొరబడి తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకుని ఇక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు.దొంగతనం చేద్దామనే లక్ష్యంతో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన షరీఫుల్ సైఫ్ ఎదురురావడంతో కత్తితో పొడిచిపరారయ్యాడు. దాడి తరువాత ముంబై పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.తరువాత…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తో బీజేపీ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ఘనవిజయం అందించాలనే దిశగా జనవరి 22న మధ్యాహ్నం 1 గంటకు ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ సామజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన సందేశాన్ని అందించారు.అయితే ఈ కార్యక్రమంలో అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలతో సంభాషించే అవకాశం ఉందని తెలియచేస్తూ…అభిప్రాయాలను పంచుకునే కొందరితో మాట్లాడతానని ప్రధాని నరేంద్రమోదీ పోస్ట్ లో తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కొందరు రౌడీలు అత్యుత్సాహం ప్రదర్శించారు.తమ గ్యాంగ్ లీడర్ పుట్టిన రోజును స్థానిక ప్రాంతంలో ప్రజలు బెంబేలెత్తిపోయేలా జరిపారు.రద్దీగా ఉండే లాల్ బంగ్లా మార్కెట్‌లో బాంబులు విసిరి,తుపాకులు పేల్చారు.దీనితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి…అదే మార్కెట్ చుట్టూ వారిని ఊరేగించారు.వ్యాపారుల్లో ధైర్యం నింపేందుకు నిందితులను మార్కెట్లో ఊరేగించామని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని నిందితులను హెచ్చరించారు.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చంద్రుడు పుట్టుక గురించి శాస్త్రవేత్తలు సరికొత్త విషయాలను వెల్లడించారు.చంద్రుడు దాదాపు 400 కోట్ల సంవత్సరాల నుండి భూమికి ఖగోళ సహచరుడిగా కొనసాగుతున్నాడు.సహజసిద్ధమైన ఈ ఉపగ్రహం ఓ భారీ విపత్తు వల్ల ఆవిర్భవించిందన్న మాట చాలా ఏళ్ల నుండి వినిపిస్తుంది.అయితే అంగారక గ్రహమంత పరిమాణంలో ఉన్న ‘థియా’ అనే ప్రొటో గ్రహం భూగోళాన్ని ఢీ కొట్టడం వలన చంద్రుడు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చాలా కాలం నుండి చెబుతున్నారు.అయితే దఎప్పటి నుండో మనుగడలో ఉన్న ఈ సిద్ధాంతాన్ని తాజా పరిశోధన సవాల్ చేసింది.చంద్రుని ఆవిర్భావం ఎలా జరిగిందో నిగ్గు తేల్చాలన్న లక్ష్యంతో గొట్టింగెన్ యూనివర్సిటీ, మాక్స్ ప్లాంక్ సోలార్ సిస్టమ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. చంద్రుడు భూమి నుండి ఆవిర్భించలేదు అని తాజా సిద్ధాంతం.
భారత్-బంగ్లాదేశ్‌కు చెందిన రైతుల మధ్య తలెత్తిన వాగ్వాదం చిన్నపాటి ఘర్షణకు దారి తీయడంతో సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.బీఎస్‌ఎఫ్ – బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు బీఎస్‌ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.జనవరి 6న ఉభయ దేశాలకు చెందిన సరిహద్దు భద్రతా దళాల మధ్య వివాదం తలెత్తిన సుఖ్‌దేవ్‌పూర్ సరిహద్దు ఔట్‌పోస్టు ప్రాంతం వద్దనే నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
