Author: admin

చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ శుభారంభం చేసింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ పై విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అనుపమ 21-17, 8-21, 22-20తో 15వ ర్యాంకర్ అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ పై గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 50వ స్థానంలో ఉన్న అనుపమ 48 నిమిషాల్లో ప్రత్యర్థిపై గెలిచి అదరగొట్టింది. మరో మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ 10-21, 18-21తో జపాన్ కు చెందిన తొమొక మియజాకి చేతిలో పరాజయం చెందింది. మిక్స్డ్ డబుల్స్ సుమీత్ రెడ్డి- సిక్కిరెడ్డి ద్వయం ప్రిక్వార్టర్స్ చేరుకుంది. తొలి రౌండ్లో సుమీత్- సిక్కి జోడీ 23-21, 17-21, 21-17తో అమెరికా జోడీ ప్రెస్లీ స్మిత్- జెనీ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రియాన్షు రజావత్ 24-22, 13-21, 18-21తో ఇండోనేషియాకు చెందిన చికో…

Read More

త‌న సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అయిన‌ప్పుడు తాను ఏడ్చాన‌ని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తెలిపారు.తాజాగా జ‌రిగిన స‌మిట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.’ఒకానొక సమయంలో.. నా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోవడంతో బాత్‌రూమ్ కూర్చొని ఏడ్చేవాడిని.ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడిని.మళ్లీ ఆ బాధ నుంచి నేనే బయటకు వచ్చా.ప్రపంచం మనకు వ్యతిరేకం కాదు.ఎవరి కుట్ర వల్లనో నా సినిమాలు ఆడకపోవడం కాదు.. నేనే ప్రేక్షకులకు కనెక్ట్‌కాలేకపోయా.ఇది నా తప్పే అని గ్రహించనని తెలిపారు. స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు ఇత‌రుల‌ను నిందించ‌వ‌ద్ద‌న్నారు.నాకే ఇలా జ‌రుగుతుంద‌ని బాధ‌ప‌డొద్దు.వాటి నుంచి ఎన్నో విష‌యాలు నేర్చుకుని విజ‌యాలు అందుకోవాల‌ని తెలిపారు. ప‌ఠాన్‌కు ముందు షారుక్ వ‌రుస ప‌రాజ‌యాలు అందుకున్న విష‌యం తెలిసిందే.జీరో, ఫ్యాన్‌, రాయిస్ వంటి సినిమాలు అట్ల‌ర్ ఫ్లాప్ అయ్యాయి.

Read More

న‌య‌న‌తార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్నడాక్యుమెంట‌రీ ఫిల్మ్ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’. నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దీనిని జాన్వీక‌పూర్ వీక్షించారు. ఇది అద్భుతంగా ఉంద‌ని రివ్యూ ఇచ్చారు. ‘లేడీ సూప‌ర్‌స్టార్‌ను ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూడటం కంటే స్ఫూర్తినిచ్చేది ఇంకేదీ లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై న‌య‌న‌తార ఆనందం వ్య‌క్తం చేశారు. మా డాక్యుమెంట‌రీ మీకు న‌చ్చినందుకు చాలా హ్యాపీగా ఉంద‌ని చెప్పారు.

Read More

కుటుంబ‌,ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారాన్ని బ్యాంకులో తాక‌ట్టు పెడుతుంటాం.మ‌న‌కు కావాల్సినంత రుణాలు తెచ్చుకుంటాం.గోల్డ్ లోన్స్‌ను ప్ర‌తి ఒక్క సామాన్యుడు ఎంత‌గానో నమ్ముతుంటాడు.త‌మ బంగారాన్ని బ్యాంకుల్లో దాచి పెడుతుంటాడు.ఈ రుణాల‌ను ప్రస్తుతానికి వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు.అయితే త్వరలోనే బంగారం రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం.ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు,వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగుచూశాయి. వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది.ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ ఇటీవల తమ సర్క్యులర్‌లో వెల్లడించినట్లు సంబంధిత కథనాలు పేర్కొన్నాయి.

Read More

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్‌ 25, డిసెంబర్‌ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం – కొల్లాం మధ్య (రైలు నం.07145) ; నవంబర్‌ 20, 27, డిసెంబర్‌ 4, 11, 18 మధ్య కొల్లాం- మచిలీపట్నం (రైలు నం.07146) మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు వెల్ల‌డించింది. SCR runs Sabarimala special trains @drmvijayawada pic.twitter.com/0cMZZdk2dt— South Central Railway (@SCRailwayIndia) November 19, 2024

Read More

ప్ర‌స్తుత రోజుల్లో మ‌హిళ‌ల‌ను ఎక్కువ‌గా ఇబ్బందిపెట్టే ఆరోగ్య స‌మ‌స్య థైరాయిడ్. ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్‌.. లావుగా మార‌డం లేదా స‌న్న‌గా కావ‌డం ఇలా అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తోంది. హ‌ర్మొన్ల స‌మ‌స్యల వ‌ల్లే ఇది త‌లెత్తుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. దీనిని ఎలా గుర్తించ‌వ‌చ్చు, ఒకవేళ థైరాయిడ్ వ‌స్తే ఎలాంటి ఆహారం తినొచ్చు అనే విష‌యాన్ని తెలుసుకుందాం..! థైరాయిడ్ రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి హైపో థైరాయిడ్‌, మ‌రొక‌టి హైప‌ర్ థైరాయిడ్‌. ఆక‌లి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేకపోవడం.. వంటివి కనిపిస్తే దానిని ‘హైపో థైరాయిడిజం. సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వ‌స్తే…

Read More

అదృశ్యమైన మహిళలు, అమ్మాయిల ఆచూకీ తెలుసుకున్న పోలీసులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎన్టీఆర్ జిల్లాలో అదృశ్యమైన 18 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవాడ ప్రత్యేక విచారణ విభాగం టీమ్ పోలీసులు గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు కమిషనర్ ఎస్ వీ రాజశేఖర్ బాబు దీనికి సంబంధించి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ వైసీపీ హయాంలో 30 వేల మందికి పైగా మహిళలు, అమ్మాయిలు అదృశ్యమయ్యారు. దీనిపై గత ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిభద్రతలు కాపాడుతామని.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటించిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు. అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకున్న విజయవాడ పోలీసులు, హోం శాఖకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు పూర్తి…

Read More

రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్లపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని ఇప్పుడు రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నట్లు తెలిపారు. మన వద్ద డబ్బుల్లేవని అయితే మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని అన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామం నుండి మండల కేంద్రానికి ఎక్కడా టోల్ ఫీజు ఉండదని…

Read More

జీ20 స‌ద‌స్సులో భాగంగా వివిధ దేశాల‌కు చెందిన అగ్ర నేత‌ల‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భేటీ అయ్యారు.దేశ‌ ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో జరిగిన సమావేశంలో మోదీ కోరారు.వారితో పాటు పన్ను ఎగవేత,మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌ భండారీని కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. త‌ప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్‌ మోదీ మోసగించిన విష‌యం తెలిసిందే.దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది.2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.మ‌రోవైపు విజయ్‌ మాల్యా భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశాడు.లిక్కర్‌ కింగ్‌ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడ‌ని .. భార‌త్‌ను వీడి విదేశాల‌కు పారిపోయాడ‌ని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన విష‌యం తెలిసిందే.

Read More

గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా అఘోరి హల్‌చల్ సృష్టించారు. స్థానికుల‌పై త్రిశూలంతో దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ప‌లువురికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆమెను స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు. కొంత‌సేప‌టి త‌ర్వాత విడిచిపెట్టేశారు. ఈ విష‌యంపై పోలీసులు మీడియాతో మాట్లాడారు. ‘సుమారు 25 ఏళ్ల మహిళా అఘోరి పట్టణ శివార్లలో ఉన్న కార్‌వాష్‌ వద్దకు వచ్చి వాహనాన్ని శుభ్రం చేయాలని కోరారు.ఈలోగా స్థానికులు ఆమెను చూసేందుకు రాగా పోలీసులు చేరుకున్నారు.సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసేందుకు ప్రయత్నించిన పలువురిపై ఆమె త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు’ అని పోలీసులు తెలిపారు.

Read More