Author: admin

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా విషయంలో టీమ్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో ట్రెండ్ సృష్టించిన ‘నానా హైరానా’ పాటను కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు టీమ్ వెల్లడించింది.జనవరి 14 నుంచి దీనిని అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పింది.ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ దీనిని ఆలపించారు. తొలిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్ గా ‘నానా హైరానా’ రికార్డు సృష్టించింది.న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను షూట్ చేశారు.సంగీత దర్శకుడు తమన్ వైవిధ్యభరితంగా ఉండేలా ఈ మెలోడీ సాంగ్ ను స్వర పరచగా, మనీశ్ మల్హోత్ర ఈ పాటకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.6 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు.

Read More

ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే జీఎస్టీ పై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంటే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచేయడం అని ఆరోపించారు. రానున్న బడ్జెట్లో దీనికి అంతం పలకాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జీఎస్టీ లో పేర్కొన్న 9 రకాల ట్యాక్స్ లు తేలికచేయడానికి బదులు అసంబద్ధంగా సంక్లిష్టంగా మారుస్తున్నాయని ఆరోపించారు. GST అనేది ప్రజల వినియోగంపై పన్ను, కానీ మోడీ ప్రభుత్వం రికార్డ్ జీఎస్టీ కలెక్షన్స్ ద్వారా వారి గాయాలపై ఉప్పు చల్లే పని చేస్తుందని దుయ్యబట్టారు.మొత్తం GSTలో 2/3వ వంతు అంటే 64% పేద మరియు మధ్యతరగతి ప్రజల జేబుల నుండి వస్తుంది, అయితే కేవలం 3% GST బిలియనీర్ల నుండి వసూలు చేయబడుతుంది, అయితే కార్పొరేట్…

Read More

భారత పేస్ బౌలర్ బుమ్రాపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు తదుపరి కెప్టెన్ కావొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యుత్తమంగా రాణించి తన ప్రతిభను చాటుకున్న బుమ్రా రోహిత్ స్థానంలో తర్వాతి సారధి కావొచ్చు అని పేర్కొన్నారు. అతను జట్టును ముందుండి నడిపిస్తాడని బుమ్రా గురించి మంచి అభిప్రాయం ఉందని పేర్కొన్నారు. కొందరు కెప్టెన్ లు ఆటగాళ్ల పై ఒత్తిడి చేస్తారని అయితే బుమ్రా ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా తమ పని చేసేలా చూస్తాడని అది ఆటగాళ్లకు ఒత్తిడి కలిగించదని అన్నారు. ఫాస్ట్ బౌలర్ల నుండి బుమ్రా అద్భుతమైన ఫలితాలను రాబడుతున్నాడని అన్నారు.

Read More

ఆస్ట్రేలియా రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. జనవరి 29, ఫిబ్రవరి 6న రెండు టెస్టు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సిరీస్ కోసం జట్టును తాజాగా ఆస్ట్రేలియా సెలెక్టర్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తప్పుకోవడంతో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ,జోష్ ఇంగ్లిస్, కూపర్ కానోలీ, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్టాస్, మ్యాట్ కునెమన్, నాథన్ లైయన్, నాథన్ మెక్స్వినీ, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబర్.

Read More

మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో డబుల్స్ లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్ లో గెలిచి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-15, 21-15తో మలేషియాకి చెందిన నూర్ మహ్మద్, వీ కియోంగ్ టాన్ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ ప్రణయ్ 8-21, 21-15, 21-23 తో చైనాకు చెందిన షై యుకి చేతిలో ఓటమి చెందాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో మాళవిక బాన్సోద్ 18-21, 11-21తో చైనా క్రీడాకారిణి యూ హాన్ చేతిలో పరాజయం పాలైంది. మహీళల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ లో గాయత్రీ-ట్రీసా జోడీ చైనాకు చెందిన ఫాన్ జియా- షియాన్ జాంగ్ జోడీ చేతిలో 21-15, 18-21, 19-21తో ఓటమి చెందింది. మిక్సెడ్ డబుల్స్ లో ధ్రువ్…

Read More

ప్రపంచంలోని సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 420 బిలియన్ డాలర్లకుపైగా సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచారు. మొదటి స్థానం: ఎలాన్ మస్క్ -టెస్లా, స్పేస్ ఎక్స్ (421 బిలియన్ డాలర్లు). రెండవ స్థానం:జెఫ్ బెజోస్ – అమెజాన్ వ్యవస్థాపకుడు (233.5 బిలియన్ డాలర్లు). మూడవ స్థానం:లారీ ఎల్లిసన్ – ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు (209.7 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానం:మార్క్ జుకర్ బర్గ్ – మెటా వ్యవస్థాపకుడు, ( 202.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానం: బెర్నార్డ్ ఆర్నాల్ట్ – లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ సీఈవో, ఛైర్మన్ (168.8 బిలియన్ డాలర్లు) ఆరో స్థానం: లారీ పేజ్ – గూగుల్ సంస్థ మాజీ సీఈవో (156 బిలియన్ డాలర్లు). 7వ స్థానం: సెర్గీ బ్రిన్ – ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు, బోర్డు…

Read More

తిరుపతి పట్టణంలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత తీసుకున్న చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు టీటీడీ భవనంలో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. వారిలో మనోధైర్యం నింపారు. వారిని పరామర్శించి, ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఊహాగానాలు, దుష్ప్రచారాలు కాకుండా విషాదానికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుసుకున్నారు. తిరుపతి పట్టణం స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను కలిసి చికిత్సకయ్యే ఖర్చుల గురించి దిగులుపడవద్దని, ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని… దానితో పాటు పరిహారం కూడా ఇస్తామని… వైకుంఠ ద్వార దర్శనం చేయించి పంపిస్తామని భరోసా ఇచ్చారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ…

Read More

నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, ఈరోజు మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Read More

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీన సంకేతాలకు తోడు ఐటీ, ఫైనాన్షియల్ అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు రెండో రోజు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 528 పాయింట్ల నష్టపోయి 78,620 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 162 పాయింట్ల నష్టంతో 23,526 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.86గా కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా,‌ హిందూస్తాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Read More

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read More