నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై ఏపీ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఇక 17 లక్షల మంది మేధావులు, వివిధ రంగాల నిపుణులు, సాధారణ ప్రజలు విజన్ డాక్యుమెంట్ పై తమ సలహాలు, సూచనలు అందించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటూ డాక్యుమెంటు నమూనాను…
Author: admin
దేశంలో సబ్బుల ధరలు పెరిగాయి.విప్రో, హిందూస్తాన్ యునిలివర్ లిమిటెడ్ తోపాటు దేశం లో ఉన్న అన్ని ఎఫ్ఎంసీజి సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.సబ్బుల తయారీ లో ఉపయోగించే ప్రధాన ముడిసరుకు పామాయిల్ ధర ఈ సంవత్సరం బాగా పెరిగింది.దానివల్ల సబ్బుల తయారికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది.అందుకే తాము సబ్బుల ధరను 7-8 శాతం పెంచుతున్నాం అని ఆ సంస్థలు తెలిపాయి.ప్రతికూల వాతావరణాల వల్ల టీ పొడి ఉత్పత్తి తగ్గిందని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది.టీ పొడి ధర పెంచుతున్నాం అని చెప్పింది.
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత టాప్ షట్లర్లు పివి.సింధు, లక్ష్యసేన్ క్వార్టర్స్ లో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకున్నారు. టాప్ సీడ్ సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో చైనాకు చెందిన డాయ్ వాంగ్ పై 21-15, 21-17తో నెగ్గింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ 21-8, 21-19తో గెలిచాడు. ప్రియాన్షు రజావత్ 21-13, 21-8తో వియత్నాంకు చెందిన డాంగ్ నుయెన్ పై గెలిచి సెమీస్ చేరాడు. ఉన్నతి హుడా అమెరికాకు చెందిన ఇషిక పై 21-16, 21-9 తో గెలిచి సెమీస్ చేరింది. మహిళల డబుల్స్ లో గాయత్రి-ట్రీసా ద్వయం, పురుషుల డబుల్స్ లో పృథ్వి-సాయి ప్రతీక్ కూడా గెలిచి సెమీస్ చేరారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో మరో డ్రా నమోదైంది. భారత యువ ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్ చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్ లీ మధ్య జరిగిన నాలుగో గేమ్ డ్రా గా ముగిసింది. మూడో రౌండ్ లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుని విజయం సాధించిన గుకేశ్ నాలుగో రౌండ్ లో కూడా చక్కని ఆటతీరు కనబరిచాడు. దూకుడుగా ఎత్తులు వేస్తూ లీరెన్ తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు 42 ఎత్తుల దగ్గర డ్రా కు ఒప్పుకున్నారు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 2-2తో సమానంగా ఉన్నారు. ఇంకా 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ముంబయి వెళ్ళింది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 12 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ టీమ్ లోని అందరికీ థాంక్స్ చెప్పారు. రష్మిక తనకెంతో సపోర్ట్ చేసిందన్నారు. ఆమె స్వీట్ పర్సన్ అని మెచ్చుకున్నారు. సుకుమార్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేము ఎప్పుడు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని ఆలోచించలేదు.ఆడియెన్స్ కి మంచి మూవీ అందించాలి అనేదే మా ఉద్ధేశం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. పాకిస్తాన్ కు భారత జట్టు వెళ్ళేది లేదని స్పష్టం చేసింది.భారత విదేశాంగ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ మీడియా తో మాట్లాడారు.”పాక్ లో భద్రత పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. మేము దానిని పరిగణిస్తున్నాం.మన జట్టు అక్కడికి వెళ్ళేది లేదు ” అని తెలిపారు.బీసీసీఐ ప్రకటన పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు పెట్టాలని అనుకుంది. కాకపోతే దానికి పాక్ ఒప్పుకోవడం లేదు.
నటి సమంత తండ్రి ఇంట్లో విషాదం నెలకొంది.ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.“మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అని తెలిపారు.హృదయం ముక్కలైన ఎమోజి షేర్ చేశారు.సమంత జీవితంపై జోసెఫ్ ప్రభావం ఎంతగానో ఉంది. ఇదే విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.చిన్నతనంలో ఆయన మాటలు తన కాన్ఫిడెన్స్ పై ప్రభావం చూపాయన్నారు.తమ పిల్లల్ని అమాయకులుగా భావించే మిగిలిన తల్లిదండ్రుల మాదిరిగా ఆయన కూడా నన్నొక అయాకురాలిగా చూసేవారు.చిన్న పిల్లగా భావించేవారు.దానివల్ల ఇండస్ర్టీలోకి వచ్చిన కొత్తలో సక్సెస్ ని అంగీకరించడానికి చాలా టైం పట్టింది.నటిని అయ్యి..నా కాళ్ళ పై నేను నిలబడిన తర్వాత నాన్నకి నా పై నమ్మకం వచ్చింది.నన్ను చూసి గర్వపడ్డారు అని గతంలో సమంత చెప్పారు.
అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం పవన్ స్వయంగా వెళ్లి చూశారు. కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం…
నిన్న నష్టాలతో డీలా పడిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ట్రేడింగ్ ఆరంభంలో ఫ్లాట్ గా ప్రారంభమై ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు జోష్ ఇచ్చింది. దీంతో ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.49గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, , మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
భారత మాజీ లెజెండరీ క్రికెటర్ మొహిందర్ అమర్ నాథ్ జ్ఞాపకాలతో సిద్ధం చేసిన ‘ఫియర్ లెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. భారత విదేశాంగ విధానంలో అవలంభిస్తున్న తీరు, అంతర్జాతీయ వేదికలపై భారత్ దూకుడును క్రికెట్ తో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాక్ విషయంలో మారిన భారత వైఖరిని ఆయన క్రికెట్ తో పోలుస్తూ చెప్పారు. 1983 భారత క్రికెట్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. పాకిస్థాన్ ఓ దశలో ప్రపంచ కప్పును గెలిచింది. శ్రీలంక కూడా గెలుచుకొంది. కానీ, 1983 అనేది క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. ఎందుకంటే ఆ తర్వాత భారత క్రికెట్ ఏవిధమైన మార్పులు చూసిందో అదే విధంగా విదేశాంగ విధానం, క్రికెట్ లో వచ్చే మార్పులతో పోల్చడానికి ఎప్పుడూ ఇష్టపడతానని అన్నారు. చాలామంది విదేశాంగ విధానాన్ని చదరంగంతో పోల్చేందుకు ఇష్టపడతారని…