Author: admin

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులలో జో బైడెన్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఈ యుద్ధంలో “గేమ్ ఛేంజర్’ గా అభివర్ణించారు. రష్యాపై దాడికి అమెరికా తయారుచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను తాము ప్రయోగిస్తే ఉక్రెయిన్ కు కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య యుద్ధం 1000వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన యూఎన్ భద్రతా మండలి సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు తాము అందిస్తున్న ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ రష్యా భూభాగంపై…

Read More

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ నటించడం కాకుండా , స్వీయ దర్శకత్వంలో “ఎమర్జెన్సీ” అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇందులో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రముఖంగా చూపించనున్నారు.ఈ చిత్రం ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుండి చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్‌ బోర్డుకు లేఖ కూడా రాసింది.దీనితో సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యకతం చేసింది.అయితే సెన్సార్‌ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. ఎమర్జెన్సీ చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు కూడా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు…

Read More

2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2022–23తో పోలిస్తే.. జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల కనిపించింది. తలసరి ఆదాయం 1.21% తక్కువ కాగా.. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలదీ నేలచూపే కావడం గమనార్హం. సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల కనిపించింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2019-24 మధ్య వైసీపీ హయాంలో జీఎస్ఓపీ, తలసరి ఆదాయం సహా వ్యవసాయం, సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 2022-23 సంవత్సరంతో చూసినా 2023-24లో వృద్ధి రేటులో తగ్గుదల కనిపించింది. 2022-23లో జీఎస్డీపీ వృద్ధి 13.5% ఉండగా.. 2023- 24లో ముందస్తు అంచనాల మేరకు ఇది 10.4% మాత్రమే. తలసరి ఆదాయంలోనూ వృద్ధి 11.49% నుండి 10.28%కి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 22 లక్షల టన్నులు తగ్గింది. వ్యవసాయంలో వృద్ధి రేటు భారీగా తగ్గింది. వ్యవసాయం 2014-19లో 16.6శాతం కాగా, 2019-24లో 10.5…

Read More

అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి జంటగా ‘తండేల్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు.’బుజ్జి తల్లి’ అనే పాటను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఓ చైతన్య- సాయిపల్లవి ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు.’తండేల్ రాజు బుల్లితల్లికి ప్రేమతో’ ఈ లవ్ ట్రాక్ 2024లోనే సాంగ్ ఆఫ్ ది ఇయర్​ కానుంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. A piece of Raju's heart in a song #BujjiThalli from 21st November #Thandel #ThandelonFeb7th pic.twitter.com/6FxaS62mUN— chaitanya akkineni (@chay_akkineni) November 18, 2024

Read More

ఝార్ఖండ్‌,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.రేపు మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఝార్ఖండ్‌ రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మహారాష్ట్ర 288 స్థానాల‌కుగాను మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు.వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.కాగా మహారాష్ట్రలో 9,63,69,410 మంది ఓటర్లు ఉన్నారు.అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఝార్ఖండ్‌లోని 38 నియోజకవర్గాల్లో రెండో విడత ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది.రెండో విడతలో 38 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.అయితే 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా బలగాలను…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యంకు తోడు పొగమంచు కూడా ఉండడం కారణంగా ఎయిర్ క్వాలిటీ అత్యంత తీవ్రస్థాయికి పడిపోయింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఒక టేబుల్ ను పోస్ట్ చేశారు. “ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. రెండో అత్యంత కాలుష్య నగరం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు. నవంబరు నుండి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదని ఇక మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే…

Read More

మరొక కీలక ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం సఫలమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుండి తాజాగా ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించినిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఇస్రో వాణిజ్య విభాగం ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’ ద్వారా చేపట్టిన జీశాట్-20 ప్రయోగం అత్యంత కీలకమైనదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 4,700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం పూర్తి వాణిజ్య అవసరాలకు సంబంధించినది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించవచ్చు. అలాగే విమానాల్లో ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలను వైఫై సౌకర్యాన్ని కల్పించవచ్చు. ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య మొదటి భాగస్వామ్యం ఇదేనని తెలిపారు.

Read More

పర్చూరు శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రతిష్టాత్మక బ్రిటన్ పార్లిమెంట్ విజనరీ లీడర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.’విజనరీ లీడర్’ అవార్డు సాధించిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి అభినందనలు. ప్రజలలో ఒకరిగా ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నిత్య కృషీవలుడికి సముచిత గౌరవం దక్కడం ఆనందదాయకమని టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఏలూరికి ఈ అవార్డు రావడం పట్ల తెలుగు దేశం శ్రేణులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.ఈ మేరకు ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ అంశంలో భాగంగానే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటి అయ్యారు.నా స్నేహితుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందనీ ప్రధాని అన్నారు.భారత్, ఫ్రాన్స్లు అంతరిక్షం, ఎనర్జీ, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించామని తెలిపారు.ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు కృషి చేస్తాం అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్ ను ప్రధాని ప్రశంసించారు.ఈ సమావేశం భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.బ్రెజిల్లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. It is always a matter of…

Read More

భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు.ఈ ప్రతిష్టాత్మక పదవికి నియమితులైన మొదటి తెలుగు వ్యక్తి ఆయనే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను 15వ కాగ్ జనరల్ గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన గిరీశ్చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం లభించింది. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి అవకాశం ఉంది. 1964 డిసెంబరు 24న జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికై, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం…

Read More