మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధిపథంలో పయనించాలన్నా.. ఈ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు ప్రజలకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్నా మహాయుతి కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈసందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తేనే మహారాష్ట్ర రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. రెండు రోజులుగా మరట్వాడ, విదర్భ, మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించానని, ఓట్లు అడగటానికి ఈ ప్రాంతానికి రాలేదని మహారాష్ట్ర అభివృద్ధిలో మన వంతు సాయం అందించాలని ఆకాంక్షతో వచ్చానని అన్నారు. మహారాష్ట్రలో దాదాపు కోటి మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. తెలుగు ప్రజలకు వినమ్రంగా తెలియజేస్తున్నాను. మన ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదు. ఎవరైతే మహారాష్ట్రను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తారో వారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా…
Author: admin
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో హర్యానా స్టీలర్స్ జట్టు ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుని అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 36-29 తేడాతో తమిళ్ తలైవాస్ పై విజయం సాధించింది. వినయ్ (10), మహమ్మద్రెజా (8) హార్యానా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తలైవాస్ తరపున మొయిన్ (7) రాణించాడు. మ్యాచ్ లో మొదట తడబడినా హార్యానా ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. 14-17తో తొలి అర్ధభాగాన్ని ముగించిన ఆ జట్టు విరామం తర్వాత పాయింట్లతో అదరగొట్టింది. ద్వితీయార్ధంలో దూకుడు ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఇక మరో మ్యాచ్లో జైపూర్ పింక్పాంథర్స్ 30-28 తో పుణెరి పల్టాన్ పై విజయం సాధించింది. Pic source: Haryana steelers twitter
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. లీగ్ దశను అజేయంగా ముగించి ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ తాజాగా తన ఆఖరి లీగ్ మ్యాచ్లో 3-0తో జపాన్ పై విజయం సాధించింది. భారత్ తరపున దీపిక (47వ, 48వ) రెండు గోల్స్ సాధించింది. నవ్ నీత్ (37వ) ఓ గోల్ చేసింది. భారత డిఫెండర్లు మంచి పోరాటం కనబరిచారు. భారత్ అయిదు మ్యాచ్లో 15 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (12 పాయింట్లు) రెండో స్థానంతో ముగించింది. భారత జట్టు సెమీఫైనల్లో జపాన్ తో తలపడనుంది. మరో సెమీస్లో చైనా, మలేసియా ఆడనున్నాయి. భారత స్టార్ స్ట్రైకర్ దీపిక టోర్నీలో ఇప్పటివరకు 10 గోల్స్ తో అదరగొట్టింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ – నాగార్జున ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న కుబేర్.ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్, ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన రావు ఈ నిర్మిస్తున్నారు.ఈరోజు ‘కుబేర’ చిత్రం నుండి గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. డబ్బుకు మానవ సంబంధాలకు ఉన్న సంబంధాన్ని, కుటుంబ భావొద్వేగాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విలక్షణ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ భారీ చిత్రం 2025 జనవరి 10న సంక్రాంతి విడుదల చేయనున్నారు. ‘గేమ్ చేంజర్’ సంబంధించిన చిత్రబృందం టీజర్ ప్రోమోను నిన్న విడుదల చేసింది.అయితే ఈరోజు చిత్రబృందం టీజర్ ను విడుదల చేసింది. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శంకర్ శైలిలో గ్రాండియర్ గా ఉంది. రామ్ చరణ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అలరిస్తున్నాయి. ఇందులో అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్’ వినియోగం ప్రారంభమైంది. ఏపీ నుండి నేడు ఏపీ సీఎం చంద్రబాబు సీ ప్లేన్ పర్యాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుండి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించి, పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అనతికాలంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడాయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం. వినూత్న అవకాశం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టిస్తేనే అదాయం పెరుగుతుంది. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేయాలి. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం…
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తెస్తామని మరో 3-4 నెల్లలో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమి ఘాట్ కు సీ ప్లేన్ చేరుకుంది. ఇందులో సీఎం చంద్రబాబు ప్రయాణం చేయనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణించి సీఎం శ్రీశైలానికి చేరుకోనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొంటున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. INS విక్రాంత్‌లో ‘డే ఎట్ సీ’ సందర్భంగా మిగ్ 29కె టేకాఫ్, ల్యాండింగ్, యుద్ధనౌక, జలాంతర్గామి కార్యకలాపాలు క్షిపణి కాల్పుల డ్రిల్‌లతో సహా అనేక నావికా కార్యకలాపాలను రాష్ట్రపతి వీక్షించారు. ఈసందర్భంగా వాటి గురించి అధికారులు రాష్ట్రపతికి వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకెళ్తున్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ఆయన కైవసం చేసుకున్నారు. వీటితో పాటు మరో ఐదు స్వింగ్ రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక, అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్…
కెనడాలో హిందూ దేవాలయం వద్ద జరిగిన దాడిని ఖండించిన ప్రధాని మోడీ <blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.</p>— Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1853442198575952031?ref_src=twsrc%5Etfw”>November 4, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>