ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. నారావారిపల్లెలోని తన స్వగృహం వద్ద ప్రజల నుండి సీఎం చంద్రబాబు అర్జీలు స్వీకరించారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రారంభించారు. సూక్ష్మ సాగు పధకాన్ని ప్రారంభించారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమిపూజ నిర్వహించారు. నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో ద్వారా మహిళా సంఘాలకు సరకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.
Author: admin
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతీ త్రివేణి సంగమ ప్రదేశం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు పవిత్ర స్నానాలు పూజలతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి కోట్ల మంది భక్తులు, పర్యటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుండి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు. కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. “భారతీయ విలువలు, సంస్కృతిని…
స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ యువ నేతల సమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. లక్షమంది యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత యెక్క శక్తిసామర్థ్యాలే మన దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుస్తాయని పేర్కొన్నారు. యువతపై స్వామీ వివేకానందకు ఎంతో విశ్వాసం ఉండేదని, అన్ని సమస్యలకూ యువతరమే పరిష్కారం చూపగలదనేది ఆయన విశ్వాసమని తెలిపారు. ఆ మాటలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దేశం మరింత ముందుకు సాగాలంటే భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ప్రస్తుతం మనం చేస్తున్నది అదే. కాలం కంటే ముందుకు వెళ్లేలా వివిధ రంగాల్లో భారీ లక్ష్యాలను భారత్ సాధిస్తోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోడీ దాదాపు 6 గంటలసేపు ఆరు గంటలసేపు యువతతో…
రాష్ట్ర ప్రజలందరికి ఏపీ సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి అందరికీ భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టు వరుసగా స్వదేశంలో రెండో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐర్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 370 పరుగులు భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ 102 (91; 12×4) సెంచరీతో అదరగొట్టింది.హార్లీన్ డియోల్ 89 (84;12×4), కెప్టెన్ స్మృతి మంథాన 73 (54; 10×4, 2×6), ప్రతీక రావల్ 67 (61; 8×4,1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఐర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రిస్టీనా రిలీ 80 (113; 10×4) ఆకట్టుకుంది, సారా ఫోర్బ్స్ (38),…
లెబనాన్ కొత్త అధ్యక్షుడిగా ఆ దేశ సైనిక కమాండర్ జోసెఫ్ ఔన్ ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య 14 నెలల ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఒప్పందం కుదిరిన కొద్ది వారాల్లోనే ఈ పదవి భర్తీ అయింది. లెబనాన్ సార్వభౌమాధికార దేశం(సావరిన్ స్టేట్). బీరుట్ రాజధాని కాగా, ఉత్తర తూర్పు సరిహద్దులో సిరియా, దక్షిణ సరిహద్దులో ఇజ్రాయిల్ ఉన్నాయి. ఈ దేశం మధ్యధరా సముద్రతీరంలో ఆరేబియన్ దేశాల మధ్యన ఉంది.
తిరుచానూరులో ఇంటింటికి న్యాచురల్ గ్యాస్ సరఫరాను ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. అనంతరం వాణిజ్య వాహనాలు, ఆటో రిక్షాలు, సీఎన్జీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నాడు దీపం 1 ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్లు వివరించారు. నేడు దీపం 2 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరొక్క అడుగు ముందుకు వేసి, 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీ త్వరలో గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుందని తెలిపారు. మన రాష్ట్రంలో పుష్కలంగా సహాజవనరులు ఉన్నాయన్నారు. హైవే లు, పోర్టులు, పొడవైన సముద్ర తీరం, ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని వివరించారు. ఇంటింటికి గ్యాస్ సరఫరా కోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.ఢిల్లీ ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనుండటంతో ఆ పార్టీ ప్రచారాన్ని ఉదృతం చేసింది.నిరుద్యోగులకు యవ ఉడాన్ యోజన కింద రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. ఇది ఉచితంగా ఇచ్చే మొత్తం కాదని వెల్లడించింది. ఆ పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘‘ఏదైనా కంపెనీ లేదా ఫ్యాక్టరీలో తమకు ఉన్న నైపుణ్యాలను చూపించిన యువతకు ఆర్థిక సాయం చేస్తాం. వారు ఈ కంపెనీల నుంచి ఆ సొమ్మును పొందుతారు. ఇది ఇళ్లల్లో ఖాళీగా కూర్చొనేవారికి ఉచితంగా సొమ్ములు ఇచ్చే పథకం కాదు. ప్రజలు శిక్షణపొందిన రంగాల్లో స్థిరపడేలా సాయం చేయడానికే ఈ పథకం తెచ్చాము’’ అని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నాయకురాలు, సీఎం అతిషి తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. తన పార్టీ పని, నిజాయితీ రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు అన్నారు. ఎన్నికల్లో పోటీకి అవసరమైన డబ్బును ప్రజల నుంచి విరాళంగా పొందేందుకు ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేశారు.ఢిల్లీ ఎన్నికల్లో పోటీ కోసం తనకు రూ.40 లక్షలు అవసరమని ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. ఆప్ ఎల్లప్పుడూ సామాన్యుల నుంచి వచ్చే చిన్న విరాళాల సహాయంతో ఎన్నికల్లో పోరాడిందని వెల్లడించారు. ఈ మేరకు ప్రజల నుంచి విరాళాన్ని కోరారు.
డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.దాంతో ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే జైశంకర్ అమెరికాకు వెళ్లనున్నారు.ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించింది. జైశంకర్ కేవలం ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే అమెరికాకు వెళ్లడంలేదని,ఈ సందర్భంగా అమెరికా నూతన పాలకవర్గంతో ఆయన చర్చలు జరుపుతారని అన్నారు.అదేవిధంగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో కూడా జైశంకర్ చర్చించే అవకాశం ఉందని చెప్పారు.
