Author: admin

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.2024- 25 నూతన క్రీడా పాలసీకి ఆమోదం లభించింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనను చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుండి రెండు సంవత్సరాలకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్(ఈగల్) మారుస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం లభించింది.…

Read More

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటూ పాలనలో తనదైన శైలి కనబరుస్తున్నారు. తాజాగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, విధుల్లో చేరిన నాటి నుండి వేతనాలు లేవని అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నామని ఆవేదనతో పని చేసిన కాలానికి జీతాలు ఇప్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత నెలలో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం చూపుతూ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు నేడు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు విడుదల కావడం పట్ల మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం…

Read More

2024 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ లో సీఎం మాట్లాడారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆయన వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై మండిపడ్డారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిలా నేర్చుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న సంగతిని గుర్తు చేసుకున్నారు. వేధింపులకు గురిచేసి చివరికి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఎదురైతే ఇంకా మనోధైర్యంతో ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు ప్రపంచదేశాల్లోని తెలుగువారు రోడ్డు పైకి వచ్చి పోరాడారని ప్రజలు ఇచ్చిన…

Read More

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్​సెల్​ – మ్యాక్సిస్‌ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ఎయిర్​సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయిల్‌ కోర్టులో ఈడీ కొంతకాలం క్రితం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనితో చిదంబరంపై విచారణకు ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది.

Read More

డిజిటైజేషన్‌ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ భారీ మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల దేశం మొత్తంగా 80.6కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పింది. ఆధార్‌ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగిపోయాయని పేర్కొంది. ఇప్పటివరకు 20.4కోట్ల రేషన్‌ కార్డుల డిజిటలీకరణ పూర్తయిందని చెప్పింది. వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు పథకంతో దేశంలో ఎక్కడైనా సరకులు తీసుకునే అవకాశం లబ్ధిదారులకు కలిగిందని తెలిపింది.

Read More

జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా వింత ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన ఒక కంపెనీ సింగిల్స్‌ డేటింగ్‌పై ఆసక్తి చూపించేలా ఆసక్తికర ప్రకటన చేసింది.దక్షిణ చైనాలోని ఓ టెక్‌ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.ఆ సంస్థకు చెందిన డేటింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌లో కంపెనీలోని సింగిల్స్‌ ఆకర్షణీయమైన ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకోవాలి.అలా చేస్తే 66 యువాన్లు (భారత కరెన్సీలో రూ.770) ఇస్తారు.ఎవరైనా ఆకర్షితులు అయితే వారితో మూడు నెలల పాటు డేటింగ్‌ కొనసాగించాలి.దీనికి ఒక్కొక్కరికీ వెయ్యి యువాన్లు (రూ.11,650) గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పింది.

Read More

అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’.ఆయన తనయుడు రాగిన్‌ రాజ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.తాజాగా ఈసినిమా టీజర్‌ విడుదలైంది.ఇందులో పాల్గొన్న అమ్మ రాజశేఖర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.తన సినిమాలో నటించేందుకు హీరోలెవరూ డేట్స్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే తాను తన తనయుడిని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నానని చెప్పారు.తన టాలెంట్‌ నిరూపించుకుంటానని అన్నారు.

Read More

దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు ఎక్కువవుతోంది.గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది.గాలి నాణ్యతా సూచీ 400లకు పైగా నమోదవుతోంది.ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది.కాలుష్య తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు.

Read More

ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో వరుస శతకాలతో చెలరేగిన భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 69 స్థానాలు మెరుగు పరుచుకుని సూర్యకుమార్ యాదవ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్లో టాప్-10లో నిలవడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు మ్యాచ్ లలో శతకాలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సౌతాఫ్రికా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో తిలక్ 198 స్ట్రైక్ రేటుతో 280 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ లలో కలిపి 20 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండు శతకాలు చేసి ఆకట్టుకున్న మరో బ్యాటర్ సంజు శాంసన్ 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. అతను…

Read More

దేశంలోని 56వ టైగర్ రిజర్వ్ గా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని గురు ఘాసిదాస్- తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఛత్తీస్ ఘడ్ లో మూడు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.బీజాపూర్ లోని ఇంద్రావతి , గరియాబంద్ లో ఉదంతి సీతానది మరియు బిలాస్పూర్ జిల్లాలోని అచానక్ లలో మొత్తం మూడు టైగర్ రిజర్వ్ లు మాత్రమే ఉండగా..ఇప్పుడు ఈ గురు ఘాసిదాస్-తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ గుర్తింపుతో ఛత్తీస్ ఘడ్ లో మొత్తం నాలుగు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్ 2800 చ.కి.మీ పైగా విస్తరించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా నిలిచింది. ఇక పులుల…

Read More