Author: admin

ఇస్రో ఈరోజు నిర్వహించాల్సిన డాకింగ్ (అనుసంధాన) ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ముందుగా ఈ నెల 7వ తేదీనే డాకింగ్ నిర్వహించాలని ఇస్రో భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. రెండు ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ఇటీవల ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెండు శాటిలైట్స్ మధ్య దూరాన్ని 225 మీటర్లకు చేర్చేందుకు ఓ పక్రియ నిర్వహించగా, రెండింటి మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో నేడు నిర్వహించాలనుకున్న డాకింగ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఇస్రో శాటిలైట్స్ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. అయితే డాకింగ్ తదుపరి తేదీని మాత్రం ప్రకటించాల్సి ఉంది.

Read More

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది.కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది.వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తనయుడి ఇల్లు సైతం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు మాలిబులో ఇల్లు ఉంది.ఈ మంటల్లో అది కాలి బూడిదైనట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.ఇంటిముందు ఉంచిన కారు సైతం కాలిపోయిందని రష్యన్ టెలివిజన్ తెలిపింది.ఈ ఘటనపై తనకు సరైన సమాచారం లేదని జో బైడెన్ విలేకరులతో పేర్కొన్నారు.

Read More

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది.దీనితో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది.కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ ను ఖాళీ చేయిస్తున్నారు.చాలామంది సినీతారలు ఇళ్లను, సంపదను కోల్పోయారు.మొత్తంగా 2000 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి.ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.దాదాపు 1.3 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేయించారు.

Read More

సినీ నటి నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి తనని వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియ జేశారు.బాలీవుడ్ కు చెందిన నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ రాణిస్తున్నారు.సవ్య సాచి తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ది రాజా సాబ్,హరిహర వీరమల్లు కోసం వర్క్ చేస్తున్నారు

Read More

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తిరుపతి వచ్చారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటన జరగాడానికి గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ల లభ్యత గురించి కూడా సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.

Read More

భార‌త స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహ‌ల్,యూట్యూబర్ ధనశ్రీ వర్మ జంట విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో విడాకుల రూమర్స్‌పై చాహల్‌ భార్య ధనశ్రీ మౌనం వీడారు.ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తలను చూస్తుంటే నాకు,నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది.నిజాలు తెలుసుకోకుండా నిరాధారమైన రాతలు రాస్తున్నారు.నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్‌ చేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.ఈ విషయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది.జీవితంలో ఎదగడానికి,మంచి పేరు తెచ్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను.నా మౌనం బలహీనతకు సంకేతం కాదు.విలువలకు కట్టుబడి వాస్తవం పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాను.నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Read More

ఏపీ ప్రభుత్వం తిరుపతిలో గత రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి ,పార్థసారథి, సత్య కుమార్ తదితరులు పరామర్శించారు. క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఘటన ప్రమాదమా? కుట్రా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎవరి వైఫల్యమో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు. బాధ్యులు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read More

భారతదేశ అభివృద్ధికి ప్రవాసీ భారతీయిలు చేస్తున్న సహకారాన్ని గుర్తించాలనే ఉద్దేశ్యంతో 2003 నుండి జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం విదేశీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 1915, జనవరి 9న భారత జాతిపిత మహాత్మా గాంధీ సౌతాఫ్రికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. దానిని పురస్కరించుకుని ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవడానికి ఈ రోజును ఎంచుకున్నారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయుల విజయ ప్రస్థానం ప్రపంచం ముందు ఉండడంతోపాటు వారి శ్రమను ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఇక నేడు 18 వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిస్సా లో నిర్వహించారు. ఎల్ఎం సింఘ్వీ నేతృత్వంలోని భారతీయ ప్రవాసులపై ఉన్నత స్థాయి కమిటీ జారీ చేసిన సిఫార్సుల మేరకు ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి ప్రధాని అటల్ బీహార్ వాజపేయి ప్రకటన తర్వాత ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకోవాలని…

Read More

నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన “డాకు మహారాజ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగాల్సి ఉండగా అది రద్దు చేసినట్టు టీమ్ ప్రకటించింది. తిరుపతి ఘటన నేపథ్యంలో టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది.పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సరికాదని భావిస్తున్నాం…బాధాతప్త హృదయంతో,భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం..ఈ సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో ప్రగ్య జైస్వాల్,ఊర్వశి రౌతేలా కథానాయకులుగా నటితున్నారు.జనవరి 12 న విడుదల కానుంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

Read More

సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read More