నట సింహం నందమూరి బాలకృష్ణ కథానయకుడిగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’.ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.రేపు సాయంత్రం అనంతపురంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ దీనికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం.
Author: admin
ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని చేతులు మీదుగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. విశాఖ ప్రజల చిరకాల కోరిక, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. విశాఖపట్నం వేదికగా ఏపీ వ్యాప్తంగా జరుగనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో 93శాతం స్ట్రెక్ రేట్, 57 శాతం ఓట్లతో గెలిచాం. భవిష్యత్‌లోనూ ఈ కాంబినేషన్ ఏపీలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ అని ఆయన నాయకత్వంలో దేశం దూసుకుపోతుందన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలవనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్చువల్‌గా రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. విశాఖ రైల్వేజోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్‌పార్క్, తిరుపతి…
విశాఖ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బలమైన భారత్ కోసం,ఒక ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ ఆ దారిలో ఎదుర్కున్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతీ అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దెలా నడిపిస్తున్నారని ప్రధాని మోడీ పై ప్రశంసలు కురిపించారు.నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న దార్శనికుడని సీఎం చంద్రబాబుని కొనియాడారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారని అలా నిలబడినందుకే ఈ రోజున మన ప్రధాని మోడీ సారధ్యంలో 2 లక్షల కోట్ల విలువైన ఈ…
విశాఖపట్నం లోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారని రాష్ట్ర ప్రజల తరుపున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు గారు నెరవేర్చుతున్నారని వివరించారు. ఒకేసారి వెయ్యి పెన్షన్ పెంచారు, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు, దీపం పధకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నారని అలాగే త్వరలోనే మిగతా హామీలు కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయిందని అన్నారు. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తుందని వెంటిలేటర్ పై ఉన్న…
జగన్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ 7 నెలల్లో ఏ ఏ పథకాలు వచ్చేయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందనీ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నేడు సమావేశం నిర్వహించారు. ఈ సంక్రాంతికి అన్నదాతలకి రైతు భరోసా, చిరు వ్యాపారులకి జగనన్న తోడు, అక్క చెల్లెమ్మలకి ఆసరా వచ్చి ఉండేదని పేర్కొన్నారు. తమ హాయాంలో మేనిఫెస్టోను చెప్పినట్లుగా చేసి చూపించామని తెలిపారు. నాయకుడు అనే వాడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ముఖ్యమని పేర్కొన్నారు.చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయని ఆక్షేపించారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వం అక్రమాల్ని గ్రామస్థాయి నుంచే ప్రశ్నిస్తూ.. నిలదీయాలని సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకీ గొప్పగా చూసుకునే బాధ్యత తీసుకుంటామని జగన్ భరోసానిచ్చారు.
మలయాళ నటి హనీరోజ్ ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.సోషల్‌మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నానని అన్నారు.ఈ కేసులో విచారణ చేపట్టిన ఎర్నాకుళం పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో కీలకంగా భావించే కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తాజాగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసు గురించి విచారిస్తున్నారు. దీనిపై హనీరోజ్ స్పందించారు. ‘‘ఈరోజు నాకెంతో ప్రశాంతంగా ఉంది.ఈ కేసు గురించి ఇటీవల ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్లా…బాధ్యులను ఆయన కఠినంగా శిక్షించేలా చూస్తానని మాటిచ్చారు’’ అని ఆమె తెలిపారు.
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు.బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ‘‘విద్యార్థినిపై అత్యాచార ఘటనలో నిందితుడు డీఎంకే మద్దతుదారుడే.కానీ పార్టీలో సభ్యుడు కాదు.అతడికి మేము ఎలాంటి రక్షణ కల్పించడం లేదు.మహిళల భద్రతే మా ప్రభుత్వానికి ముఖ్యం.ఈ ఘటనపై కేసు నమోదైన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.ఈ ఘటనతో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్టాలిన్ స్పష్టం ఇచ్చారు.బాధితులకు న్యాయం చేయాలని గత కొన్ని రోజులుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్ప స్వామి స్టాలిన్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడు.ఎట్టకేలకు ఈరోజు ఈ అంశంపై తమిళనాడు సీఏం ఈ అంశంపై స్పందించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు అనంతరం కొద్దిగా పుంజుకుని ఫ్లాట్ గా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టపోయి 78,148 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 23,688 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.88గా కొనసాగుతోంది. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకి, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో పయనించాయి.
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అని జగన్ ప్రశ్నించారు.నెట్‌వర్క్ హాస్పిటల్స్ కు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆక్షేపించారు . ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా? అని పేర్కొన్నారు. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబుగారు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు…
విశాఖపట్నంలోని చిల్డ్రన్స్ ఎరినా వేదికగా నిర్వహిస్తున్న డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రానున్న 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెరిగేలా పని చేస్తున్నట్లు ఈసందర్భంగా లోకేష్ తెలిపారు. ఇది సాధించి ఈ దేశం ముందు నిలబడతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రతి జిల్లాని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ISB తెచ్చిన మోడల్ లోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ తెస్తున్నట్లు వెల్లడించారు. ఇక నేడు ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ కు రానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన రాకతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఏపీ రైల్వే జోన్ కల నెరవేరనుందని టీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
