మహారాష్ట్రలోని 3 గ్రామాల్లోని ప్రజల జుట్టు రాలిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది.వివరాల్లోకి వెళ్తే వారంలోనే వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టతల వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ తాలూకాలోని బోండ్‌గావ్, కలవాడ్,హింగానా గ్రామాల్లో దాదాపు 50 మంది జుట్టు విపరీతంగా ఊడిపోయింది.అయితే చాలామందికి ముందుగా తలపై విపరీతంగా దురద రావడం…ఆపై రెండోరోజు నుండి వెంట్రుకలు కుప్పలుగా రాలిపోవడం ప్రారంభమై వారంలోనే బట్టతల వచ్చింది అని తెలుస్తుంది.ఈ గ్రామాల్లో నివశించే పురుషులతో పాటు మహిళలకు కూడా ఈ సమస్య ఎదురురైంది అని సమాచారం. ఈ మేరకు బాధితులు హాస్పటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.అయితే వైద్యులకు కూడా ఒకేసారి ఇలా అసాధారణంగా జుట్టు ఊడిపోవడానికి కారణం అంతుబట్టడం లేదు.దీనితో గ్రామస్తుల నుండి వెంట్రుకలు,చర్మ నమూనాలను వైద్యశాఖ సేకరించింది.అయితే కలుషిత నీరే ఈ సమస్యకు కారణమని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.నీళ్లలో పురుగుమందులు కలవడం వలన ఇలా జరిగినట్లు భావిస్తున్నారు.అధికారులు ఈ గ్రామాల్లో నీటి…
Author: admin
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 2024 ఆగస్టులో జరిగిన రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో స్వదేశాన్ని వీడి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో మరణించిన వారి వారసులకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరుద్యోగులు నిరసనలు చేశారు. బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలలో 2024 జులై, ఆగస్టు నెలల్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు కట్టడి చేయలేక ప్రధాని షేక్ హసీనా దేశం…
ఓ నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి పోలీసులు పక్క రాష్ట్రంలోకి వెళ్లి అక్కడి స్థానికులకు బందీలుగా మారారు.అయితే ఈ ఘటన 7 తేదీ రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఓ నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టిన అస్సాం పోలీసులకు చెందిన 16 మంది సభ్యుల బృందం గూగుల్ మ్యాప్స్ చూపించిన మార్గంలో ప్రయాణించి చివరకు నాగాలాండ్‌లో తేలింది.అది అస్సాంలోని తేయాకు తోటగా గూగుల్ మ్యాప్స్ చూపించిందని,వాస్తవానికి అది నాగాలాండ్‌గా తేలిందని అస్సాం పోలీసుకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే పోలీసుల దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు దుండగులుగా అనుమానించి బంధించారని అధికారి తెలిపారు.పైగా వీరిలో ముగ్గురు మాత్రమే యూనిఫాంలో ఉండగా మిగిలిన వారంతా సివిల్ డ్రెస్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు.స్థానికుల దాడిలో తమ బృందం సభ్యుడు ఒకరికి గాయమైందని అధికారి చెప్పారు.ఈ మేరకు సమాచారం అందుకున్న జోర్హాట్ ఎస్‌పీ అస్సాం పోలీసులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు.అస్సాం…
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు ఉనికి మనకు గర్వకారణమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.అయితే అందరూ సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదిలంగా చేర్చాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరయ్యారు. తెలుగు భాషా ప్రేమికులందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. మన భాషను మనం పరిరక్షించుకోకపోతే చాలా విజ్ఞాన సంపదను కోల్పోతామని వివరించారు. తెలుగులో పదాలున్నప్పుడు వాటినే ఉపయోగించడం విధిగా పెట్టుకోవాలని ఆంగ్లభాషా వ్యామోహంతో మనం అమ్మభాషలోని చాలా పదాలను పలకడం లేదని అన్నారు. వాటి బదులు ఇంగ్లిష్ పదాలు విరివిగా వాడేస్తున్నాం. ఇలా అయితే చాలా పదాలు కనుమరుగవుతాయని వాటితో పాటే తరతరాలుగా మన పెద్దలు సాధించి పెట్టిన విజ్ఞానం కూడా కనుమరుగవుతుందని వివరించారు. ప్రభుత్వాలు తెలుగు భాషా ఉత్సవాలు, తెలుగువారి సాంస్కృతిక వైభవ చిహ్నమైన కూచిపూడి నృత్యోత్సవాలు, త్యాగయ్య, క్షేత్రయ,…
లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ తో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.ప్రస్తుతం ఆయన రజనీ కాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన్ని అజిత్ తో సినిమా ఎప్పుడు ఉంటుందని అడిగారు.దీనిపై ఆయన స్పందిస్తూ…అందరి మాదిరి గానే ఆయనతో సినిమా చేయాలని ఉంది.ఆ రోజు కోసం ఎదురుస్తున్నానని చెప్పారు.
వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూబీ) మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వెయిట్ కేటగిరిలను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రారంభమైన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 10 బరువు విభాగాలతో పోటీలు నిర్వహిస్తోంది. గతంలో 13 విభాగాలు ఉండగా వాటిని 10 విభాగాలకు కుదించారు. పురుషుల విభాగంలో 50కేజీలు-ఫ్లై వెయిట్, 55 కేజీలు-బాంటమ్ వెయిట్, 60 కేజీలు -లైట్ వెయిట్, 65 కేజీలు- వెల్టర్ వెయిట్, 70 కేజీలు-లైట్ మిడిల్ వెయిట్, 75 కేజీలు-మిడిల్ వెయిట్, 80కేజీలు- లైట్ హెవీ వెయిట్, 85 కేజీలు-క్రూజర్ వెయిట్, 90 కేజీలు- హెవీ వెయిట్, 90+ కేజీలు-సూపర్ హెవీ వెయిట్. మహిళల విభాగంలో 48 కేజీలు, 51 కేజీలు, 54 కేజీలు, 57 కేజీలు, 60 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 75 కేజీలు, 80 కేజీలు, 81+ కేజీలు విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి.
మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో డబుల్స్ లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-10, 16-21, 21-5తో చైనీస్ తైపీ కి చెందిన మింగ్ చి లు, కైవి టాంగ్ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో 21-12, 17-21, 21-15తో కెనడాకు చెందిన బ్రయాన్ యాంగ్ పై గెలిచి ప్రి క్వార్టర్స్ చేరాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ మలేషియాకు చెందిన జిన్ వీ పై 21-15, 21-16తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్ చేరింది. ప్రియాన్షు రజావత్ చైనా క్రీడాకారుడు షై ఫెంగ్ చేతిలో 11-21, 16-21తో పరాజయం చెందాడు.
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. రేపు ఉదయం 5 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం ఈరోజు సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. తోపులాట…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి, పత్రికా ప్రకటన చేసింది.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించలేదు. దీనిపై బోర్డు ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని పేర్కొంది. ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యా సంవత్సరం 2025-26 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డ్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కొన్ని మీడియాలో నివేదించబడింది. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీని ద్వారా స్పష్టం చేయబడింది. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) ప్రతిపాదిత విద్యా సంస్కరణలను ప్రజల అభిప్రాయాలు మరియు సూచనలు కోసం బహిరంగంగా ఉంచింది. వీటిని bie.ap.gov.in పోర్టల్లో చూడవచ్చు. మీ సూచనలను మరియు అభిప్రాయాలను 26 జనవరి 2025లోగా biereforms@gmail.com అనే ఇమెయిల్ ఐడికి పంపించవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “రెట్రో”.సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన భార్య జ్యోతికతో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు.ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమా విడుదల డేట్ ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది.మే 1 తేదిన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తుంది.యాక్షన్,ప్రేమ, గాఢమైన భావోద్వేగాల మేళవింపుగా రూపొందుతున్న కథ.గ్యాంగ్ స్టార్ పాత్రలో సూర్య కనిపించనున్నారని సమాచారం.కథానాయకుడు తాను ప్రయాణం చేస్తున్న హింస మార్గం నుండి బయటకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తన ప్రేయసికి చెప్పే సన్నివేశాలు ఇటీవల విడుదలైన టీజర్లో కనిపించాయి.జయరామ్,కరుణాకరన్,జోజు జార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
