పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వం రూపొందుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.తాజాగా ఈ సినిమా నుండి సంక్రాంతి కానుకగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ అంటూ సాగే పాట ప్రోమోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈ పాటను స్వయంగా పవన్ పాడారు.తాజాగా విడుదలైన ప్రోమోలో వీరమల్లు మాట వినాలి…అంటూ పవన్ గొంతు అందరిలో జోష్ నింపుతోంది. ఈ పాటను ఈ నెల 6న విడుదల చేస్తామని గతంలో చిత్రబృందం ప్రకటించారు.అయితే వాయిదా పడింది.మళ్లీ ఇప్పుడు సాంగ్ ప్రోమోను విడుదల చేసి,పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడారు.ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది.ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు.…
Author: admin
భారత జట్టు యువ ఆల్ రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కాలినడకన కొండపైకి వెళ్లి, మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఐపీఎల్లో గతేడాది నితీశ్ రెడ్డి తన ఆల్ రౌండ్ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జట్టు లో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. సెంచరీ కూడా సాధించాడు. అటు బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు. Govinda Govinda 🙏🏻🙏🏻#nitishkumarreddy #Tirupati pic.twitter.com/Deu88pK9rX— Nitish Reddy (@NitishKReddy) January 14, 2025
భారత్ తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని సిద్ధం చేసింది. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ మార్క్-2 పరీక్షను విజయవంతంగా పూర్తిచేసింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ వేదికగా ఈ ప్రయోగం చేసింది. ఇది థర్డ్ జనరేషన్ ‘ఫైర్ అండ్ ఫొర్గెట్ మిస్సైల్. టార్గెట్ అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి మినిమం, మ్యాగ్జిమమ్ రేంజ్ నిర్ధారణ అయిందని వివరించారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్-2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైందని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.
మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తెలుగు వారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షించారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగినదని అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో పలు సాంస్కృతిక పూజా కార్యక్రమాలలో కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ భారత్ లో ఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం విశేషంగా అలరించింది. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఇతర అతిథులు, అభిమానులు కార్యక్రమాన్ని తిలకించారు. పురుషుల విభాగంలో 20 జట్లు, మహిళల విభాగంలో 19 జట్లు పోటీపడుతున్నాయి. భారత పురుషుల జట్టు విజయంతో టోర్నీని ఆరంభించింది. తాజాగా జరిగిన తన తొలి మ్యాచ్ (గ్రూప్-ఎ)లో 42-37తో నేపాల్ పై విజయం సాధించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్టార్ షట్లర్ సింధు తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా… ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతిని,పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతిలోనూ,వ్యవసాయ సంప్రదాయాలలోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి, పొంగల్ పండుగల శుభాకాంక్షలు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండో రౌండ్ లోకి ప్రవేశించాడు. తాజాగా జరిగిన మొదటి గేమ్ లో 4-6, 6-3, 6-4, 6-2 తో అమెరికా ఆటగాడు నిశేష్ రెడ్డిపై గెలుపొందాడు. మరోవైపు 2023 ఫైనలిస్ట్ గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్ మొదటి రౌండ్ లోనే పరాజయం చెందాడు. అమెరికాకు చెందిన మిచెల్సన్ 7-5, 6-3, 2-6, 6-4 తో ఓటమి చెందాడు. ఆస్ట్రేలియాకు చెందిన కిర్గియోస్ 6-7 (3-7), 3-6, 6-7 (2-7)తో బ్రిటన్ కు చెందిన ఫెర్న్ చేతిలో ఓడాడు. పసారో (ఇటలీ)తో 5-7, 1-2తో ఉన్న దశలో పదవ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) గాయం కారణంగా రిటైరయ్యాడు. మహిళల సింగిల్స్ లో రెండో సీడ్ సై (పోలెండ్) శుభారంభం చేసింది. మొదటి రౌండ్లో ఆమె 6-3, 6-4తో సినియాకోవా (చెక్) పై నెగ్గింది.
పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం, ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్యరాసులను లోగిళ్లకు మోసుకువచ్చే ఈ సంక్రాంతి పండుగ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలనీ ఆకాంక్షించారు. రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సరదాల సక్రాంతి. అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయని ఇది ప్రజలకు ఈ పండుగపై ఉన్న మక్కువను తెలియచేస్తుందని పేర్కొన్నారు . ఉపాధికోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి.. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో ఆద్యంతం సూచీలు నష్టాల బాటలో పయనించాయి. కొన్ని కీలక షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఇక ఈ సెషన్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,048 పాయింట్లు నష్టపోయి 76,330 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 23,085 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.71గా కొనసాగుతోంది. టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్.యూ.ఎల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగాయి.
జమ్మూకశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించి తను హామీ ఇచ్చినట్లుగానే ప్రధాని మోడీ మాటనిలబెట్టుకున్నారని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మూడోసారి ప్రధానిగా ఆయన అధికారం లోకి వచ్చిన తర్వాత శ్రీనగర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పుడు కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు. అన్నట్లుగానే నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. దాని వలనే నేడు తాను సీఎం పదవిలో ఉన్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని తమ బాధ్యత నిర్వర్తించారని ఎక్కడా రిగ్గింగ్, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు లేవని చెప్పారు. ఇక జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని ఇచ్చిన హామీని ప్రధాని త్వరలో నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కృషితో సరిహద్దుల్లో శాంతిభద్రతలు కొలిక్కి…
