Author: admin

డాక్యుమెంటరీ విషయంలో సాయం చేసిన తన గత చిత్రాల దర్శక నిర్మాతలు,నటీనటులకు నయనతార థ్యాంక్యూ చెప్పారు.ఆయా చిత్రాలకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని ఆమె తెలిపారు.వాటికి సంబంధించిన విషయాలను తన డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో చూపించాలని భావించానని చెప్పారు.నేను నటించిన ప్రతి చిత్రానికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయా సినిమాలకు సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ వేదికగా మీతో పంచుకోవాలనుకున్నా.అందుకోసం ఆయా సినిమాల దర్శక నిర్మాతలను సంప్రదించారు.వారు దానికి అంగీకరించడంతో ఆ విశేషాలను మీతో పంచుకోగలిగాను.అందుకు వారికి ధన్యవాదాలు’’ అని చెప్పారు.చిరంజీవి, రామ్‌చరణ్‌, షారుక్‌ ఖాన్‌, గౌరీఖాన్‌లతోపాటు తెలుగు, తమిళ చిత్రపరశ్రమలకు చెందిన వారికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు.నయనతార వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ సిద్ధమైన విషయం తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read More

ఇటీవల న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని మళ్లీ తిరిగి గెలుపు బాట పట్టాలనే లక్ష్యంతో ఆసీస్ తో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు సిద్ధమవుతుంది. రేపు పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6-10వరకు రెండో టెస్టు, బ్రిస్బేన్ లో డిసెంబర్ 14-18వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30వరకు మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు), సిడ్నీ వేదికగా జనవరి 3-7 వరకు ఐదో టెస్టు జరుగనున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సిరీస్ పట్ల ఇరు దేశాల అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాల సారథులు ట్రోఫీ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక గతసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన రెండు సార్లు భారత్ దే విజయం కావడం గమనార్హం. మళ్లీ భారత జట్టు…

Read More

నూతనంగా ఎన్నికైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలంగాణ మాజీ మంత్రి కె.టి.ఆర్ తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా బి.ఆర్.నాయుడుకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన కె.టి.ఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గారిని కె.టి‌ఆర్ కోరారు. అలాగే కరీంనగర్‌లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు. కె.టీ.ఆర్ చేసిన విజ్ఞప్తుల పట్ల బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. టీటీడీ తరఫున తెలంగాణ భక్తుల దర్శనాల విషయంలో, అలాగే ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు ఈసందర్భంగా…

Read More

నిన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమిదే అధికారమని ఫలితాలు వెల్లడించాయి.ఆ వివరాల ప్రకారం..బీజేపీ,శివసేన (షిండే),ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని పేర్కొంది.కాంగ్రెస్,ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి 85-112 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. Peoples Pulse Exit Poll 2024: The ruling Mahayuti is poised for victory in Maharashtra! 🏛️ *Majority Mark: 145/288 🔹 Mahayuti: 182 (175-195) 🔹 MVA:* 97 (85-112) 🔹 Others: 9 (7-12) #MaharashtraElections2024 #ExitPollResults #MahayutiVictory #BJPMaharashtra #MVA pic.twitter.com/RFDEanXz4x— Peoples Pulse (@PulsePeoples) November 20, 2024

Read More

నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం గా జరుపుకుంటారు. మత్స్యకారుల హక్కులు, మత్స్య వనరుల సంరక్షణ, సముద్రాలు, నదులు మరియు జల వనరుల ఉపయోగం, వాటి సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఈరోజు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మత్స్యకారుల జీవనోపాధి మరియు సుస్థిర మత్స్యకర్షణ పద్ధతులను ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ప్రజలు మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, సముద్ర కాలుష్యం, అసాధారణ వాతావరణ మార్పులు మరియు మితిమీరిన చేపల వేట కారణంగా ఈ వనరులు నశించిపోతున్నాయి. ఈ రోజున, మత్స్యకారుల సమస్యలు, సాధారణ ప్రజలకు జలవనరుల పై బాధ్యత, మరియు సముద్ర జీవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం వంటి విషయాలను చర్చిస్తారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం మనం ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ, మానవ జీవనానికి ముఖ్యమైన నదులు, సముద్రాల వంటి ప్రకృతి వనరులను పరిరక్షించే బాధ్యతను…

Read More

మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ ను నిలబెట్టుకుని భారత్ సత్తా చాటింది. తాజాగా జరిగిన ఫైనల్లో 1-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాపై గెలిచి మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా దక్షిణ కొరియా (3 టైటిళ్లు) సరసన భారత్ నిలిచింది. యువ స్ట్రైకర్ దీపిక భారత్ తరపున గోల్ చేసి ఆకట్టుకుంది. సాధించింది. రెండు జట్ల డిఫెండర్లు మంచి ఆటతీరుతో మ్యాచ్ తొలి అర్ధభాగంలో గోల్స్ నమోదు కాలేదు. కానీ ద్వితీయార్థం ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక సద్వినియోగం చేసుకుని భారత్ ను ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్కోరు సమం చేయడానికి చైనా చేసిన ప్రయత్నాలను భారత్ సమర్దవంతంగా తిప్పికొట్టింది. లీగ్ దశలో భారత్ 3-0తో చైనాను ఓడించిన భారత్ ఇది మూడో ఆసియా ఛాంపియన్స్ 2016, 2023 టోర్నీ విజేతగా నిలిచింది. ఇక చైనా మూడోసారి రన్నరప్…

Read More

గ్యాంగ్‌స్టర్లకు ఢిల్లీ రాజధానిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిశీ అన్నారు.ఇటీవల హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించారుఆ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి అమిత్‌ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.దిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.సుందర్‌ నగరీలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను వేధిస్తుండగా..ఆమె కుటుంబీకులు,బంధువులు వారిని మందలించారు.అనంతరం ఆ ఇద్దరు కత్తులతో చేసిన దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read More

డీ విట‌మిన్ లోపం వ‌ల్ల నీర‌సం…ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం వంటి ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అంద‌రికి తెలుసు.అయితే దీని లోపం వ‌ల్ల మహిళ‌ల్లో ర‌కర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని వైద్యులు అంటున్నారు.తీవ్ర నీర‌సం…నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డంతోపాటు మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయ‌ని నిపుణులు తెలిపారు. విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక‌పోవ‌డం కూడా ఈ విట‌మిన్ లోప‌మే.మెదడులో విటమిన్‌ డి గ్రాహకాలుంటాయి.ఇవి మూడ్‌ను ప్రభావితం చేసే సెరటోనిన్‌ వంటి రసాయనాల మీదా ప్రభావం చూపుతాయి. అకారణంగా జుట్టు రాల‌టం కూడా విటమిన్ దీనికి సంకేతం కావొచ్చు.చాలాసార్లు హార్మోన్‌ మార్పులు, ఒత్తిడితో వెంట్రుకలు ఊడుతున్నాయని అనుకుంటుంటారు.కానీ విటమిన్‌ డి లోపిస్తే వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి.విటమిన్‌ డి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఇది లోపిస్తే అండాశయ సమస్యలు త‌లెత్తుతాయి.సంతానం కలగటంలో ఇబ్బంది కలిగిస్తాయి.ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ వంటి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తికీ విటమిన్‌ డి తోడ్పడుతుంది.కండరాల నొప్పి,బలహీనత కూడా విటమిన్‌ డి లోపానికి చిహ్నం కావొచ్చు.కాబ‌ట్టి,డి విట‌మిన్ లోపించిన‌ట్లు అనిపిస్తే వైద్యుల‌ను…

Read More

సూప‌ర్‌స్టార్‌ మహేశ్‌ బాబు,ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.త్వ‌ర‌లో పట్టాలెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి న‌టుడు రానా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.త‌న ప్రోగ్రామ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడారు.’గ‌తంలో ఇండియన్‌ సినిమా అంటే విదేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసు. ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదు. ఇప్పుడు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఓటీటీలతో సినిమాల పరంగా భాష పరిధులు తొలగాయి.భారీ సినిమాల‌నే కాదు.. కంటెంట్ ఉన్న ఏ చిత్రాన్ని అయినా చూసేందుకు ప్ర‌పంచం ఎదురుచూస్తోంది.మహేశ్ – రాజ‌మౌళి సినిమా అన్ని హ‌ద్దుల‌ను చెరిపేస్తుంది. భారీ స్థాయిలో ఇది విడుద‌ల అవుతుంది. ’’ అని అన్నారు.ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.మ‌హేశ్ 29వ ప్రాజెక్ట్‌గా ఇది సిద్ధం కానుంది.SSMB29గా ప్ర‌చారంలో ఉంది.గ‌రుడ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.

Read More

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.సంక్రాంతి కానుకగా జనవరి 14న ఇది విడుదల కానుంది.ఇందులో మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.క్రైం కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.ఇప్పటికే అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో F2, F3 చిత్రాలు వచ్చి విజయం సాధించగా, ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.అయితే సంక్రాంతికి పోటీలో ఇప్పటికే బాలకృష్ణ డాకు మహరాజ్,రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ తలపడుతున్నాయి. #SankranthikiVasthunam on 14th January, 2025 🤗❤️#సంక్రాంతికివస్తున్నాం @AnilRavipudi@Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna #SameerReddy #Tammiraju @prakash3933 @SVC_official pic.twitter.com/Wc2BmTjqCZ— Venkatesh Daggubati (@VenkyMama) November 20, 2024

Read More