కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లోని AIIMS బయట దేశవ్యాప్తంగా ఉన్న పేద రోగులు మరియు వారి కుటుంబాలు చలి, ధూళి మరియు ఆకలి తో AIIMS వెలుపల పడుకోవలసి వస్తుందని అన్నారు. ఈమేరకు అక్కడ ఉన్న వారిని పరామర్శిస్తూ ఉన్న ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. AIIMS బయట నరకం! దేశవ్యాప్తంగా ఉన్న పేద రోగులు మరియు వారి కుటుంబాలు చలి, ధూళి మరియు ఆకలి తో AIIMS వెలుపల పడుకోవలసి వస్తుంది ఆశ్రయం లేదు, ఆహారం లేదు, మరుగుదొడ్డి లేదు, తాగునీరు లేదు. పెద్దఎత్తున వాదనలు వినిపించే కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ మానవతా సంక్షోభంపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. AIIMS के बाहर नरक!देशभर से आए ग़रीब मरीज और उनके परिवार AIIMS के…
Author: admin
ఆన్‌లైన్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటుడు మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కూర్చొని మాట్లాడుకుందాం అని ఆయన పేర్కొన్నారు.కలిసి కూర్చొని మాట్లాడుకుందాం.నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు వారందరినీ పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం.ఏం అంటావు? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా.నీకు నచ్చిన వాళ్లను నువ్వు తీసుకువచ్చుకో లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం.మీ #కరెంట్‌తీగ’’ అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాననేది మాత్రం మనోజ్ డైరెక్ట్‌గా ఎక్కడా చెప్పలేదు.మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంగీత దర్శకుడు తమన్ తెలుగు సినిమా గురించిన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈరోజు ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి.ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది.కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి.ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది.Thoughtful words my dear ! God Bless ! అంటూ…
హెచ్-1బీ వీసా నిబంధనల్లో అగ్ర రాజ్యం అమెరికా భారీ మార్పులు చేసింది. తద్వారా అమెరికన్ కంపెనీలు మరింత తేలిగ్గా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది.కొత్త నిబంధనలు శుక్రవారం (జనవరి 17) నుంచి అమల్లోకి వచ్చాయి. సమర్థులైన విదేశీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు స్పష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. వీటితో అమెరికాలోని లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు మరింత లబ్ధి చేకూరనుంది.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైలా’.ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ సంస్థపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది. విశ్వక్ సేన్ సోను అనే ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు.బ్యూటీ పార్లర్ నడిపే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది.టీజర్ చివర్లో లేడీ గెటప్ లో విశ్వక్ లుక్స్ అలరిస్తున్నాయి.ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14 న ఇది విడుదల కానుంది. https://youtu.be/YAk2UKzfa8Y?si=Jwu009VoYNifHELU
ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్- చిరాగ్ సెమీస్ లోకి అడుగుపెట్టింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో భారత జోడీ 21-10, 21-17 తేడాతో కొరియాకు చెందిన జిన్- మిన్ పై విజయం సాధించింది. తొలి గేమ్ లో విరామానికి 11-3తో నిలిచిన ఈ జోడీ అదే జోరులో నెగ్గింది. రెండో గేమ్ 16-16తో సమంగా ఉన్న దశలో సాత్విక్ జోడీ అద్భుతమైన ఆటతీరుతో గెలుపు కైవసం చేసుకుంది. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ఆమె 9-21, 21-19, 17- 21 తేడాతో ఇండోనేసియాకు చెందిన పారిస్ కాంస్య విజేత మరిస్కా తుంజుంగ్ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో కిరణ్ జార్జ్ 13-21, 19-21తో చైనాకు చెందిన యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు.
మలేషియా వేదికగా నేటి నుండి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్ లుగా ఆడుతున్నాయి. మలేసియా, శ్రీలంక, వెస్టిండీస్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్-ఎలో ఉన్నాయి.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత్ తన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ తో తలపడనుంది . తెలుగు రాష్ట్రాల నుండి గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఈ టోర్నీలో ఆడుతున్నారు. టోర్నీ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ ఆడనుంది.
ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనమని టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గ 29వ వర్థంతి సందర్భంగా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని పేర్కొన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని లోకేష్ ఈసందర్భంగా పేర్కొన్నారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి అని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
‘సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు’ అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది… నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. నేడు నటి దిగ్గజం, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది…స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త..సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనతో… “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని…తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు తెలిపారు.
ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మొబిలిటీ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు మరియు అభివృద్ధిని చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని ఇది ప్రజల పెరుగుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సజావైన ప్రయాణ అనుభవాలను సృష్టించడం మరియు ఆటో మొబైల్ పరిశ్రమకు కొత్త అవకాశాలకు మార్గాలు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మేకిన్ ఇండియా చొరవ, PLI స్కీమ్‌ల మద్దతుతో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
