Author: admin

‘హనుమాన్‌’తో స్టార్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ.ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ఇండస్ట్రీలోకి రాకముందే 33 కథలు రాసుకున్నా.ఇప్పటివరకు తీసిన సినిమాలకు,వాటికి సంబంధం లేదు. ఇవి కొత్తవి నాకు కథలు రాయడం చాలా ఇష్టం.అవకాశమిస్తే దర్శకత్వం మానేసి వేరే దర్శకుల కోసం కథలు రాయడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా’’ అని చెప్పారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.అశోక్‌ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’చిత్రానికి కథ అందించింది ప్రశాంత్‌ వర్మనే కావడం విశేషం.నవంబర్‌ 22న ఇది విడుదల కానుంది.

Read More

‘అమ్ము’తో తెలుగువారికి చేరువైన నటి ఐశ్వర్య లక్ష్మి.తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు.యుక్త వయసులో తనకు కూడా అందరి అమ్మాయిల మాదిరిగానే పెళ్లిపై ఎన్నో మంచి ఆలోచనలు ఉండేవని అన్నారు.పెళ్లి చేసుకుని స్థిరపడాలని ఎన్నో కలలు కన్నట్లు చెప్పారు. ‘‘జీవితంలో పెళ్లి చేసుకోవాలని లేదు.ఎంతో ఆలోచించి తీసుకున్న ఈనిర్ణయం తీసుకున్నా.నాకు తెలిసిన చాలా మంది పెళ్లి తర్వాత రాజీ పడి బతుకుతున్నారు.పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు.అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యా’’ అని అన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Read More

గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా ఆ వ్యవస్థ మనుగడలో లేదన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తాము ప్రయత్నించినట్లు వివరించారు. అయితే ఆ వ్యవస్థ లేదని ఇంకా లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి? అని ప్రశ్నించారు. వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్లమని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు నుండి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదు. వారికి సంబంధించి గత ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లమని చెప్పారు. మే నెల వరకు వాలంటీర్లకు వేతనాలు…

Read More

తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని వాటిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఎక్స్ వేదికగా నేడు పోస్ట్ పెట్టింది. ఈ సంవత్సరం విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయని ముఖ్యంగా ‘ఇండియన్ 2’, ‘వేట్టయన్’, ‘కంగువా’ చిత్ర ఫలితాలపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే విశ్లేషణలు ఎంతో ప్రభావం చూపిందని చిత్ర పరిశ్రమకు రానురాను ఇదొక సమస్యగా మారుతోందని దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని సూచించింది. పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్ ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని పేర్కొంది. మొదటి రోజు మొదటి షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని అదే…

Read More

భారతీయులు వీలైనంత ఎక్కువ మంది అమెరికాలో చదువుకునేందుకు, నివసించేందుకు వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రామే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లేదా విజయవాడ లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆమె ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్ మెక్ లారెన్తో కలసి తాజాగా విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. 2023-24 నాటికి 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారేనని వివరించారు. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులున్నారు. ఈ వేసవి సీజన్లో హైదరాబాద్లో 47 వేలకు పైగా స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాం. దేశంలోని ఢిల్లీ రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్ కతాలతో పోలిస్తే హైదరాబాద్ కాన్సుల్…

Read More

రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం కాజేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. టిడ్కోలో గత ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.25 వేలు తిరిగి ఇస్తామని గొప్పలు చెప్పిందని ఇళ్ల లబ్ధిదారులకు గత ప్రభుత్వం బకాయిల జాబితా పెరుగుతూనే పోయిందని లెక్కా పక్కా లేకుండా తమకు అనువైన బిల్లులే పేర్కొంటూ వచ్చారన్నారు. ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం బకాయిలు రూ.7 వేల కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పారు. అయితే తాము లెక్కలు చూస్తే రూ.1,14,000 కోట్లుగా తేలిందన్నారు. సీఏజీకి ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పులు రూ.4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ బకాయిలు రూ.36 వేల కోట్లు అని పేర్కొన్నారు. రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి శాసన సభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు…

Read More

గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదని డిప్యూటీ సీఎం పవన్ విమర్శించారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయిందని ఆక్షేపించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్చమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ నియోజకవర్గంలో రంగు మారిన నీటి సరఫరా సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. రూ.3.3 కోట్లు నిధులు ఇందుకు వ్యయం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం…

Read More

రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 5నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైందని పేర్కొన్నారు. అయిదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే తాను చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయని లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్న ఆనాడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని మిట్టల్, రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ, టిసిఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వరుసకట్టాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపిబి) సమావేశంలో రూ. 85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రీస్టార్ట్…

Read More

ఈ డేవిస్ కప్ కెరీర్లో తన చివరి టోర్నీ అని ప్రకటించిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తీవ్ర భావోద్వేగాల మధ్య టోర్నీ బరిలోకి దిగాడు. కాగా, తొలి సింగిల్స్ మ్యాచ్ లో పరాజయం చెందాడు. నాదల్ 4-6, 4-6తో నెదర్లాండ్స్ కు చెందిన జాండీల్స్ చేతిలో పోరాడి ఓడాడు. దీంతో స్పెయిన్ 0-1తో వెనుకబడింది. ఈ మ్యాచ్ లో స్పెయిన్ గెలిస్తే నాదల్ మళ్లీ అడే అవకాశం లభిస్తుంది. లేదంటే అతడి కెరీర్ కు తెరపడుతుంది.క్లే కింగ్ గా పేరున్న నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేతగా రెండు దశాబ్దాల పాటు అభిమానులను అలరిస్తూ యోధుడుగా నిలిచాడు.

Read More

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత అమ్మాయిల హాకీ జట్టు టైటిల్ వైపు దూసుకెళ్లింది.ఆద్యంతం జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరింది. తాజాగా భారత జట్టు 2-0తో జపాన్ పై గెలిచి సత్తా చాటింది.ఈ మ్యాచ్ ఆరంభం నుండి రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ తొలి రెండు క్వార్టర్స్ లో ఒక్క గోల్ కూడా రాలేదు. 48వ నిమిషంలో భారత్ అధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీ స్ట్రోక్ ను సద్వినియోగం చేస్తూ కౌర్ స్కోర్ చేసింది. మరో నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా లాల్రెమ్సయామి (56వ) ఫీల్డ్ గోల్ సాధించి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. నేడు టైటిల్ పోరులో చైనాతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడిన సలీమా బృందం అన్నింట్లోనూ విజయం సాధించింది. మరో సెమీస్ లో చైనా 3-1తో మలేసియాను పై విజయం సాధించింది.

Read More