కెరీర్ పరంగా ఇటీవల రజనీకాంత్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది.ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుంది.తాజాగా సంక్రాంతికి కానుకగా `జైలర్ 2`ని ప్రకటించారు.సన్ పిక్చర్స్ సంస్థ పొంగల్ పండుగ సందర్భంగా జైలర్ 2 సినిమా పై అధికారిక ప్రకటన విడుదల చేసింది.అనిరుధ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరూ ఫెంగ్ తుఫాను గురించి మాట్లాడుకుంటున్నారు.అప్పుడు నెల్సన్‌ను చెన్నైకి తిరిగి వెళ్దామా అని అనిరుధ్ అడగగా,తుఫాను చెన్నైలోనే ఉంది.అందుకే కథ గురించి చర్చించడానికి మిమ్మల్ని గోవాకు తీసుకొచ్చాను అని నెల్సన్ అంటాడు.నా సినిమా వచ్చాక 5 తుఫానులు వచ్చిపోయాయి.మీరు వారానికో సినిమా విడుదల చేస్తున్నారు.అకస్మాత్తుగా ఇంటికి కిటికీలన్నీ పగలగొట్టుకుని రౌడీలు వచ్చి పడుతున్నారు’ అని అనిరుధ్ అంటాడు.నెల్సన్, అనిరుధ్ ఇద్దరూ భయంతో కేకలు వేస్తూ లేస్తారు.రజినీకాంత్ కత్తితో ఇంట్లోకి రావడంతో,నెల్సన్,అనిరుధ్ ఇద్దరూ బెడ్ షీట్ కప్పుకుంటారు. https://youtu.be/PmPoS5oyuBw?si=wKiI-fmyF-wG-pbe
Author: admin
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే.అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు.మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపడం..సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు…తాజాగా సైఫ్ పై దాడి నేపథ్యంలో సామాన్యులకు ముంబయి సేఫ్ కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు.సైఫ్ పై దాడి గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమే కానీ ఈ విషయం వలన ముంబయిను సురక్షితం కాదని అనడం తప్పు.దేశంలోని అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది వాస్తవమే.వీటిని నిరోధించడానికి అలాగే భద్రతా చర్యలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు.దర్యాప్తు కొనసాగుతోందని ఫడణవీస్…
గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేఛ్చ కూడా లేని పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రానికి రావాలన్నా నాటి ప్రభుత్వ విధానాలకు భయపడే పరిస్థితి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన వారిని, నాడు తరిమేసిన చరిత్ర కూడా చూసామని అన్నారు. సచివాలయంలో ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర వృద్ధిరేటుపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రూ.2.68లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి రూ.58.14 లక్షలు అవుతుందన్నారు. ఏపీకి పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని దుయ్యబట్టారు. సంపద సృష్టించి ప్రజల ఆదాయం పెంచుతామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి జరిగి సంపద పెరిగి ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. దీంతో పథకాల ద్వారా పేదరికాన్ని…
భారత్‌లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ప్రభుత్వం ఓడిపోయిందంటూ తమ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా ఇండియా క్షమాపణ తెలిపింది.అది అనుకోకుండా జరిగిన పొరపాటని పేర్కొంది.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ…2024లో జరిగిన ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో సిట్టింగ్ ప్రభుత్వాలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. ‘‘అది ద్రవ్యోల్బణం వల్ల కావొచ్చు. లేదా కొవిడ్‌ను ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాల వల్ల కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించింది’’ అని పేర్కొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా పలు దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు.…
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆద్యంతం అదే జోరును కనబరిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 77,042 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 23,311 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61గా కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్.బీ.ఐ, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం మరో తీపి కబురు అందించింది. 8వ వేతన సంఘం(పే కమిషన్ ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1 నుండి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు పేమెంట్లు పెరగనున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఇక శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో ఈ మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నారు.శ్రీహరికోటలో ఇస్రో తదుపరి తరం ప్రయోగాల కోసం, స్టాండ్‌బై లాంచ్ ప్యాడ్‌గా,భవిష్యత్ భారతీయ మానవ అంతరిక్ష యాత్రల కోసం ప్రయోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు.తనతో పాటు తన భార్య మౌనికపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు.శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని పోలీసులు ఆయనకు సూచించారు.
అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు ఇంకా ఆగలేదు.తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై నటి ప్రియాంకా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.మంటలకు ఆహుతైన భవనాలను,అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ…మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘హృదయం భారంగా ఉంది.నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను.ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను.స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు.ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం.ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు.మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక పేర్కొన్నారు.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇండియన్2’.దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇకపై తన ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే ఉంటుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.మరో ఆరు నెలల్లో ‘ఇండియన్ 3’ పనులు పూర్తి అవుతాయి.ఆ సినిమాకు సంబంధించిన భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి.కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది’’ అని శంకర్ తెలిపారు. 1996లో విడుదలైన ‘భారతీయుడు’కు సీక్వెల్స్‌గా రెండు, మూడు భాగాలు తెరకెక్కాయి.రెండో పార్ట్‌లో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ఎస్‌జే సూర్య,బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.సమాజంలోని అవినీతి, అన్యాయాల్ని రూపుమాపడానికి సేనాపతి ఏం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.మేకింగ్‌పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉన్నందున అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడంపై పలువురు సినీ నటులు స్పందించారు.సైఫ్ త్వరితగతిన కోలుకోవాలని కోరుకున్నారు. సినీ నటులు చిరంజీవి,ఎన్టీఆర్ స్పందించారు.విషయం తెలిసి తాము షాకయ్యానని అన్నారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది.ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పోస్ట్ పెట్టారు.సైఫ్ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా.ఇది నిజంగా బాధాకరం.ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
