Author: admin

మరికొద్ది రోజుల్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. ఈనేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ పొగడ్తలుకురిపించాడు. అతను చాలా తెలివైన బౌలరని, అతడి నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు. అశ్విన్ గొప్ప బౌలర్ అని దాదాపు తన కెరీర్ అంతా అతడితో తలపడ్డట్లు లైయన్ పేర్కొన్నాడు. అతడి నుంచి చాలా నేర్చుకున్నా. అశ్విన్ చాలా తెలివైన బౌలర్. పరిస్థితులకు చాలా త్వరగా అలవాటుపడతాడు. అత్యుత్తమ బౌలర్లే అలా చేయగలుగుతారని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ తన నైపుణ్యంతో తాను లాభపడడమే కాకి జట్టుకూ లాభాన్ని చేకూర్చాడని ప్రశంసించాడు. 2020/21లో అతడే అత్యుత్తమ బౌలర్ అని లైయన్ పొగడ్తలుకురిపించాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం పర్యటించడం అశ్విన్ కు ఇది అయిదోసారి. అక్కడ అతడు 10 టెస్టుల్లో 39 వికెట్లు పడగొట్టాడు.ఒకే ఏడాదిలో అరంగేట్రం చేసిన అశ్విన్, లైయన్ బోర్డర్-గావస్కర్ సిరీస్లో మొత్తం ఎనిమిదిసార్లు తలపడ్డారు.…

Read More

భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో పునరాగమనం చేయన్నారు. గాయం కారణంగా ఆటకు దూరమైన ఈ సూపర్ జోడి మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్నారు. సాత్విక్ భుజానికి గాయంతో పారిస్ ఒలింపిక్స్ అనంతరం ఈ జోడీ బరిలో దిగలేదు. గాయం నుంచి సాత్విక్ పూర్తిగా కోలుకోవడంతో నేటి నుండి ప్రారంభంకానున్న చైనా మాస్టర్స్లో భారత జోడీ బరిలోకి రానుంది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన లీ హ్యూ- యాంగ్ సువాన్ డబుల్స్ తో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ జోడీ తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మలేషియాకు చెందిన లీ జియా తో లక్ష్యసేన్, ఇండోనేసియాకు చెందిన చికో వార్డోయో తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్లో బుసానన్తో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, డెన్మార్క్ కు చెందిన లైన్ హోజ్మార్క్…

Read More

తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హార్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్న పవన్ ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగర ప్రజల ఆకాంక్షను టిటిడి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టిటిడి పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బి. ఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామలరావుకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు,పలు హింసాత్మక నేరాలలో ప్రమేయం ఉన్నందున అన్మోల్ బిష్ణోయ్పై రెండు వారాల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. కాగా ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ అరెస్టును ధృవీకరించగా.. ముంబై, ఢిల్లీ పోలీసులు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సిద్ధూ హత్య అనంతరం నకిలీ పాస్పోర్ట్లో భారతదేశం నుండి పారిపోయిన బిష్ణోయ్ కెనడాలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తుంది.

Read More

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం  కన్నప్ప.ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు .ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రతి సోమవారం ఓ అప్ డేట్ ఇస్తామని మంచు విష్ణు  గతంలోనే ప్రకటించారు.ఈ మేరకు ఈరోజు ఆసక్తికరమైన పోస్టర్ ను తన ట్వీటర్ అకౌంట్ నుండి  పోస్ట్ చేసాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరును అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే మోహన్ బాబు ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. పూర్తి లుక్ ను నవంబరు 22న రివీల్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. https://x.com/iVishnuManchu/status/1858378558198239371?t=qCRUZuw0fh4GPfiWzGc8LA&s=19

Read More

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. శాసనమండలిలో నేడు జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ… లేదు లేదు కూటమి అధికారంలో వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ.. మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే.. మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుందని విమర్శించారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని వైసీపీ, టీడీపీలు రెండు దొందు దొందే. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్పా అమలుకు నోచుకోలేదు. నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై…

Read More

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో భాగంగా ఏడు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు- 2024, ఎన్టీఆర్ హెల్ వర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. వీటితోపాటు ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు-2024నూ శాసనసభ ఆమోదించింది. 

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఇక టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయించడం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి…

Read More

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అమ్మకాల ఒత్తిడితో నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ స్టాక్స్ మార్కెట్ జోరును తగ్గించాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయింది. అయితే తిరిగి కాస్త కోలుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 23,450 వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఉదయం 77,863 లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ 84.40గా ఉంది.

Read More

సంఘ సంస్కర్త, కవి గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ గురు కనకదాస జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కర్ణాటకలో జన్మించిన శ్రీశ్రీశ్రీ గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త. బీసీలను, వారి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం గుర్తు చేసిన మహనీయుడని అన్నారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఆయన ఎన్నో ఏళ్ల కిందట చేసిన బోధనలు ఈనాటి సమాజానికి కూడా మార్గదర్శనం చేస్తున్నాయంటే ఆ మహనీయుడి దార్శనికతను మనం అర్ధం చేసుకోవచ్చు. శ్రీశ్రీశ్రీ గురు కనకదాస బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర…

Read More