ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికల బరిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం నేతృత్వంలోని అజిత్ పవార్ ఎన్సీపీ నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 25-30 స్థానాలలో ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేయనుంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎన్సీపీ బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Author: admin
అమెరికా అధ్యక్షుడిగా ఈనెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఆయన రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నారు. 47 వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా క్యాపిటల్ భవనం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి భారత్ తరపున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన కొత్త ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వెంకటేశ్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీశ్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కోసం వెంకీ ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే పాట ఆలపించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం జరిగిన మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో అదే పాటను ఆయన లైవ్‌లో పాడారు. స్టేజ్‌పై స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులు అర్పించారు. “శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది” అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న యువతీ యువకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
నటి రష్మిక ఇటీవల జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే.తాజాగా ఆమె తన గాయం గురించి తెలియజేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.నూతన సంవత్సర శుభాకాంక్షలు! నేను ఎంతో పవిత్రంగా భావించే జిమ్‌లో గాయపడ్డాను.పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి.త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నా.ఈ ఆలస్యానికి క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా.నా కాలు ఏమాత్రం సెట్ అయినా వెంటనే షూట్‌లో భాగం అవుతా’’ అని ఆమె పేర్కొన్నారు.ఈ గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకే తెలియదని రాసుకొచ్చారు.
కేరళలోని శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనుంది.పథనంథిట్ట, కొల్లం, అలప్పుజ,ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇందుకు గాను యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది ప్రకటించింది.
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటక, మహారాష్ట్ర జట్లు సెమీఫైనల్ చేరాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో కర్ణాటక బరోడా పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో క్వార్టర్స్ లో మహారాష్ట్ర పంజాబ్ పై 70 పరుగుల తేడాతో గెలిచింది. సెమీ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఓటమి మలేషియా సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీ ఫైనల్ లో ఓటమితో ఇంటిముఖం పెట్టారు. డబుల్స్ విభాగంలో సెమీస్ లో ఈ జోడీ కొరియాకు చెందిన కిమ్ వాన్-సియో సెంగ్ చేతిలో ఓడింది. నేటి నుండి మహిళల హాకీ లీగ్: మహిళల హాకీని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేటి నుండి ఉమెన్స్ హకీ ఇండియన్ లీగ్ (డబ్ల్యూ.హెచ్.ఐ.ఎల్) ప్రారంభం కానుంది. రెండు వారాలు జరిగే ఈ టోర్నీలో నాలుగు ఫ్రాంచైజీ లు తలపడనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ. 6,700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం నిర్ణయంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హార్షం వ్యక్తం చేశారు. కంసమామ మోసం చేసి పోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి గారు ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు. గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని తాను విద్యా శాఖా మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. దశల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు…
సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్ధికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ. 6,700 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా కూడా వారికి మేలు చేయాలనేదే ఈ ప్రయత్నం. నిధుల విడుదలకు నేడు తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషాన్ని తెస్తుందని అన్నారు. పండుగ పూట వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తినిస్తుందన్నారు. ప్రతి వర్గానికి మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని, ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తామని తెలుపుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ నేతృత్వంలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను స్వయంగా నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కొన్నింటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకున్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయగా… కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే 3750 కిలో మీటర్ల సీసీ రోడ్లు వేసినట్లు వివరించారు. అదే విధంగా మినీ గోకులాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 268 కాగా కూటమి ప్రభుత్వంలో 22500 అని పేర్కొన్నారు. పీవీటీజీ హ్యాబిటేషన్స్ గత వైసీపీ ప్రభుత్వలో 91 కోట్ల రూపాయలుగా ఉండగా ఎన్డీయే కూటమి పాలనలో రూ750 కోట్లు అని తెలిపారు. In NDA Govt under the leadership of Hon. PM…
