Author: Indu

“బ్లూ లైట్” మధ్య చిక్కుకున్న మానవ నేత్రం ఒకప్పుడు పగటి సమయంలో పనులు చేసుకునే వాళ్లం.. చీకటి పడుతూనే చల్లని చంద్ర కాంతి వెలుగులో నిద్రకు సన్నద్ధమయ్యే వాళ్లం. అది సహజమైన జీవనశైలి…కేవలం సూర్యకాంతిపై ఆధారపడి జీవించేవాళ్లం. సూర్యుడి నుండి వచ్చే సహజసిద్ధ కాంతే మనకు కనిపించే కాంతి…ఒక్క మాటలో చెప్పాలంటే మనిషీ ప్రకృతీ మమేకమై నడిచిన రోజులవి. కానీ ప్రస్తుతం రాత్రికి పూర్తి అర్థం మారిపోయింది. పగలు రేయి తేడా లేదు. వాణిజ్య పరమైన పోటీ, ప్రపంచీకరణ, సాంకేతికంగా వస్తున్న మార్పులతో రాత్రి కూడా పని సమయాలు జీవితాల్లోకి వచ్చేశాయి. ఇందులో భాగంగా మన జీవనశైలి మారిపోయింది. ముఖ్యంగా యువతలో పగటి జీవితం కంటే ఎక్కువగా రాత్రి మెలకువతో ఉంటూ దీనిని ఏదో గొప్ప ఘనతగా చెప్పుకొంటున్నారు కానీ దీనికి మనం చెల్లిస్తున్న మూల్యం కూడా ఎక్కువేనని వైద్యరంగ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. రాత్రి కృత్రిమ కాంతులు చూసి మన…

Read More

విశాఖపట్నం కలెక్టరేట్ లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు.

Read More

AP: మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ. కానీ బాణసంచా మార్కెట్‌లో సందడి లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 70-80% వరకు అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 25శాతం వ్యాపారం కూడా జరగలేదని విజయవాడలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రతి ఇంట్లో చెప్పుకోలేనంత నష్టం జరిగింది. దీనికి తోడు పెరిగిన నిత్యావసర ధరలతో టపాసుల కొనడంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిందంటున్నారు వ్యాపారులు.

Read More

అమెరికాలో మెక్సికన్ల తర్వాత ఎక్కువ మంది వలసదారులు ఇండియాకు చెందినవారే ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రస్తుతం 52 లక్షల మంది ఇండో-అమెరికన్స్ ఉండగా, ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. చాలా ఏళ్లుగా వీరు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఓట్లు గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీకి పడే అవకాశం లేదని, యువతలో చాలా మంది ట్రంప్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Read More

కెన‌డా మ‌రోసారి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగింది. తాజాగా భార‌త్‌ను సైబ‌ర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబ‌ర్ నేరాల‌కు భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెన‌డా అనుసరిస్తున్న మ‌రో వ్యూహంగా అభివ‌ర్ణించింది.

Read More

AP: నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన మహిళను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనని హైకోర్టు తీర్పునిచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. నెలలోపు విశాఖపట్నంలోని ఓంకార్ అండ్ లయన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ డబ్బును చెల్లించాలని ఆదేశించింది. వినికిడి లోపం ఉందని ఫేక్ సర్టిఫికెట్‌తో దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించిన ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట నాగ మారుతిని విద్యాశాఖ తొలగించింది.

Read More

ఇండిగో, ఎయిరిండియా విమానాలకు మరో సారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నై-హైదరాబాద్ ఎయిరిండియా, హైదరాబాద్-పుణే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు గోవా-కోల్‌కతా విమానానికి ఇదే తరహా బెదిరింపులు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.

Read More

కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్‌ను తీసుకున్నారు రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్‌తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి.

Read More

గత నెల మలేషియాలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి మనదేశ కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పిన నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గుంటూరు వెంకట్రావు దంపతులను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో హై జంప్ లో గోల్డ్ మెడల్, త్రిబుల్ జంప్ లో సిల్వర్ మెడల్స్ సాధించి మన దేశ జాతీయపతాకాన్ని వెంకట్రావు రెపరెపలాడించారు.

Read More

ప.గో. జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ద్వారక తిరుమల, భీమడోలు మండలాల్లో 9 రోజుల క్రితం నుంచి చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు 5 సీసీ కెమెరాలు, 35 ట్రాప్ కెమెరాలు, బోన్లను సైతం ఏర్పాటు చేశారు. అయినా చిరుత చిక్కలేదు. ప్రస్తుతం చిరుత ఆ ప్రదేశాలలో ఉందా లేక వెళ్లిపోయిందా? అనేది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

Read More