నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘ఫెంజల్’ గా పేరుపెట్టారు. ఈ తుఫాను కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తుఫాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైం గవర్నెన్స్, సీఎంఓ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Author: admin
ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమి భారీ విజయం నమోదు చేసి అధికారం దక్కించుకుంది. బీజేపీ 132 స్థానాలలో, షిండే శివసేన 57 స్థానాలలో, అజిత్ పవార్ ఎన్.సీ.పీకి 41 స్థానాలలో గెలుపొందాయి. మహా వికాస్ అఘాడీ కూటమిగా కాంగ్రెస్ (16), ఉద్ధవ్ ఠాక్రే శివసేన(20), శరద్ పవార్ ఎన్.సీ.పీ (10) కలిసి పోటీ చేశాయి. కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా వచ్చి తమ అనుమానాలను వివరిస్తామని తెలిపింది. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు డిసెంబర్ 3న రావాలని పేర్కొంటూ ఎన్నికల సంఘం కాంగ్రెస్ ను ఆహ్వానించింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని కాంగ్రెస్ అనుమానాలు విన్న అనంతరం రాత పూర్వకంగా సమాధానమిస్తామని ఈసీ తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒడిశాలో పర్యటిస్తున్నారు.పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే అఖిల భారత డైరెక్టర్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, వామపక్ష తీవ్రవాదం, కోస్టల్ సెక్యూరిటీ, కొత్త నేర చట్టాలు, మాదక ద్రవ్యాల కట్టడి తదితర అంశాలపై ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. 2025 ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, భధ్రతా కారణాలు రీత్యా బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదించగా.. పాకిస్థాన్ మాత్రం మొత్తం మ్యాచ్ లు తమ దేశంలోనే జరగాలని పట్టుబడుతోంది. తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలోనూ ఇదే వైఖరితో పాక్ ఉండడంతో ఐసీసీ పాక్ కు తేల్చి చెప్పింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే సరేనని లేకుంటే నిర్వహణ నుండి తప్పుకోవాలని సూచించింది. హైబ్రిడ్ మోడల్ కు అంగీకరిస్తే తటస్థ వేదికపై యూఏఈలో మ్యాచ్ లు జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్ ఒకటే పాక్ లో మ్యాచ్ లు జరిగేందుకు పరిష్కారమని ఐసీసీ పాక్ కు తెలిపింది. భారత్ ఒకవేళ ఆడకపోతే ఆ ప్రభావం ట్రోఫీపై…
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘అమరన్’. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానుంది. డిసెంబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
రష్యా , ఉక్రెయిన్ మధ్య ఎంతోకాలం నుండి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలై ఇటీవలే 1000 రోజులు కూడా దాటింది. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వనరులు నాశనం అయ్యాయి. తాజాగా ఈ యుద్ధం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. తాము యుద్ధాన్ని ఆపేస్తామని తెలిపారు. అయితే కొన్ని షరతులు ఉన్నాయన్నారు. తమని వెంటనే నాటోలో భాగం చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఆ పని జరగాలన్నారు. కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో రక్షణ ఇస్తే.. మిగిలిన భూమిని రష్యా కు వదిలేస్తామని వెల్లడించారు.
రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈఎస్.ఐ, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ, ఎల్&టీ,బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, టీటీడీ,సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్,ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు భూకేటాయింపులు చేశారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తయ్యి జనవరి నుండి రాజధానిలో పనులు మొదలవ్వాలని ఈసందర్భంగా మంత్రులు అధికారులను ఆదేశించారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వచ్చే ఏడాది జనవరి నుండి జనంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుండి వారానికి రెండు రోజులపాటు జిల్లాలలో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఈవిషయం తెలిపారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్ గా జిల్లాలలో పర్యటిస్తానని పేర్కొన్నారు. ఈసందర్భంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో మమేకమవనున్నారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పోర్న్ (అశ్లీల) చిత్రాల నిర్మాణం కేసులో నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నివాసం, కార్యాలయాల్లో ఈడి సోదాలు చేస్తున్నట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తరఫు న్యాయవాది స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. రాజ్ అధికారులకు సహకరిస్తున్నారు. ఈడీ సోదాల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సోదాల్లో జరుగుతున్నట్టు వస్తోన్న వార్తల్లో శిల్పా శెట్టి ఫొటోస్ అస్సలు వాడొద్దు అని మీడియా కు తెలిపారు.అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్ లా ద్వారా వాటిని విడుదల చేస్తున్నారే ఆరోపణలతో 2021లో రాజ్ పై కేసు నమోదు అయింది. కొంతకాలం ఆయన జైల్లో ఉన్నారు.
డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ అల్లు అర్జున్ చేసిన వీడియో పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బన్నీని అభినందించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేశారు. ఇది ఆనందించదగ్గ విషయo అని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరూ కలిసి పనిచేద్దాం అంటూ పిలుపునిచ్చారు.రేవంత్ రెడ్డి ట్వీట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌ను, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని తెలిపారు.