పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తెలిపాడు. ‘బాహుబలి’ చూపినప్పటి నుంచి తాను ప్రభాస్‌కు ఫ్యాన్ అయ్యానని అన్నాడు. చిరంజీవి డ్యాన్స్ అంటే కూడా తనకు ఇష్టమని చెప్పాడు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో అయాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, అల్లు అర్జున్‌కు కూడా ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.వీరిద్దరూ ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు.ప్రభాస్ ఆరడుగుల బంగారం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Author: admin
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు కీలక అప్‌డేట్ ఇచ్చారుఈరోజు తమ బృందానికి బిగ్ డే అని పేర్కొన్నారు.ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.మైసూర్‌లోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఇది మొదలైంది. మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి’’ అని పోస్ట్ పెట్టారు.ఈరోజు నుంచి ఈ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లు తెలుస్తోంది.మైసూర్‌లో తొలి షెడ్యూల్ జరగనుందని వార్తలు వస్తున్నాయి.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యానిఫెస్టోలో చెప్పిన మరో హామీ నెరవేరుస్తున్నట్లు ఈసందర్భంగా పేర్కొంది. రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా మందికి లబ్ధి చేకూర్చనుంది. మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇస్తారు. ఒకవేళ రెండు నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే ఆ రెండు నెలల మొత్తాన్ని కలిపి మూడో నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తం ఇచ్చే విధంగా రూపకల్పన చేసింది. వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ మంజూరు చేయటం జరుగుతుంది. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం…
భారతదేశంలోని వీక్షకులకు విభిన్న కంటెంట్‌ను అందించడానికి ప్రసార భారతి అందుబాటులోకి తీసుకొచ్చిన ఓటీటీ ‘వేవ్స్’. దీని ద్వారా రామాయణం, మహాభారతం ధారావాహికలను ఉచితంగా అందిస్తోంది. వీటితోపాటు రేడియో కార్యక్రమాలు, భక్తి గీతాలు, ఆటలు, ఈ- పుస్తకాలను కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేవ్స్ 65 లైవ్ ఛానళ్లు అందుబాటులో ఉంటాయనీ, 10కి పైగా విభాగాల్లో విభిన్న కార్యక్రమాలను పొందవచ్చని ప్రసారభారతి తెలిపింది. ఇక ఈ ప్లాట్‌ఫారమ్ చలనచిత్రాలు, టీవీ సిరీస్‌లు, లైవ్ ఈవెంట్‌లు, గేమ్‌లు మరియు ఎడ్యుకేషనల్ మెటీరియల్‌తో సహా అనేక రకాల వినోదాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వేవ్స్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ మరియు అస్సామీలతో సహా పలు భాషలలో అందుబాటులో ఉంది.
సినిమాకు, సంగీతానికి భాషా భేదం లేదు ప్రాంతీయ బేధం లేదు. భావోద్వేగాలు అనే విశ్వ భాష ద్వారా సరిహద్దులను దాటి అందరినీ ఏకం చేయగల ప్రత్యేక శక్తి వీటికి ఉంది. తాజాగా ప్రారంభమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ‘బెటర్ మాన్’ అనే సినిమాతో ప్రారంభమైంది. మైకేల్ గ్రేసీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం బ్రిటిష్ పాప్ దిగ్గజం రాబీ విలియమ్స్ అసాధారణ జీవితానికి, అతని ఖ్యాతికి అద్దం పట్టే విధంగా తెరకెక్కింది. ఈ చిత్ర నటీనటులు మరియు సిబ్బంది సినిమా ప్రదర్శనకు ముందు రెడ్ కార్పెట్‌పై నడిచారు. ‘బెటర్ మాన్’ తొలిసారి టెల్యురైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది మరియు 2024 సెప్టెంబర్ 10న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.ఈనెల 20న ప్రారంభమైన 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రారంభచిత్రంగా ప్రదర్శించారు. ఈ ఏడాది డిసెంబర్ 26న ఆస్ట్రేలియాలో థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ఒక…
భారత్, ఆస్ట్రేలియా దేశాలు అంతరిక్ష అంశాలకు సంబంధించి పరస్పర సహకారం అందించుకునే వైపు మరింత పటిష్టంగా అడుగులు వేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ (ఏఎస్ఏ) తాజాగా ‘అమలు ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’కు ఆస్ట్రేలియా సహకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. గగన్ యాన్ కు సంబంధించి క్రూ, క్రూ మాడ్యూల్ రికవరీ మిషన్లలో ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చేయూత అందించేందుకు దోహదపడుతుంది.
చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో లక్ష్యసేన్ 21-16, 21-18తో డెన్మార్క్ కు చెందిన రస్ ముస్ గెమ్కీ పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ: పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్ లో ఆరో సీడ్ సాత్విక్ జంట 21-19, 21-15తో డెన్మార్క్ జోడి రసమ్ముస్ జేయర్- ఫ్రెడెరిక్ సోగార్డ్ ను ఓడించి సత్తా చాటింది. పి.వి.సింధు ఓటమి: ఇక మరో స్టార్ షట్లర్ పి..వి.సింధు టోర్నీ నుండి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో సింధు 16-21, 21-17, 21-23తో సింగపూర్ క్రీడాకారిణి యెవో జియా మిన్ చేతిలో పరాజయం చవిచూసింది. మిగతా మ్యాచ్ లలో…
ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఆ వార్తలపై అమితాబ్ బచ్చన్ స్పందించారు.తన బ్లాగ్‌లో పోస్ట్ పెట్టారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు.‘నా కుటుంబం గురించి నేను అరుదుగా మాట్లాడుతుంటా.నా కుటుంబ గోపత్యను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి.పూర్తి సమాచారం తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు.ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు
శివ కార్తికేయన్,సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం‘అమరన్’.మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంది.రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు.ఈ సినిమా వల్ల తన మానసిక ప్రశాంతతకు భంగం కలిగిందంటూ విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు.ఆసినిమాలో హీరోయిన్‌కు వాడిన ఫోన్ నంబర్ తనదేనని..సినిమా విడుదలైన నాటి నుంచి తనకు ఎంతో మంది నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని అతడు పేర్కొన్నాడు.నష్టపరిహారంగా కింద రూ.కోటి డిమాండ్ చేశాడు.
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.అదానీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు.మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా,భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు.మోదీ,అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు.