‘ఫెంజల్’ తుఫాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి దగ్గరలో ఇది తీరం దాటుతోంది. తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ దాదాపు 4 గంటలు పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. గత 6 గంటలుగా గంటకు 7 కిమీ వేగంతో ఇది కదిలిందని రాత్రి 11:30 సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ గాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Author: admin
అయోధ్య రామాలయ పూజారులు పాటించాల్సిన విధి విధానాల గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కీలక ప్రకటన విడుదల చేశారు. సుమారు ఆరు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న పూజారులు త్వరలో విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కుటుంబంలో జనన, మరణాలు సంభవించినప్పుడు ఆలయంలోకి రావొద్దు. దేవాలయం లో ఉన్నప్పుడు ఫోన్స్ వాడడానికి వీలు లేదు. అవసరం అయితే కేవలం బేసిక్ ఫోన్ మాత్రమే వాడాలి. దుస్తుల విషయంలోనూ ఆలయ ఆచారాన్ని పాటించాలి అని చెప్పారు.
ఇటీవల విడుదలైన ‘క’ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్ ఆబ్బవరం. థియేటర్ లో రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమా పై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కిరణ్ కృతజ్ఞతలు చెప్పారు. క 2 భారీ స్థాయిలో ఉంటుందన్నారు. క అనుకున్నంత విజయం అందుకోకపోతే సినిమాలు మానేస్తా అన్నారు నిజంగానే అదే చేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా.. ఆవును ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడిని అన్నారు. తాను మాటపై నిలబడతా అన్నారు.మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చిందని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనల ఫలితంగా గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి.) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం – అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా గిరిజన మహిళలను దీనిలో భాగం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. కలప ఉత్పత్తులను మినహాయించి ఇతర నాణ్యమైన, అరుదైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్, బ్రాండింగ్ చేయడం మీద దృష్టిపెడతారని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం…
హిందువులు, మైనారిటీలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మహామ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆక్షేపించింది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అన్యాయమని తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని తెలిపింది. హిందువులు మిగిలిన మైనారిటీలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై భారత్ మరియు అంతర్జాతీయ సమాజం సంఘీభావంగా నిలబడాలని పేర్కొంది. ఇక బంగ్లాలోని హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్ధనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. చటోగ్రామ్లో కొందరు ఆందోళనకారులు హిందూ వ్యతిరేక నినాదాలు చేస్తూ మూడు దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ తరహా ఘటనలపై స్పందించిన భారత్.. దేశంలోని అల్పసంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తున్న ‘ఫెయింజల్’ తుపాను మరికొంతసేపటిలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు పలు విమాన సర్వీసులు నిలిపివేశారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ పుష్ప ది రూల్ ‘. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈచిత్రం మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెండో భాగంపై అంబరాన్ని తాకేలా అంచనాలున్నాయి. డిసెంబర్ 5న ఈచిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుండి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్స్ ఏదైనా సరే టికెట్ ధర 800 లేనని చెప్పింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 5 నుండి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150,…
2024 సంవత్సరానికి గాను విజికీ తెలిపిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్ లో ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. 100 పాయింట్ల న్యూస్ స్కోర్ కి గాను రిలయన్స్ కు 97.43 పాయింట్లు లభించాయి. గతేడాది 96.46 పాయింట్లు, 2022 లో 92.56 పాయింట్లు, 2021లో 84.9 పాయింట్లు పొందింది. ప్రతి సంవత్సరం పాయింట్లు పరంగా రిలయన్స్ పెరుగుతూ వచ్చింది. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సంస్థల కంటే ఎక్కువగా వార్తల్లో కనిపించిన కంపెనీగా రిలయన్స్ నిలిచినట్లు విజికీ పేర్కొంది. బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీతో ఈ స్కోర్ ను లెక్కించినట్లు తెలిపింది. ఇక రిలయన్స్ తరువాత ఎస్.బీ.ఐ, హెచ్.డి.ఎఫ్.సి, ఐసీఐసీఐ వంటివి ఉన్నాయి. విజికీ న్యూస్ స్కోర్ అనేది భారతదేశంలో ఒక బ్రాండ్ యొక్క మీడియా విజిబిలిటీని కొలిచే ప్రమాణం, ఇది పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో న్యూస్ వాల్యూమ్ అంటే…
వయనాడ్ ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గెలుపుని పురస్కరించుకుని కొయ్ కోడ్ లో జరిగిన బహిరంగ సభలో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎంతో చేయాలని ఉన్నా అధికారంలో లేకపోవడం వల్ల అనుకున్నంత సాధ్యం కాకపోవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. వయనాడ్ ప్రజలపై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అదానీపైన విమర్శలు గుప్పించారు. ప్రజల తరపున పోరాడాలని తన సోదరి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి, యూడీ.ఎఫ్ కూటమి నేతలకు చెప్పారు. డీ, మీడియా, సీబీఐ, ఐటీ మోడీ తన ఆధీనంలో ఉంచుకున్నారని తమ వద్ద అవేమీ లేవని అన్నారు. ఇక వయనాడ్ ఎంపీ అవడం పట్ల…
ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో నేడు పర్యటించారు. బొమ్మన హాల్ మండలం నేమకల్లు లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు వృద్ధులకు, నిరాశ్రయులకు, దివ్యాంగులకు పెద్ద కొడుకులా ఆసరాగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కలెక్టర్, ఎస్పీ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తోంది.