Author: admin

వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో రూ.1.29లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి రవికుమార్ విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా అప్పటి ప్రభుత్వం వినలేదని దీని వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్నా పట్టించుకోలేదని విమర్శించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మాట్లాడారు. విద్యుత్ వ్యవస్థను తిరిగి సరైన దారిలో పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Read More

అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ “పుష్ప 2” ట్రైలర్ తాజాగా విడుదలై నెటింట్లో రికార్డులపరంగా విధ్వంసం స్పష్టిస్తుంది.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టింది.యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 40 మిలియన్ల వీక్షణలను చేరుకుంది.1.4 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది.అద్భుతమైన విజువల్స్,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో విడుదలైన ఈ ట్రైలర్ నెటింట్లో అదరగొడుతోంది. నిన్న “పుష్ప 2: ది రూల్” చిత్ర ట్రైలర్ ను నిర్మాతలు బీహార్‌లోని పాట్నాలో విడుదల చేశారు.తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో డ్రామా, మిస్టరీ, యాక్షన్, మ్యూజిక్, రొమాన్స్, కల్చర్ వంటి అన్ని అంశాలను డైరెక్టర్ సుకుమార్ చూపించాడు.పుష్ప: ది రైజ్‌లో తక్కువ స్క్రీన్ టైం ఉన్న నటుడు ఫహద్ ఫాసిల్, పుష్ప: ది రూల్‌లో ఎక్కువ టైంలో కనిపించనున్నట్లు సమాచారం.పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని డిసెంబర్…

Read More

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి ఇండియన్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని రిషభ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ మేరకు చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1′ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.’కాంతార చాప్టర్ 1′ విడుదల తేదీ ప్రకటించిన పోస్టర్ లో రిషబ్ శెట్టి విభిన్నంగా కనిపించారు.ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గొడ్డలి పట్టుకొని లెజెండ్గా కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. కాగా హోంబలే ఫిల్మ్స్ హై-క్యాలిబర్, బిగెస్ట్ ప్రాజెక్ట్స్ తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.హోంబాలే ఫిల్మ్స్ లో వచ్చిన కాంతార వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.తెలుగులో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.రిషభ్ శెట్టి ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు.’కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం…

Read More

9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని సత్య ప్రసాద్ విమర్శించారు. నేడు శాసన సభ సమావేశాలలో భాగంగా ఆయన ప్రసంగించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని తెలిపారు. భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవని.. తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More

అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదని, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశాడు.గోద్రా అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన ‘సబర్మతి రిపోర్ట్’చిత్రం ను ఉద్దేశించి ప్రధాని lఈ వ్యాఖ్యలు చేశారు.చిత్రబృందాన్ని మోదీ అభినందించారు.నిజం బయటకు రావడం చాలా మంచి విషయం,అది కూడా సామాన్యులకు తెలిసే పద్ధతిలో చూపించడం మంచి ప్రయత్నమని కొనియాడారు.ఈ మేరకు అలోక్ భట్ ట్వీట్ ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు.గత శుక్రవారం ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది.గోద్రా అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో విక్రాంత్ మాసే నటించారు.గోద్రా రైల్వే స్టేషన్ లో ట్రైన్ కు నిప్పు పెట్టడంతో 59 మంది సజీవదహనం కావడం,దీనితో గుజరాత్ లో అల్లర్లు చెలరేగడం తదితర సంఘటనలను ఇందులో చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఈ ఘటనలకు సంబంధించి ఈ చిత్రంలో కొత్త విషయాలను చూపించినట్లు చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రానికి ధీరజ్ శర్మ దర్శకత్వం…

Read More

గత ప్రభుత్వ పనితీరుపై ఏపీ హోం మంత్రి అనిత మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఐదో రోజు శాసనమండలి సమావేశాల్లో మంత్రి ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ”పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని అయితే అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. దిశ చట్టానికి చట్టబద్దత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ యాప్ తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైసీపీ…

Read More

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది.మోడీకి నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైజర్‌’ అవార్డును అందించి సత్కరించింది.ఈ అవార్డును అందుకున్న విదేశీయుల్లో మోదీ కంటే ముందు క్వీన్‌ ఎలిజబెత్‌ మాత్రమే ఉండటం విశేషం.దీనితో భారత ప్రధానికి విదేశాల నుండి వచ్చిన పురస్కారాల సంఖ్య 17కు చేరింది.కాగా ప్రధాని మోడీ నైజీరియా పర్యటన ముగించుకుని…ప్రస్తుతం బ్రెజిల్ లో పర్యటిస్తున్నారు.

Read More

దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజు గాలి నాణ్యత క్షీణిస్తున్న మేరకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని యోచిస్తోంది.ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు నుండి అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది.దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ వెల్లడించారు. నేటి నుండి అమలు కానున్న నిబందనలు ఇవి 1.ఢిల్లీలోకి నిత్యవసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహాయించి, మిగిలిన వాటికి ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్,బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి.ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం.…

Read More

రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుందని వివరించారు. సులభంగా రైతులకు అర్థమయ్యే విధంగా వాట్సాప్ సేవలు కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగో ఆ వీడియోలో పొందుపరిచారు.ఇది మంచి ప్రభుత్వం… రైతుల మేలు కోరే ప్రభుత్వం! అని మనోహర్ పేర్కొన్నారు.

Read More