Author: admin

స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలు వెంట పరుగులు పెడుతున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నేడు మాట్లాడుతూ అందరం కలిసి పనిచేసి పెట్టుబడులు సాధించి, ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లాగే విశాఖ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2014-19 మధ్యలో పెద్ద ఎత్తున ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలు తీసుకొచ్చాం. తిరుపతి, కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటు చేయించినట్లు వివరించారు. మా హయాంలో 53 కంపెనీలు, 15 వేల కోట్ల పెట్టుబడి, 97 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నాం. అప్పటివరకూ ఏపీలో తయారయ్యే సెల్ ఫోన్లు లేవు. చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోనే సెల్ ఫోన్లు 25 శాతం తయారయ్యే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు. రాష్ట్ర విభజనతో కోలుకోలేని నష్టం జరిగిందని అయితే అనంతరం నవ్యాంధ్ర పునర్నిర్మాణం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం…

Read More

అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలకు తోడు భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ గత ట్రేడింగ్ సెషన్ లో లాభాల బాట పట్టినా నేడు మరోసారి తన నష్టాల పరంపరను కొనసాగించాయి. దీంతో మదుపర్లకు నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం లాభాలలో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,802.73 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 422 పాయింట్ల నష్టంతో 77,155 వద్ద ముగిసింది.నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 168 పాయింట్ల నష్టంతో 23,349 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం రూ. 84.52 వద్ద కొనసాగుతోంది.

Read More

2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్ఆద్మీపార్టీ తమ అభ్యర్ధులకు సంబంధించిన మొదటి జాబితాను నేడు విడుదల చేసింది. 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 1.ఛతర్ పూర్-బ్రహ్మ్ సింగ్ తన్వార్ 2.బాదర్ పూర్- రామ్ సింగ్ నేతాజీ 3.లక్ష్మీ నగర్ -బిబి త్యాగీ 4.శీలం పూర్-చౌదరి జుబేర్ అహ్మద్ 5.సీమ పూరి -వీర్ సింగ్ దింగాన్ 6.రోహ్తాస్ నగర్- సరితా సింగ్ 7.గోండా -గౌరవ్ శర్మ 8.విశ్వాస్ నగర్ -దీపక్ సింగ్లా 9.కరవాల్ నగర్ – మనోజ్ త్యాగి 10.కిరారీ -అనిల్ నా 11.మటియాలా-సుమేష్ షోకీన్ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజా తీర్పు కోసం కొన్ని నెలల క్రితం రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రానున్న ఎన్నికల కోసం పార్టీ ముందుకు నడిపిస్తున్నారు.…

Read More

అక్టోబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో-హీరోయిన్ల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా వెల్లడించింది. హీరోల జాబితాలో ప్రభాస్ నిలవగా..ఇందులో హీరోయిన్స్ జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇక హీరోల జాబితాలో రెండులో తమిళ నటుడు విజయ్, మూడులో షారుకాఖాన్ ఉన్నారు. *టాప్ 10 హీరోల జాబితా* 1.ప్రభాస్ 2.విజయ్ 3.షారుఖ్ ఖాన్ 4.జూనియర్ ఎన్టీఆర్ అజిత్ కుమార్ 6.అల్లు అర్జున్ 7.మహేష్ బాబు 8.సూర్య 9.రామ్ చరణ్ 10.సల్మాన్ ఖాన్ *టాప్ 10 హీరోయిన్ ల జాబితా* సమంత 2.అలియా భట్ 3.నయనతార 4.దీపికా పదుకొనె 5.త్రిష 6.కాజల్ అగర్వాల్ 7.శ్రద్దా కపూర్ 8.సాయిపల్లవి 9.రష్మిక 10.కత్రినా కైఫ్.

Read More

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడు నెలల్లో విశాఖకు వస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఐదుసంవత్సరాలలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీలో టాప్ 100 కంపెనీలను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్వెన్షన్ సెంటర్, టూరిజం, రియల్ ఎస్టేట్ రంగాలతో సోషల్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేస్తున్నాం. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది. దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగితే అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారన్నారు. అప్పటినుండి ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఏపీకి అవమానం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారు. దీంతో…

Read More

విడిపోవాలని నిర్ణయించుకుని ఎవరైనా దంపతులు న్యాయస్థాన్నాన్ని ఆశ్రయిస్తే…ఆ కేసు తేలే వరకూ అత్తవారింట లభించే ప్రయోజనాలన్నింటిపై భార్యకు హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టం చేసింది.భర్త పొందే సదుపాయాలన్నీ ఆమెకూ చెందుతాయని తెలిపింది.ఓ కేసులో భార్యకు చెల్లించాల్సిన నెల వారీ మధ్యంతర భరణాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.రూ.80 వేలకు భరణాన్ని తగ్గిస్తూ గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

Read More

విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యం పై శాసనమండలిలో నేడు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈసందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగినట్లు తెలిపారు. అయితే వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేస్తోందని ఆ నివేదిక 2025 జనవరిలో వస్తుందని వివరించారు. అది వచ్చిన అనంతరం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోందన్నారు. కంప్రెస్సడ్ బయో గ్యాస్ వినియోగంతో పొల్యూషన్ తగ్గిస్తామని పేర్కొన్నారు. గుంటూరు విశాఖపట్నం లలో ఘన వ్యర్ధాలతో విద్యుత్ తయారీ చేపడుతున్నామని దానిని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. కాలుష్య నివారణకు ఎన్జీవోలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖలో క్షేత్ర స్థాయిలో పర్యటించి కాలుష్య…

Read More

బిలియన్ డాలర్ల లంచం,మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.ఈ విషయంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.‘మోదానీ’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటుచేయాలని 2023 జనవరి నుంచి కోరుతున్నామంది.‘హమ్‌ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, ఇంతవరకు సమాధానం రాలేదని హస్తం పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.

Read More

55వ భారతీయ అంతర్జాతీయ సినిమా వేడుక గోవా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. రాజధాని నగరం పనాజీ లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ వీడియో సందేశాల ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై భారత చలనచిత్ర రంగ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హాల శత జయంతుల సందర్భంగా వారికి నివాళులు ఘనంగా నివాళులర్పించారు. ఈ నలుగురి పేరిట స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ దర్శకుడు శేఖరకపూర్, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా నేడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి అవకాశం ఉంది. 1964 డిసెంబరు 24న జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికై, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర…

Read More