Author: admin

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో కొత్త సంస్కరణలు తెచ్చింది.ఈ మేరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసింది.అయితే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఇక నుండి కేవలం ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది.చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని,జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. కాగా సైన్స్,ఆర్ట్స్,భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని ఆయన చెప్పారు.ఈ మేరకు 2025-26 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‍సీఈఆర్‍టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని,నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు సులభమవుతుందని శుక్లా పేర్కొన్నారు.ఈ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తున్నామని స్పష్టం చేశారు.ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు.విద్యార్థులు,తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26లోగా సంస్కరణలపై సలహాలు,సూచనలు…

Read More

భారత్ పోల్ పోర్టల్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశంలో భారీస్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడి, ఇక్కడి దర్యాప్తు సంస్థల నుండి తప్పించుకుని ఇతర దేశాలకు పారిపోయే వారిని కట్టడి చేసేందుకు ఇది దోహదం చేయనుంది. విదేశాలకు మకాం మార్చిన నేరస్తులను దర్యాప్తు సంస్థలు భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు ‘భారత్ పోల్’ విభాగం తగిన చర్యలు తీసుకోనుంది. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ‘భారత్ పోల్’ ను తీసుకొచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఇంటర్ పోల్ తో భారత్ తరపున సీబీఐ మాత్రమే సమన్వయం చేసుకునేదని, ఇకపై భారత్ పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్ పోల్ తో సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకు గానూ మూడు నేర చట్టాలపై రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను…

Read More

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’.ఇందులో కియారా అడ్వాణీ,అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు దీనిని నిర్మించారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది.ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కొండ దేవర’ పాట విడుదల చేసింది. సినిమాలో ఈపాట కీలకంగా ఉండనుంది.కాసర్ల శ్యామ్‌ దీనికి లిరిక్స్‌ అందించగా.. తమన్‌, శ్రావణ భార్గవి ఆలపించారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. https://youtu.be/lddZ_gUBbfQ?si=rynHqld6EENNnTXf

Read More

ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటిగా ఆయన తెలిపారు.జనాభా తగ్గుదలకు సంబంధించి టెస్లా ఓనర్స్‌ సిలికాన్‌ వ్యాలీ ఎక్స్‌ వేదికగా ఓ గ్రాఫ్‌ను పోస్టు చేసింది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌,చైనా సహా నైజీరియా,అమెరికా,ఇండోనేషియా,పాకిస్థాన్‌ వంటి కీలక దేశాల్లో 2018 నుంచి 2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయనే దాన్ని ఈ గ్రాఫ్‌లో తెలియజేశారు.ముఖ్యంగా భారత్,చైనా దేశాల్లో 2100 నాటికి జనాభా క్షీణత తీవ్రంగా ఉంటుందని అందులో పేర్కొన్నారు.‘జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు’ అని రాసుకొచ్చింది.ఈ ట్వీట్‌ను రీపోస్ట్‌ చేసిన మస్క్‌ ‘అవును’ అని తెలిపారు.

Read More

పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 10 వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. టికెట్లు,టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట అని స్పష్టం చేశారు. సీఎం అదేశాల‌ ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు… ఆపలేరని అన్నారు.…

Read More

ఆంధ్రప్రదేశ్ లో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఉద్దేశించి ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని ఆక్షేపించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఢిల్లీని తలదన్నే రాజధాని, పారిశ్రామిక కారిడార్లు…

Read More

ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ వేదికగా గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఈ ఈవెంట్ లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రాతో పాటు అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. ఇక 2027 రిలేస్, 2028 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్, 2029 ప్రపంచ ఛాంపియన్ షిప్ లకు బిడ్ లు మొదలయ్యాయని ఈ టోర్నీల నిర్వాహణకు భారత్ తన ఆసక్తిని తెలియజేసిందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుపరివాలా తెలిపారు. ఇక ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా మాజీ షాట్ పుట్ ఆటగాడు బహాదూర్ సింగ్ ఎంపికయ్యాడు. 2002 ఆసియా క్రీడల్లో ఆయన స్వర్ణం సాధించాడు. 51 ఏళ్ల బహాదూర్ సింగ్ 2029 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. ఇక ఈ ఏడాది ఆగస్టు 10న ప్రారంభంకానున్న ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీలు భారత్ లో జరుగనున్నాయి.

Read More

సంధ్య థియేటర్‌ ఘటనపై నటి నిహారిక తొలిసారి స్పందించారు.ఇలాంటి ఘటనను ఎవరూ ఊహించరని అన్నారు.విషయం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు.అందరి ప్రేమాభిమానాలు,సపోర్ట్‌ వల్ల అల్లు అర్జున్‌ ఇప్పుడిప్పుడే దాని గురించి కోలుకుంటున్నారని తెలిపారు.ఆమె తాజాగా నటించిన ‘మద్రాస్‌ కారన్‌’ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో విషయాన్ని తెలిపారు.చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత నిహారిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మద్రాస్‌ కారన్‌’.ఇందులో షాన్‌ నిగమ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.జనవరి 10న ఇది విడుదల కానుంది. https://youtu.be/l7n7o6UXxi8?si=O6yvtqRRLcyhHb1N

Read More

ఈనెల 14న ఢిల్లీ లో ప్రారంభంకానున్న ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీ.వీ.సింధు, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్ ఛాంపియన్లు సహా అగ్రశ్రేణి క్రీడాకారులు ఇండియా ఓపెన్ బరిలో దిగుతున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. భారత్ నుండి ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, సాయి ప్రతీక్-పృథ్వీ, మహిళల డబుల్స్ లో అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో, గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ, రుతుపర్ణ పాండా-శ్వేత పర్ణ పాండా, అశ్విని భట్, శిఖా గౌతమ్, మానస రావత్-గాయత్రీ రావత్, సాక్షి గహ్లావత్- అపూర్వ గహ్లావత్, సానియా సికందర్- రష్మి గణేశ్, మృణ్మయీ దేశ్ పాండే- ప్రేరణ ఆల్వేకర్, ఇక మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో, సతీశ్కుమార్- ఆద్య వరియత్, రోహన్ కపూర్- రుత్విక శివాని, ఆషిత్ సూర్య- అమృత ప్రముతేష్ తదితర భారత షట్లర్లు బరిలోకి దిగనున్నారు.

Read More

హీరో విశాల్‌ ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.‘విశాల్‌కు డిల్లీలో ఉన్నప్పుడే ఫీవర్ వచ్చింది.ఆ విషయం ఎవరికీ తెలియదు.కానీ ‘మదగజరాజ’ సినిమా 11 ఏళ్ల తర్వాత విడుదల అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌కు వచ్చారు.ఆ రోజు విశాల్‌ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు.జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగాను.11 ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకువస్తోంది.దీనికి కచ్చితంగా రావాలనుకున్నాను’ అని చెప్పారు.103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు.ఆ ఈవెంట్‌ పూర్తికాగానే మేం విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు కోలుకుంటున్నారు.ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు.కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్‌ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు.సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారు.‘మదగజరాజ’ కోసం విశాల్‌ ఎంతో కష్టపడ్డాడు’ అని తెలిపారు.మదగజ రాజ చిత్రానికి ఖుష్బూ భర్త సుందర్‌.సి దర్శకత్వం వహించారు.దాదాపు 12 క్రితమే దీనిని రూపొందించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది.

Read More