Author: admin

కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కు మరింత వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం వందే భారత్, తేజస్, హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ వంటి ప్రీమియర్ ట్రైన్లలోనూ ఎల్టీసీ కింద ప్రయాణించవచ్చు. ఈమేరకు కేంద్రం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎల్టీసీ కింద ప్రయాణించే ఉద్యోగులు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లలో ట్రావెల్ చేయడానికి అనుమతి ఉంది. వందే భారత్ సహా ప్రీమియర్ ట్రైన్స్ లో ఈ పథకం వర్తించదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల నుండి వచ్చిన సూచనలు, విజ్ఞప్తుల పరిశీలించిన మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజా నిర్ణయం తీసుకుంది.

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభంకానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పలు సంక్షేమ పథకాలు, రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు తదితర విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More

అమెరికా ప్రముఖ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకుడు నాథ‌న్ అండర్సన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఈ మేరకు ఆయన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ‌ను మూసివేస్తున్న‌ట్లు తెలిపారు.నేను హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేయాల‌ని నిర్ణయం తీసుకున్నాను.మేము పని చేస్తున్న కొన్ని ప్రాజెక్టులు పూర్త‌యిన అనంతరం సంస్థ‌ మూసివేయబడుతుందని హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లోని ఓ నోట్‌లో నాథ‌న్ అండర్సన్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం వెనక ఎటువంటి భ‌యాలువ్యక్తిగత సమస్యలు,అనారోగ్య కార‌ణాలు ఏమీ లేవ‌ని ఆయ‌న‌ స్పష్టం చేశారు.అయితే హిండెన్‌బర్గ్ ను నాథ‌న్ అండర్సన్ 2017లో ప్రారంభించారు.అయితే హిండెన్‌బర్గ్ నివేదిక‌ల‌తో భార‌త్‌లోని అదానీ గ్రూప్ తీవ్రంగా ప్ర‌భావిత‌మైన సంగ‌తి తెలిసిందే.2022, 2024లో అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్ సంస్థ‌ విడుద‌ల చేసిన నివేదిక‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.

Read More

యుద్ధనౌకలు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ లను, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ మూడిటి చేరికతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని మోడీ తెలిపారు. గత పదేళ్లలో నౌకాదళంలోకి 33 యుద్ధనౌకలు, ఏడు జలాంతర్గాముల చేరాయని వివరించారు. ఈ మూడు కూడా భారత్ లోనే తయారుచేసినవేనని చెప్పారు. రక్షణ రంగంలో దేశం ఆత్మనిర్భర్ దిశగా కొనసాగుతోందని పేర్కొన్నారు దేశంలో తయారైన రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటినట్లు తెలిపారు . 100కుపైగా దేశాలకు రక్షణకు సంబంధించిన పరికరాలను భారత్ ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ నవీ ముంబయిలో ఇస్కాన్ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు.

Read More

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు కొత్త ఛైర్మన్ గా వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)కు డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన తన కెరీర్లో 26కు పైగా అవార్డులు సాధించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ప్రొపల్షన్ కమిటీ, అంతర్జాతీయ ఖగోళశాస్త్ర అకాడమీ, ఇండియన్ సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ సైన్స్ మొదలైన వాటిల్లో సభ్యులుగా ఉన్నారు. తాజాగా బాధ్యతలు అందుకున్న నారాయణన్ ను అభినందిస్తూ అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం వహించాల్సిన నారాయణన్.. ప్రధాని మోడీ దార్శనికతను సాకారం చేయాలని ఆకాంక్షించారు. Pic source:isro x

Read More

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక జట్టు ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన సెమీస్ లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో హార్యానాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా 50 ఓవర్లలో 237/9 పరుగులు చేసింది. అభిలాష్ శెట్టి (4/34), ప్రసిద్ధ కృష్ణ (2/40), శ్రేయస్ గోపాల్ (2/36)లు మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. అంకిత్ కుమార్ (48), హిమాన్షు రాణా (44) రాణించారు. అనంతరం ఓపెనర్ దేవత్ పడిక్కల్ (86; 113 8×4 1×6)తో పాటు స్మరణ్ (76; 94 3×4, 3×6) సత్తా చాటడంతో కర్ణాటక 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హర్యానా బౌలర్లలో నిశాంత్ సింధు (2/47) పర్వలేదనిపించాడు.

Read More

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ లో భారత స్టార్ షట్లర్ సింధు 21-14, 22-20తో చైనీస్ తైపీకి చెందిన యున్ సుంగ్ పై విజయం సాధించి శుభారంభం చేసింది. మరో మ్యాచ్లో అనుపమ ఉపాధ్యాయ 21-17, 21-18తో రక్షితశ్రీపై గెలిచింది. ఆకర్షి కశ్యప్ 17-21, 13-21తో థాయ్ ల్యాండ్ కు చెందిన పోర్న్ పావీ చేతిలో పరాజయం చెందింది. మాళవిక బాన్సోద్ 22-20, 16-21, 11- 21తో చైనాకు చెందిన యూ హాన్ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ లో హెచ్.ఎస్. ప్రణయ్ మొదటి రౌండ్ లో 21-16, 18-21, 12-21తో చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ చేతిలో ఓటమి చెందాడు. పురుషుల డబుల్స్ లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ముందంజ వేసింది. తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్ జోడీ 23-21, 19-21, 21-16తో…

Read More

‘డాకు మహారాజ్‌’లో బాలకృష్ణతో కలిసి ఆడిపాడారు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా.బాబీ దర్శకత్వం వహించిన ఈసినిమాలో వీరిద్దరిపై దబిడి దిబిడి అనే పాట చిత్రీకరించారు.ఇందులోని కొన్ని స్టెప్పులపై సినీ ప్రియుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.ఈ క్రమంలోనే నటి ఊర్వశీ స్పందించారు.ఒక సినిమా విజయం సాధించినప్పుడుదానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను.బాలకృష్ణ లెజెండ్‌.ఆయనతో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.ఇదంతా కళలో భాగం.బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం కేవలం పెర్ఫామెన్స్‌ కాదు..కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. ఆయనతో పనిచేయడం నా కల. ఈ సినిమాతో అది నెరవేరింది. ఆయన ఆర్టిస్టులకు ఎంతో సపోర్ట్‌ చేస్తారు’’ అని చెప్పారు.ప్రగ్యాజైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలైంది.ఘన విజయాన్ని అందుకుంది.

Read More

స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా డిసెంబర్ 31న రెండు శాటిలైట్ లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రెండు శాటిలైట్ ల డాకింగ్ పూర్తయింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని తెలిపింది. విజయవంతంగా స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించిందని వెల్లడించింది. మొత్తం బృందానికి భారతదేశానికి అభినందనలు! అంటూ ఇస్రో పేర్కొంది.

Read More

ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది.ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు.ఆయనపై కత్తితో దాడి చేశాడు.మూడుసార్లు పొడిచాడు.కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ.సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.ఈ సమాచారం అందిన వెంటనే బాలీవుడ్‌లో కలకలం మొదలైంది.అజయ్ దేవ్‌గణ్,షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు,దర్శకులు,టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తోన్నారు.

Read More