Author: admin

ఐర్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత మహిళా క్రికెట్ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా నేడు జరిగిన మూడో వన్డేలో భారత్ 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వన్డేల్లో భారత మహిళా జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసింది. ప్రతీక రావల్ 154 (129;20×4, 1×6), స్మృతి మంథాన 135 (80; 12×4, 7×6) భారీ సెంచరీలతో కదంతొక్కారు. రిచా ఘోష్ 59 (42; 10×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్గాస్ట్ 2 వికెట్లు, అర్లెన్ కెల్లీ, ఫ్రెయా సర్జెంట్, జార్జెనా డెంప్సే ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక భారీ లక్ష్యాన్ని…

Read More

అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 1975 లో ఈ స్టూడియో నిర్మించారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగరోజు ఈ స్టూడియో ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితో పాటు అల్పాహారం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయన్నాఆర్ ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. రోడ్లు కూడా లేని రోజుల్లో ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారన్నారు. ఎంతో మంది దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు ఎంతోమందికి ఉపాధి కలిగించిందని తెలిపారు. https://youtu.be/Qfm1_yjX4ik?si=W8mpzDvD3ZPCN9iv

Read More

రూ.14లక్షల కోట్ల అప్పు ఉన్నా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ బకాయిల విడుదలతో తమది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు .పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిరైతులను ప్రోత్సహించేందుకు ‘మినీ గోకులం’ పునరుద్దరించినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు తూట్లు పొడిచిందని ఆక్షేపించారు.

Read More

అభిశంసనకు గురైన సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.తీవ్ర ప్రతి ఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనితో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టయిన మొదటి అధ్యక్షుడిగా యోల్‌ నిలిచారు.అయితే బుధవారం తెల్లవారుజామున సియోల్‌లోని అధ్యక్ష భవనం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు 3 వేల మందికిపైగా పోలీసులతో యాంటీ కరెప్షన్‌ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు.అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు,యోల్‌ మద్దతుదారులు,వ్యక్తిగత సిబ్బంది,సైన్యం పోలీసులతోపాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా తీవ్ర ప్రతిఘటనల నడుమ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన అధికారులు యోల్‌ను అరెస్టు చేశారు.ఓ ఎరుపు రంగు బస్సులో ఆయనను అక్కడి నుంచి తరలించారు.ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.అయితే యోల్‌ను గవాచియాన్‌లోని కరప్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ కార్యాలయానికి తరలించే అవకాశం…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం,ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ కు కేంద్రం షాక్ ఇచ్చింది.ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కు అనుమతి ఇచ్చింది.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది.అయితే ముందుగా అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గత సంవత్సరం నవంబర్‌లో ఆదేశించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీ గత నెల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను అనుమతి కోరింది.ఈడీ అభ్యర్థనకు ఎల్జీ ఆమోదం తెలిపారు.దీనితో ఈ విషయాన్ని ఈడీ అధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా…కేజ్రీని విచారించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.కేజ్రీవాల్‌తో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ సీనియర్‌ నేత,ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను కూడా విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది.

Read More

రాష్ట్ర ప్రజలందరికి ఏపీ సీఎం చంద్రబాబు కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. కుటుంబమంతా పలు అభివృద్ధి, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానికులతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

Read More

భారత వాతావరణశాఖ (ఐఎండీ) 150 ఏళ్ల వేడుక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ‘మిషన్ మౌసం’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి వాతావరణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని విడుదల చేశారు. పర్యావరణ మార్పుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల‌ గురించి ప్రస్తావించారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్స్ కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ ను ప్రారంభించినట్లు తెలిపారు. వాతావరణ ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, నిర్వహణ, ఎయిర్ క్వాలిటీ డేటాను అందించడంపై మిషన్ మౌసం దృష్టిసారిస్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో విపత్తు సమయాలలో వాటికి ఆపన్నహస్తం అందించడంలో భారత్ ముందుంటుందని అన్నారు.

Read More

హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్‌ బడోలిపై రేప్‌ కేసు నమోదు అయ్యింది.ఆయనతో పాటు రాకీ మిట్టల్‌ అకా జై భగవాన్‌ అనే గాయకుడు తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ…ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా 2023 జూలై 3న ఈ ఘటన జరిగినట్లు యువతి వెల్లడించింది.తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీకి వచ్చినప్పుడు బలాత్కారం చేశారని తెలిపింది.ఈ ఘటనపై గత సంవత్సరం డిసెంబర్‌ 13న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు.ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read More

రెబెల్ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రాజాసాబ్‌”. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకె్కిస్తున్నారు.ఇందులో మాళవిక మోహనన్‌,నిధి అగర్వాల్ లు ప్రభాస్ కు జోడిగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్‌డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ అభిమానులకు,సంక్రాంతి శుభాకాంక్షలతో అప్డేట్ ఇచ్చింది.డార్లింగ్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు…మనం ఎపుడు వస్తే అప్పుడే అసలైన పండగ…త్వరలో చితక్కొట్టేద్దాం. రాజాసాబ్‌ త్వరలోనే థియేటర్లలో మిమ్మల్ని కలుస్తాడు…విడుదల చేసిన పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Read More

టాలీవుడ్ యువ కథానాయకుడిగా శర్వానంద్‌ సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి బాలకృష్ణ ఆల్‌ టైమ్‌ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి టైటిల్‌ను ఫిక్స్‌ చేసింది చిత్రబృందం.ఈ సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఇద్దరు భామలు అరుస్తుంటే..శర్వానంద్‌ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో పోస్టర్ లో చూడచ్చు.ఇందులో శర్వానంద్ కు జోడిగా సంయుక్తా మీనన్‌,సాక్షి వైద్య నటిస్తున్నారు.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.

Read More