Author: admin

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో నేడు సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని వెన్నెముక అని ఈసందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కలిగే లాభాలను వివరించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లుగా భావించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకు నీరు అందించినట్లు తెలిపారు. నీటి సంరక్షణకు చర్యలు తీసుకుందామని అదే విధంగా సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. పట్టిసీమను సంవత్సరంలో పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు అందించినట్లు తెలిపారు‌.ఓకే రోజులో 32 వేల క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేశాం. గతంలో 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో…

Read More

ఎయిరిండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. థాయ్‌లాండ్ నుంచి దిల్లీ బ‌య‌లు దేరిన‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుపోయారు. 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబరు 16న థాయ్‌లాండ్‌ నుంచి ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో చిక్కుకుపోయారు. దీనిపై ఎయిర్‌లైన్స్ సంబంధిత వ‌ర్గాలు స్పందించాయి. ఇప్ప‌టికే కొంత‌మందిని గ‌మ్యస్ధానానికి చేర్చామ‌ని పేర్కొన్నాయి. కేవ‌లం 40 మంది మాత్ర‌మే ప్ర‌స్తుతం ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నార‌ని.. వారి ప్ర‌యాణానికి ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపాయి.

Read More

కోలీవుడ్ న‌టుడు విజ‌య్ గ‌త కొన్నిరోజులుగా రాజ‌కీయాల్లో బిజీ అయిన విష‌యం తెలిసిందే. హెచ్.వినోద్‌తో చేస్తోన్న చిత్రం (విజ‌య్ 69) పూర్తైన త‌ర్వాత ఆయ‌న సినిమాల్లో యాక్ట్ చేయ‌ర‌ని ఎప్ప‌టినుంచో టాక్‌.తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం బాలయ్య సినిమా రీమేక్ అని తెలుస్తోంది. బాల‌య్య ఇటీవల విజయం సాధించిన చిత్రంలో ఒక‌టైన భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గా విజ‌య్ చిత్రం రూపుదిద్దుకుంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.కాజ‌ల్ పాత్ర‌లో పూజాహెగ్డే, శ్రీ‌లీల పాత్ర‌లో మ‌మ‌త బీజు న‌టిస్తున్నార‌ని సమాచారం. రాజ‌కీయాల్లోకి వెళ్లాక కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే బాగుండదు అని విజయ భావిస్తున్నారని తెలుస్తుంది. ఏదైనా సందేశం ఉన్న చిత్రం అయితే బాగుంటుంద‌ని,అందుకే ఈ రీమేక్‌లో నటిస్తున్నాడు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.అయితే విజ‌య్ రీమేక్స్‌లో యాక్ఠ్ చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ తెలుగులో వ‌చ్చిన ప‌విత్ర బంధం, పెళ్లి సంద‌డి,త‌మ్ముడు,చిరున‌వ్వుతో,నువ్వు నాకు న‌చ్చావ్‌,పోకిరి వంటి చిత్రాల త‌మిళ రీమేక్స్‌లో నటించాడు.

Read More

అల్లు అర్జున్ కథానాయకుడిగా న‌టించిన పుష్ప ది రూల్ విడుద‌ల‌కు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అత్యంత వేగంగా 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మ‌రో రికార్డు అందుకుంది. యూఎస్‌ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు.ఆన్‌లైన్ వేదిక‌గా త‌మ ఆనందాన్ని తెలియ‌జేస్తూ ర‌చ్చ లేపుతున్నారు.

Read More

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు లింగ సమానత్వంపై ప్రచారంలో భాగ‌మయ్యారు. ‘మార్డ్‌’ (Men Against Rape and Discrimination) అనే సామాజిక కార్యక్రమంలో బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్‌తో ఆయ‌న చేతులు క‌లిపారు. ఈవిష‌యాన్ని తెలియ‌జేస్తూ తాజాగా ఆయ‌న ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘గౌరవం, సానుభూతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడండి. ప్రతి పనిలోనూ దయను చూసేవాడు అసలైన మ‌గాడు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు నాతో పాటు మీరూ మార్డ్‌లో చేరండి’ అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. Respect, empathy, and strength of character are the real traits of a man. He who stands for equality, and brings kindness into his every action is a #RealMard. This #InternationalMensDay, join me in my commitment with @MardOfficial to…

Read More

వరుస సెషన్ల నష్టాల నుండి కోలుకుని నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ను ముగించాయి. కొనుగోళ్ల జోరుతో మొదట లాభాలతో దూసుకెళ్లిన సూచీలు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు మదుపర్ల అమ్మకాలతో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెషన్ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు జోరు తగ్గింది.బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 78,451 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలతో 239 పాయింట్ల లాభంతో 77,578 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.42గా ఉంది.మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్.డి‌ఎఫ్.సి బ్యాంక్, సన్ ఫార్మా, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Read More

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం దాదాపు మూడేళ్లు పూర్తయింది.అయితే ఈ యుద్ధంలో రష్యాకు పెద్ద మొత్తంలో ఉత్తర కొరియా సైనిక సాయం అందిస్తోంది.తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజవనరులు, జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ భేటీ అయ్యాడు.ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది.కాగా ఇది స్నేహపూర్వకమైన సమావేశంగా వార్తా సంస్థ వెల్లడించింది.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై వీరు చర్చించుకున్నారని వెల్లడించారు.మరోవైపు రష్యన్ మిలిటరీ అకాడెమీ ప్రతినిధులు కూడా ఉత్తర కొరియాలో పర్యటించినట్టు తెలుస్తుంది.

Read More

యువ కథానాయకుడు విశ్వక్ సేన్- మీనాక్షి చౌదర జంటగా “మెకానిక్ రాకి” అనే చిత్రాన్ని దర్శకుడు రవితేజ ముల్లపూడి రూపొందిస్తున్నాడు.ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈనెల 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది.ఈ ట్రైలర్ లో ఎమోషన్స్ సన్ని వేశాలతో పాటుగా పలు డైలాగులతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ఆకట్టుకునేలా చూపించారు.అయితే ఈ చిత్రం కథ మొత్తం మెకానిక్ షాప్ స్థలం కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది.ఇందులో విశ్వక్ సేన్ తండ్రిగా వికే.నరేష్ నటించారు. విశ్వక్ సేన్ మరోసారి మాస్ డైలాగులు ఆకట్టుకున్నాడు. మీనాక్షి చౌదరి , శ్రద్ధ శ్రీనాథ్, విశ్వక్సేన్ మధ్య సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇందులో విలన్ గా సునీల్ నటిస్తున్నాడు.ఈ చిత్రానికి జెక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నాడు.మొత్తానికి మెకానిక్ రాఖీ సినిమాతో విశ్వక్ సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నారని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎస్ఆర్.టి ఎంటర్టైన్మెంట్…

Read More

ఈరోజు మాజీ సీఎం,పులివెందుల ఎమ్మెల్యే జగన్ విజయవాడలో పర్యటించనున్నారు.విజయవాడ గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్ లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని జగన్ సందర్శించనున్నారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలవనున్నారు.ఈ మేరకు వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.

Read More

ఈరోజు ఉదయం 8.00 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) రికార్డుస్థాయిలో 484కి చేరింది.ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రికార్డు.ఢిల్లీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ 500 మార్కును దాటింది.దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా సుప్రీంకోర్టు వర్చువల్‌గా విచారణ చేపట్టనుంది అని తెలుస్తుంది.కాగా వర్చువల్‌గా వాదనలు వినిపించేందుకు అనుమతించాలని న్యాయమూర్తులందరూ కోరినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు.ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని సుప్రీంకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సిబిఎ) అధ్యక్షుడు కపిల్‌ సిబల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సిజెఐ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, గోపాల్‌ శంకరనారాయణన్‌లతో సహా పలువురు న్యాయవాదులు కపిల్ సిబాల్ కు మద్దతు తెలిపారు.ఈ మేరకు ఏ కేసులోనైనా సరే న్యాయవాదులు సాధ్యమైన చోట్ల వర్చువల్‌గా తమ వాదనలు వినిపించవచ్చని…

Read More