Author: admin

అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని‌ ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని దుయ్యబట్టారు. అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్ర. గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర. ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర.…

Read More

తన పెళ్లి గురించి నటి కీర్తిసురేశ్‌ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.వచ్చే నెలలో తాను వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. గోవా ఈ పెళ్లి వేడుక ఉంటుందని తెలిపారు.ఈరోజు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆమె తిరుమల స్వామి వారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు.పెళ్లి, తదుపరి సినిమా విశేషాలు పంచుకున్నారు.నా తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’ డిసెంబర్‌లో విడుదల కానుంది. అదే నెలలో నా పెళ్లి జరగనుంది.అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు.

Read More

ఇటీవల కాలంలో వాయు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతూ…వస్తుంది.పరిశ్రమలతో పాటు కార్చిచ్చు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతోందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.వందల ఎకరాల్లో అడవులు కాలిపోవడం, అలాగే పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాయి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.ది లాన్సెట్ జర్నల్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడించారు.

Read More

అక్కినేని వారి పెళ్లి సందడి మొదలైంది.నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్ 4న జరగనుంది.ఈరోజు హల్దీ వేడుక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాబోయే వధూవరులకు బంధువులు మంగళ స్నానాలు చేయించారు.అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభితల వివాహం జరగనుంది.దీనిపై ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా సింపుల్ గా వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియో తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పారు.ఈ స్టూడియోలోని తన తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకుంటున్నట్లు వివరించారు.ఆయన ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు.శోభిత తనను బాగా అర్థం చేసుకుందని,ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని వివరించారు.నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని ఆమె భర్తీ చేస్తుందని చైతన్య అన్నారు.

Read More

నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గ్రాండ్ ఇవనున్న సంగతి తెలిసిందే.దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ కు సంబంధించిన మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ ప్రశాంత వర్మ చేశారు. ‘యాక్షన్ కోసం సిద్ధమా?’ అని ప్రశాంత్ వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.దీనికి “నందమూరి నాయక” సాంగ్ ను జత చేసి మరీ పోస్ట్ చేశారు. మోక్షజ్ఞ కొత్త లుక్ నందమూరి ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని…

Read More

అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్ గా లేరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల అమెరికాలో ఎన్నికల ప్రచారంలో పలుమార్లు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం,మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరుకావడం తదితర సంఘటనలపై పుతిన్ మాట్లాడారు.అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటవెంటనే జరగడం మాత్రం అసాధారణమైన విషయం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. నా అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్ లోనే ఉన్నాడని వెల్లడించారు.అయితే ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి, నాయకుడు అని ప్రశంసలు గుప్పించారు.తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.ఈమేరకు కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న పుతిన్..ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More

తెలుగు హాస్య నటుడు వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం ‘శ్రీ‌కాకుళం షెర్లాక్ హోమ్స్’.తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను చిత్రబృందం విడుద‌ల చేసింది.ఈ చిత్రానికి రైట‌ర్‌ మోహ‌న్ దర్శ‌క‌త్వం వహిస్తున్నారు.ఇందులో నాగ‌ళ్ల కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం శ్రీ‌కాకుళంలో జ‌రిగిన‌ ఓ హ‌త్య‌ కేసులో పోలీసుల‌కు కూడా అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల్ని ఓ లోక‌ల్ గూఢ‌చారి ఎలా ఛేదించాడ‌నే కథాంశంతో తెరకెక్కించారు.టీజ‌ర్‌లో వెన్నెల కిశోర్ త‌న‌దైన కామెడీ, డైలాగ్ డెలివ‌రీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వి.రమణరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్‌ 25న విడుద‌ల కానుంది. https://youtu.be/tQf3W1QO9nY?si=dGuh8kid50HHqmNo

Read More

దేశ యువ‌త సంక‌ల్పిస్తే ఏదైనా సాధించ‌గ‌ల‌ద‌న్న విశ్వాసం త‌న‌కు ఉన్నాయ‌ని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో యువ‌తకు అపార‌ అవ‌కాశాల క‌ల్పన జరుగుతున్నట్లు తెలిపారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువ‌త‌కు అన్ని అవ‌కాశాలు క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్పష్టం చేశారు. అద్భుతాలు చేయ‌గ‌ల యువ శ‌క్తి భారత్ సొంత‌మ‌ని తెలిపారు. MY GOV ఇండియాలో వ‌చ్చిన పోస్టుల‌కు స్పందించిన ప్ర‌ధాని ఈ మేర‌కు పేర్కొన్నారు.

Read More

సులభంగా, వేగంగా, వ్యయం లేకుండా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు వీలుగా ‘ఈ-దాఖిల్’ పోర్టల్ ను లద్దాఖ్ లో కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ తాజాగా ప్రారంభించింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి ఉండనున్నాయి. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు కేసు నమోదు చేసుకోవచ్చు మీ. చేసిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో పరిశీలించడం, నిర్వహణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 2020 సెప్టెంబరులో 7వతేదీన ఈ-దాఖిల్ పోర్టల్ ఆవిష్కరింపబడింది.

Read More

ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పింది. ఈమేరకు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా మారలేదని ఈరోజు సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇది ఈనెల 28 సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాగా 30 ఉదయం నాటికి కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. తుఫాను ముప్పు లేకపోయినప్పటికీ వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read More