అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాల నుండి కోలుకుని తిరిగి లాభాలతో దూసుకెళ్లాయి. అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కనబరిచాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాలు చూశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీల జోరును మరింత పెంచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఓ దశలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 550 పాయింట్లకు పైగా లాభపడింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులో దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది. చివరికి సెన్సెక్స్ 1,961 పాయింట్ల లాభంతో 79,117 ఇక నిఫ్టీ సైతం 557 పాయింట్లు లాభపడి 23,907 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 లో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్…
Author: admin
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పెర్త్ వేదికగా నేడు ప్రారంభమైంది.మొదటి రోజు ఆద్యంతం ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌటైంది. తెలుగు తేజం నితీశ్ రెడ్డి (41) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హేజిల్ వుడ్ 4 వికెట్లను పడగొట్టాడు. స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ రెండు వికెట్లు చొప్పున పడగొట్టాడు. ఇక అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కూడా బ్యాటింగ్ లో భారత బౌలర్ల ధాటికి తడబడింది. భారత కెప్టెన్ బుమ్రా కళ్లు చెదిరే బంతులతో మొదటి నాథన్ (10), కవాజా (8), స్మిత్ (0) మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ట్రావిస్ హెడ్ (13) ను హార్షిత్ రాణా బౌల్డ్ చేశాడు. మార్ష్ (6), లబూషేన్ (2) ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో…
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ తీవ్రమైంది.మొన్న ఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది.రష్యా తొలిసారిగా యుద్ధంలో దీర్ఘశ్రేణి ఆయుధాన్ని వాడింది.ఉక్రెయిన్ మీద ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని క్లీవ్ ఎయిర్ ఫోర్ప్ ధృవీకరించింది.అయితే ఏ రకమైన క్షిపణిని ప్రయోగించారో కచ్చితంగా చెప్పలేదు.ఈ మేరకు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది.మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది.ఈ అంశంపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.ఇది తమ సైనికులను అడిగాల్సిన ప్రశ్న అని అన్నారు. అయితే ఉక్రెయిన్ కూడా ఇవే ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్షుడు బైడెన్ దీనికి అనుమతినిచ్చిచారు అని సమాచారం.ఈ అంశంపై రష్యా తీవ్రంగా స్పందించింది.వెంటనే రష్యా కూడా అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు వీలుగా నిన్న అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు.దీనికి సంబంధించిన పత్రాల మీదన సంతకాలు చేశారు.కాగా రష్యా కూడా భారీగా దాడి చేయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం…
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.గాజాలో యుద్ధ నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి.గాజాలో యుద్ధ నేరాలు,మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై…ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే ఐక్యరాజ్యసమితి,ఇతర దేశాలు ఎప్పటి నుంచో యుద్ధాన్ని ఆపమని కోరుతున్నాయి.అయినా కూడా ఇజ్రాయెల్ అందరి మాటను పెడచెవిన పెడుతోంది.హమాస్,హెజ్బెల్లాలు అంతమొందించే వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ అంటుంది.
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లంచాల కోసం జగన్ ఆంధ్రప్రదేశ్ ను సొంత జాగీరులా వాడుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుండి రూ.1,750కోట్ల లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలని ఒక్కో ఒప్పందానికి జగన్ ఎంత లంచం తీసుకున్నారో తేల్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అక్రమాలతో ప్రజలపై రూ. వేలకోట్ల భారం పడుతోందని షర్మిల విమర్శించారు. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తెలియదు…
భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ,ఇతరులు దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న అమెరికా అభియోగాలతో భారత్ స్టాక్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.మొదటి రోజు అదానీ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ రూ. 2.2 లక్షల కోట్లునష్టపోయింది.అమెరికా అభియోగాల తర్వాత అదానీతో కుదుర్చుకున్న విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్ట్‌తోపాటు జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నట్టు కెన్యా ప్రభుత్వం పేర్కొంది. దీనితో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నాలుగు శాతం క్షీణించాయి.అదే విధంగా అదానీ పోర్ట్స్,అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్,అదానీ విల్‌మార్,అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 3 నుండి 10 శాతం పతనమయ్యాయి.ఒక వైపు మార్కెట్లో ఇంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ అదానీకే చెందిన అంబుజా సిమెంట్స్‌తోపాటు ఎన్డీటీవీ షేర్లు ఒక్కోటి ఒక శాతం పెరగడం విశేషం.
హిందూ మహాసముద్రం మరియు దక్షిణ అండమాన్ సముద్రం పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 26,27వ తేదీలలో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సంరక్షించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తన తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహాన్ని ఉద్దేశించి నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వారిద్దరిని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.వారి కోరిక మేరకు సింపుల్,సంప్రదాయబద్దంగా ఈ పెళ్లి చేయాలనుకుంటున్నామని తెలిపారు.డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ జంట పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి.ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ నగరం. మొదటి ర్యాంక్ లో నిలిచింది. గత పదేళ్లుగా ఈ జాబితాలో లండన్ నగరమే ప్రపంచ ఉత్తమ నగరంగా ఉంటోంది. తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ, తదితర నగరాలు టాప్-10లో నిలిచాయి. రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న ఒక సంస్థ ఈ ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలను ఈ జాబితా కోసం పరిశీలించి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, భారీ వ్యాపార మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు లండన్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చినట్లు రిసోనెన్స్ పేర్కొంది. ఈ సర్వే కోసం 30 దేశాలకు చెందిన 22 వేల మందికి పైగా ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించారు. అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈసర్వే నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.సుక్మా జిల్లాలో భద్రతా దళాలు,మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈక్రమంలోనే బలగాలపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు.